'chalo Raj Bhavan' call demanding JPC probe into Pegasus row ఫోన్ ట్యాపింగ్ వివాదం: రాజ్ భవన్ ముట్టడికి కాంగ్రెస్ పిలుపు..

Telangana congress chalo raj bhavan call demanding jpc probe into pegasus row

TRS, Telangana Congress, Revanth Reddy, Phone tapping, NDA, G Kishan Reddy, Congress, BJP, Ashwini Vaishnaw, IT minister on Pegasus report, pegasus hack, Pegasus snooping row, West Bengal Pegasus spyware issue, Pegasus issue, Suvendu Adhikari, Abhishek Banerjee, Pegasus, Amit Shah, PM Modi, National Politics

Telangana Congress president Revanth Reddy said the Telangana Congress will organise a Chalo Raj Bhavan rally on Thursday demanding a probe by a joint parliamentary committee and an inquiry by a Supreme Court judge into Narendra Modi-led NDA government’s snooping and tapping of phones of Rahul Gandhi and others.

ఫోన్ ట్యాపింగ్ వివాదం: రాజ్ భవన్ ముట్టడికి కాంగ్రెస్ పిలుపు..

Posted: 07/21/2021 02:17 PM IST
Telangana congress chalo raj bhavan call demanding jpc probe into pegasus row

పెగాసస్ ‌స్పై వేర్‌ హ్యాకింగ్ వివాదం నేపథ్యంలో రేపు తెలంగాణ రాజ్ భవన్ ను ముట్టడించనున్నట్టు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి తెలిపారు. నిన్న ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో విలేకరులతో మాట్లాడిన ఆయన.. పెగాసస్ సాఫ్ట్ వేర్ వినియోగంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) లేదంటే దేశసర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఉగ్రవాదులపై నిఘా వేసేందుకు ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేసిన ఈ సాఫ్ట్ వేర్ ను ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాప్ చేసేందుకు ప్రభుత్వం ఉపయోగిస్తోందని ఆరోపించారు.

దేశంలో 121 మంది పెగాసిస్ బాధితులు ఉన్నట్టు ఐటీశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ గతంలో చెప్పారని, ఇప్పటి ఐటీ మంత్రి ఈ సాఫ్ట్ వేర్ ఎక్కడుందని ప్రశ్నించడం ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని బయట పెడుతోందన్నారు. తెలంగాణలోని కేసీఆర్ ప్రభుత్వం కూడా 2015 నుంచి ప్రతిపక్ష నేతల ఫోన్లు, పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోన్లు ట్యాప్ చేస్తోందన్నారు. ఇంటెలిజెన్స్ ఐజీ ప్రభాకర్ రావు నేతృత్వంలో సాఫ్ట్ వేర్ కొనుగోలు చేసి 50 మంది ప్రైవేటు హ్యాకర్లతో కాంగ్రెస్ నేతలు, మీడియా ప్రతినిధులు, న్యాయమూర్తుల ఫోన్లను పరిశీలిస్తున్నారని ఈ నెల 16నే చెప్పానని గుర్తు చేశారు.

పెగాసస్ సాఫ్ట్ వేర్ ను ప్రముఖుల ఫోన్ల ట్యాపింగ్ కు వినియోగిస్తున్నందుకు నిరసనగా దేశవ్యాప్తంగా రేపు రాజ్ భవన్ ల ముట్టడికి ఏఐసీసీ పిలుపునిచ్చినట్టు చెప్పారు. ఇందులో భాగంగా రేపు హైదరాబాదులోని రాజ్ భవన్ ను ముట్టడించనున్నట్టు చెప్పారు. పెగాసస్ పై నిష్పక్షపాత విచారణకు వీలుగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని రేవంత్ డిమాండ్ చేశారు. కాగా, రేవంత్ రెడ్డి, పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ నిన్న రాహుల్ గాంధీని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై చర్చించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TRS  Telangana Congress  Revanth Reddy  Phone tapping  NDA  G Kishan Reddy  Congress  BJP  JPC  SC Judge  National Politics  

Other Articles