Suspected drone spotted in Satwari of Jammu జమ్మూ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వద్ద మరోసారి డ్రోన్ సంచారం.. తీవ్ర కలకలం..

Drones spotted near air force station jammu again alert sounded

drone spotted, Jammu Air Force Station, AirForce Station Satwari, Jammu, BSF, Drone activity in Jammu Kashmir, Jammu airforce, Pakistan

Weeks after the deadly drone attack at the air force station in Jammu, another drone movement was detected near the air base early on Wednesday morning. Around 4.05 am on Wednesday, a drone was spotted near the Jammu air base in Satwari, a few hundred metres away from the air base.

జమ్మూ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వద్ద మరోసారి డ్రోన్ సంచారం.. తీవ్ర కలకలం..

Posted: 07/21/2021 04:30 PM IST
Drones spotted near air force station jammu again alert sounded

జమ్మూకశ్మీర్ లో మరోమారు డ్రోన్ సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. ఇరవై ఐదు రోజుల వ్యవధిలో ఏడవ డ్రోెన్ భారత్ లో సంచరించడం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది, జమ్మూలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ పై డ్రోన్ దాడి జరిగి నెల రోజులు తిరగకముందే.. మరో డ్రోన్ అక్కడికే వచ్చి చక్కర్లు కొట్టింది. ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కు కొన్ని వందల మీటర్ల దూరంలోకి ఇది చోచ్చుకువచ్చింది. ఈ రోజు తెల్లవారుజామున 4.05 గంటలకు సత్వారీలోని ఎయిర్ బేస్ వద్ద డ్రోన్ కనిపించినట్టు అధికారులు చెబుతున్నారు. ఎయిర్ బేస్ కు అతి సమీపంలోనే అది తిరుగాడిందన్నారు.

డ్రోన్ కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. జూన్ 27న జమ్మూ విమానాశ్రయంలోని భారత వైమానిక దళం (ఐఏఎఫ్) ఎయిర్ ఫోర్స్ స్టేషన్ పై నిమిషాల వ్యవధిలో డ్రోన్లతో బాంబు దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో స్టేషన్ పైకప్పు దెబ్బతింది. ఆ తర్వాత కూడా రెండు మూడు సార్లు డ్రోన్లు అక్కడ చక్కర్లు కొట్టాయి. ఈ డ్రోన్ల దాడులు, సంచారం వెనుక విదేశీ శక్తులే ఉన్నాయని తమ దర్యాప్తులో తేలిందని జమ్మూకాశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ చెప్పి 24 గంటలు కూడా గడవక ముందే మరోమారు డ్రోన్ ఈ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ పై సంచరించడం కలకలం రేపుతోంది.

భారత భూభాగంలో సుమారు వందల మీటర్ల ఎత్తులో అది సంచ‌రించిన‌ట్లు అధికారులు గుర్తించారు. అనంత‌రం ఆ డ్రోను తిరిగిన‌ ప్రాంతంలో గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు. గ‌త నెల రోజుల వ్య‌వ‌ధిలో ఇటువంటి డ్రోన్లు క‌న‌ప‌డ‌డం ఇది ఏడవసారి. అంతర్జాతీయ సరిహద్దు మీదుగా భారత ప్రాదేశిక భూభాగంలోకి డ్రోన్లను పంపేందుకు ప‌దే ప‌దే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. డ్రోన్ల ద్వారా పాకిస్థాన్ ఉగ్రవాదులు దాడులకు పాల్పడే ప్ర‌య‌త్నాలు చేస్తుండ‌డం‌తో భార‌త సైన్యం రక్షణ చ‌ర్య‌లు తీసుకుంటోంది. అయితే ఉగ్రవాదులకు పాకిస్థాన్ ప్రభుత్వ సహకారం పూర్తిగా లభిస్తోందని భారత అర్మీ వర్గాలు అరోపిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : drone spotted  Jammu Air Force Station  AirForce Station Satwari  Jammu  BSF  Jammu Kashmir  

Other Articles