YouTube cooking channel cross 1 crore subscribers కోటి దాటిన విలేజ్ కుక్కింగ్ ఛానెల్ సబ్ స్రైబర్లు..

Village cooking channel of rahul gandhi s mushroom biryani fame reaches 1 crore youtube subscribers

Village Cooking Channel, tamil youtube channel, rahul gandhi mushroom biryani, rahul gandhi village cooking channel, crore youtube subscribers, chennai news, chennai latest updates, chennai latest news, chennai covid news, chennai youtube channel

The Village Cooking Channel (VCC) has become the first Tamil YouTube channel to hit one crore (10 million) subscribers. The creators of the channel, which got a pan-India appeal with the video of Rahul Gandhi cooking mushroom biryani during the recent election campaign, thanked the subscribers.

రాహుల్ చలువ: కోటి దాటిన విలేజ్ కుక్కింగ్ ఛానెల్ సబ్ స్రైబర్లు..

Posted: 07/06/2021 01:33 PM IST
Village cooking channel of rahul gandhi s mushroom biryani fame reaches 1 crore youtube subscribers

తమకు నచ్చిన విద్యను పలువురు మెచ్చగా దానిని యూట్యూబ్ లో పోస్టు చేయడంతో ఇప్పుడు చాలా మందికి ఇదో ఆదాయ వనరు. టాలెంట్.. వున్నవాళ్లకు కొద్ది పెట్టుబడితో తమ పోస్టులను వీడియో తీసి.. దానిని విపరీతంగా ప్రేక్షకులలోకి తీసుకెళ్తూ.. ఓ వైపు సెటబ్రటి స్టేటస్ ఎంజాయ్ చేస్తూనే మరోవైపు కాసుల వర్షం కూడా కురిపించేసుకుంటున్నారు. ఇక వీరికి కాస్త లక్ కూడా కలిసి వస్తే ఏకంగా మహారాజులే. కాస్త వేగంగా వ్యూస్, సబ్ స్క్రైబర్స్ వస్తుంటే యూట్యూబ్ కూడా వారి వీడియోలను పుష్ చేసి మరికాస్త ఊతమిస్తుంది. పెద్ద పెద్ద సెలబ్రిటీలు మొదలు ఇంట్లో ఉంటూ పిచ్చాపాటి కబుర్లు చెప్పుకొనే గృహిణుల వరకు అందరూ ఇప్పుడు యూట్యూబర్ గా ఒక ప్రయత్నం చేస్తున్నారు.

అయితే.. పెద్ద నెట్ వర్క్స్.. జాతీయ స్థాయి ఛానెళ్లకు కూడా సాధ్యపడని ఓ అరుదైన రికార్డును ఓ రీజనల్ కుకింగ్ ఛానెల్ సొంతం చేసుకొని సంచలనం సృష్టిస్తుంది. విలేజ్ కుక్కింగ్ అనే ఓ యూట్యూబ్ ఛానెల్ మొదలుపెట్టిన మూడేళ్ళ కాలంలోనే ఏకంగా కోటి మంది సబ్ స్క్రైబర్లను సొంతం చేసుకొని అందరినీ షాక్ కి గురిచేస్తుంది. తమిళ భాషలో కుకింగ్ వీడియోలు చేసే ఈ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు దేశవ్యాప్తంగా పేరు మార్మ్రోగిపోతుంది.

ఈ సంవత్సరం జనవరి నెలలో కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీ ఈ ఛానెల్ తో కలిసి వంట చేసి సహపంక్తి భోజనం చేశారు. ఆ వీడియో భారీ స్థాయి వ్యూస్ రాబట్టింది. అదే సమయంలో కోటిమంది సబ్ స్క్రైబర్లను రాబట్టడంలో కూడా ఈ వీడియోలు ఈ ఛానెల్ నిర్వాహాలకు పెద్ద ప్లస్ అయ్యింది. ఒక్కమాటలో చెప్పాలంటే రాహుల్ గాంధీ మీట్ తర్వాత ఈ ఛానల్ పేరు​ దేశంలో మారుమోగిపోయింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ చేసిన ఈ వీడియోలతో విలేజ్ కుక్కింగ్ ఛాలెంజ్ మళ్ళీ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles