కుక్కలకు మనుషులకు అవినాభావ సంబంధం ఏమిటో తెలియదు కానీ.. అవి ఎంత నమ్మకంగా వుంటాయన్న విషయాన్ని చెప్పుకుంటూ పోతే రోజులు కూడా గడుస్తాయి. ఎంతో ప్రాణప్రదంగా పెంచుకునే శునకాలు.. అప్పుడప్పుడూ తప్పిపోతుంటాయి. అయితే అవి అలా తప్పిపోయినా మళ్లీ తిరిగి తమ ఇంటికి వస్తాయన్న విషయం తెలిసినా వాటి యజమానులు మాత్రం వాటి కోసం ఎదురుచూడటం మానరు. అందోళన చెందుతారు. రోడ్డుపై వుంటు వీధి కుక్కల నుంచి తమ శునకానికి ఎటువంటి ప్రమాదం వస్తుందో అని కంగారుపడతారు.
కొందరు యజమానులు మరీ ప్రేమ పెంచుకున్నవారు మాత్రం ఏకంగా పత్రికా ముఖంగా దాని ఫోటోలు పెట్టి ఈ శునకం దొరికితే చెప్పాలని ప్రకటనలు ఇస్తుంటారు. అంతేకాదు ఇలా తమ శునకాన్ని తీసుకోచ్చినవారికి బహుమతులు కూడా ఇస్తామని చెబుతుంటారు. అయితే రోజుల తరబడి తప్పిపోయిన కుక్కలు కొన్నిరోజులకు ఇంటికి చేరుకుంటాయి. పలు అగ్రదేశాలలో తప్పిపోయిన కుక్కలను వెతికి తీసుకుని వచ్చేందుకు కూడా అధికారులు ఉంటారు. అయితే, సౌత్ కరోలినాలో ఓ పెంపుడు కుక్క తప్పిపోయిన చాలారోజుల తర్వాత తనంతట తానే ఇంటికి వచ్చి ఆశ్చర్యకరంగా ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు కాలింగ్ బెల్ ఎలా కొడుతామో అలాగే కొట్టింది.
దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.పెంపుడు జంతువులు తప్పిపోయిన చాలారోజుల తర్వాత తమ ఇళ్లకు తిరిగి వచ్చిన సంధర్భాలు చాలానే ఉన్నాయి. అయితే, ఇంటికి వచ్చి కాలింగ్ బెల్ కొట్టడం కాస్త ఆశ్చర్యకరమే. దాదాపుగా మనుషులు ప్రవర్తించినట్లే ప్రవర్తించిన కుక్క తీరును ఆశ్చర్యంగా చూస్తున్నారు నెటిజన్లు. 23ఏళ్ల మేరీ లైన్ అనే వ్యక్తి కుక్క యజమాని కాగా.. కొద్దిరోజుల క్రితం ఆమె పెంచుకునే కుక్క ఇంటి నుంచి తప్పిపోయింది. అప్పటినుంచి కుక్క కోసం వెతుకుతూనే ఉంది. తన ఫేస్‌బుక్‌లో కూడా కుక్కకు సంబంధించి తప్పిపోయినట్లుగా ఓ పోస్ట్ కూడా పెట్టింది.
తన 18నెలల రాజా మిస్ అయ్యిందంటూ ప్రకటన ఇచ్చింది. అంతగా వెతికినా కనిపించని కుక్క రాజా.. ఎవరి సహాయం తీసుకోకుండానే ఒకరోజు రాత్రి 3 గంటలకు లైన్ ఇంటికి రావడమే కాదు.. వాకిలి వద్ద లోపలికి వెళ్ళడానికి డోర్‌బెల్ కూడా మోగించింది. తెల్లవారుజామున 3 గంటలకు బెల్ మోగగానే అనుమానంతో సీసీటీవీలో ఎవరా? అని చూడగా.. తలుపు దగ్గర కెమెరా ముందు కుక్క కనిపించింది. ఈ ప్రాంతంలో బాణసంచా కాల్చడంతో భయపడి కుక్కు పారిపోయినట్లు చెబుతున్నారు. అయితే, డోర్ బెల్ మోగించడం ఆశ్చర్యంగా అనిపించినట్లుగా సదరు యజమాని చెప్పుకొచ్చారు. మేం ఎప్పుడూ కూడా రాజాకు డోర్‌బెల్ కొట్టడం చూపించలేదని కూడా చెప్పుకొచ్చారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more