దేశంలో కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాల్లో రష్యాకు చెందిన స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ ఒకటి. ఈ టీకా ఒక్కో డోసు ధర రూ.1,145గా ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ వ్యాక్సిన్ కూడా ఉచితంగా లభించ నుంది. ఒకపక్క థర్డ్ వేవ్.. మరోపక్క డెల్టా ప్లస్ వేరియంట్ భయాలు వెంటాడుతున్న తరుణంలో దేశ ప్రజలకు మరో వ్యాక్సిన్ ఉచితంగా అందుబాటులోకి రానుండటం శుభపరిణామం.
టైమ్స్ ఆఫ్ ఇండియా సమాచారం ప్రకారం స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ కూడా త్వరలో ప్రభుత్వ కేంద్రాలలో ఉచితంగా లభించనుంది ప్రస్తుతం, దేశంలో సీరం ఉత్పత్తి చేస్తున్న కోవిషీల్డ్, భారత్ బయోటెక్ కోవాక్సిన్ ప్రభుత్వ కేంద్రాలలో ఉచితంగా లభిస్తోంది. ఇపుడిక ఈ జాబితాలో రష్యా వ్యాక్సిన్ కూడా చేరనుండటం విశేషం. దేశంలో అత్యవసర వినియోగానికి రెగ్యులేటరీ అనుమతి పొందిన స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ ప్రైవేటు ఆసుపత్రుల్లో మాత్రమే అందుబాటులో ఉంది. ఇక ప్రభుత్వ కేంద్రాల్లోనూ ఉచితంగా లభించే అవకాశం ఉందని కోవిడ్-19 వర్కింగ్ గ్రూప్ ప్రెసెడింట్ డాక్టర్ ఎన్కే అరోరా తెలిపారు.
తమ వ్యాక్సిన్ను సైతం ఉచితంగా అందుబాటులో ఉంచాలని కోరుకుంటున్నామని, అయితే టీకా సరఫరాపై ఇది ఆధారపడి ఉంటుందన్నారు. దీంతో దేశంలోవ్యాక్సినేషన్ ప్రక్రియ ఊపందుకోనుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం వ్యాక్సిన్ సరఫరాలో కీలకంగా ఉన్న కోవీషీల్డ్, కోవాక్సిన్తోపాటు, స్పుత్నిక్-వీ, మోడర్నా, జైడస్ క్యాడిలాతో, రోజువారీ టీకాల పంపిణీ 8 నుంచి 10 మిలియన్లకు పెంచవచ్చన్నారు. ఈ సంవత్సరం చివరి నాటికి, 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ అందించాలని నిర్ణయించినట్టు అరోరా చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more