‘Petrol hike, clear loot of common man’s money’: Sachin Pilot నిట్టనిలువునా సామాన్యుల దోపిడి: కేంద్రంపై సచిన్ మండిపాటు

Direct attack on pockets of common man sachin pilot corners modi govt over fuel price surge

Congress leader, Sachin Pilot, Prime Minister, Narendra Modi, PM Modi, Modi govt, BJP government, Centre, fuel price hike, fuel prices, Sachin Pilot, petrol price, diesel price, fuel surge, PM Modi, Modi Govt, Desi Ghee, Congress, National, Politics

Senior Congress leader and former Rajasthan deputy chief minister, Sachin Pilot launched a scathing attack on the ruling Bharatiya Janata Party (BJP) in Centre on rising fuel prices in the country saying the prices of petrol and diesel are now “more than desi ghee.”

నిట్టనిలువునా సామాన్యుల దోపిడి: కేంద్రంపై సచిన్ మండిపాటు

Posted: 07/17/2021 06:01 PM IST
Direct attack on pockets of common man sachin pilot corners modi govt over fuel price surge

దేశ‌ంలో అంతకంతకూ పెరుగుతున్న ఇంధన ధరలపై కాంగ్రెస్ నేత స‌చిన్ పైల‌ట్ విరుచుకుపడ్డారు. కేంద్రంలోని న‌రేంద్ర మోదీ స‌ర్కార్‌పై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. దేశవ్యాప్త వాహనదారులకు ఇంధన ధరలు పట్టపగలు చుక్క‌లు చూపుతున్నాయని ఎద్దేవా చేశారు. సామాన్యుడి జేబులపై ప్రత్యక్షంగా మోడీ ప్రభుత్వం చేస్తున్న దాడిగా ఆయన అభివర్ణించారు. దేశంలని 250 న‌గ‌రాల్లో పెట్రోల్ లీట‌ర్ రూ వంద దాట‌డం ఊహకు అంద‌ని విష‌య‌మ‌ని ఆయ‌న విస్మ‌యం వ్య‌క్తం చేశారు.

ఈ ఏడాదిలోనే మోదీ ప్ర‌భుత్వం పెట్రోల్ ధ‌ర‌ల‌ను 66 సార్లు పెంచింద‌ని అన్నారు. అంతర్జాతీయంగా ధరలు పెరుగుతున్న క్రమంలో వాహనదారులపై మోపుతున్న భారం మోపుతున్న కేంద్రం.. ధరలు తగ్గిన సమయంలో మాత్రం ఆ మినహాయింపును వాహనదారులకు కల్పించలేదని దుయ్యబట్టారు. ఎక్సైజ్ డ్యూటీ పేరుతో కేంద్రం, పన్ను పేరుతో రాష్ట్రాలు వాహనదారులను లూటీ చేస్తున్నాయని మండిపడ్డారు. గత ఏడాది జూన్ నుంచి క్రమంగా పెరుగుతున్న ఇంధన ధరలకు విరామం ఎప్పుడు ప్రకటిస్తారని ఆయన కేంద్రాన్ని నిలదీశారు.

గ‌త ఏడేండ్ల‌లో పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకం 250 శాతం, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం 800 శాతం పెంచిన‌ట్టు ప్ర‌భుత్వ గ‌ణాంకాలే వెల్లడిస్తున్నాయ‌ని పేర్కొన్నారు. దీంతో ప్ర‌భుత్వానికి రూ 25 ల‌క్ష‌ల కోట్ల రాబ‌డి స‌మ‌కూరింద‌ని ఇది సామాన్యుడి జేబుల‌ను గుల్ల చేయ‌డం కాక మ‌రేమిట‌ని స‌చిన్ పైల‌ట్ ప్ర‌శ్నించారు. ఇక క‌రోనా సెకండ్ వేవ్‌ను ఎదుర్కోవ‌డంలో కేంద్ర ప్ర‌భుత్వం ఘోరంగా విఫ‌ల‌మైందని ఆరోపించారు. ఆక్సిజ‌న్ సిలిండ‌ర్లు, ఆస్ప‌త్రుల్లో ప‌డ‌క‌లు, మందులు ల‌భించ‌క ల‌క్ష‌లాది మంది ప్రాణాలు కోల్పోయార‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sachin Pilot  petrol price  diesel price  fuel surge  PM Modi  Modi Govt  Desi Ghee  Congress  National  Politics  

Other Articles