Delhi's AIIMS Reports First Bird Flu Death దేశంలో తొలి బర్డ్ ఫ్లూ మరణం నమోదు: ఎయిమ్స్

Delhi s aiims reports first bird flu death this year haryana boy 11

Bird flu, H5N1 avian influenza virus, AIMMS, AIMMS Delhi, Humans, India, Bird Flu Death, Bird flu death india, Haryana, Crime

A 11-year-old boy from Haryana who died today at Delhi's All India Institute of Medical Sciences (AIIMS) was infected with the H5N1 virus, which is also called 'avian influenza' or 'bird flu'. This is believed to be the first case of H5N1 among humans in India, and the first bird flu death this year.

దేశంలో తొలి బర్డ్ ఫ్లూ మరణం నమోదు.. హర్యానాలో పదకొండేళ్ల బాలుడు..

Posted: 07/21/2021 01:25 PM IST
Delhi s aiims reports first bird flu death this year haryana boy 11

దేశంలో తొలి బర్డ్ ప్లూ మరణం సంభవించడం కలకలం రేపుతోంది. ఇప్పటికే కరోనా మహమ్మారి బారిన పడి అనేక మంది అసువులు బాస్తూండగా, మూడవ దశ మరింత తీవ్రంగా, వేగంగా వుంటుందన్న వార్తలతో అందోళన చెందుతున్న దేశప్రజలకు ఇటు బర్డ్ ప్లూ సోకడంతో దేశంలో మనుషులు దీని బారిన పడి మరణించడం ఇదే తొలిసారని వైద్యులు తెలిపారు. కాగా ఈ మరణం దేశప్రజలను మరింత అందోళనకు గురిచేస్తోంది. హర్యానాకు చెందిన 11 ఏళ్ల బాలుడు బర్డ్ ఫ్లూకు చికిత్స పొందుతూ చనిపోయాడన్న వార్త దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది.

ఇండియాలో ఇదే తొలి బర్డ్ ఫ్లూ మరణం కావడం కలకలం రేపుతుండగా, ఫూణేలోని జాతీయ వైరాలజీ ఇనిస్టిట్యూట్ ఈ విషయాన్ని నిర్థారించింది. బాలుడు చనిపోవడంతో ఢిల్లీ ఎయిమ్స్‌లో అతడికి చికిత్స అందించిన వైద్యులు, సిబ్బంది ఐసోలేషన్‌లోకి వెళ్లారు. న్యూమోనియా, లుకేమియా లక్షణాలతో బాధపడుతున్న బాలుడు ఈ నెల 2న ఎయిమ్స్‌లో చేరాడు. అతడికి నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగటివ్‌గా తేలడంతో నమూనాలను పూణెలోని జాతీయ వైరాలజీ సంస్థకు పంపించారు. అక్కడి పరీక్షల్లో బాలుడికి సోకింది బర్డ్ ఫ్లూ అని గుర్తించారు.

బర్డ్‌ఫ్లూ అనేది నిజానికి కోళ్లు, పక్షుల్లో వస్తుంది. దీనిని హెచ్5ఎన్1 వైరల్ లేదంటే ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజాగా పిలుస్తారు. ఈ ఏడాది మొదట్లో మహారాష్ట్ర, గుజరాత్, చత్తీస్‌గఢ్, కేరళ, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్ తదితర రాష్ట్రాలు బర్డ్‌ఫ్లూతో వణికాయి. వేలాది పక్షులు నేలరాలాయి. ఒక్క పంజాబ్‌లోనే 50 వేలకు పైగా పక్షులు మృతి చెందాయి. బర్డ్ ఫ్లూ మనుషులకు సోకడం అరుదని నిపుణులు చెబుతున్నారు. భయపడాల్సినంత ప్రమాదం ఏమీ ఉండదని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles