woman's 1 kg Gold Mangalsutra Turns Out to be Fake భార్యకు కిలో బంగారు తాళి గిఫ్ట్ ఇచ్చిన భర్త..

Viral 1 kg gold mangalsutra seen in mumbai couple s anniversary video turns out to be fake

wedding anniversary, mumbai couple, mangal sutra, viral video, social media, netizens, Bhiwandi Police, Bala Koli, mumbai, maharashtra, crime

A viral video of a couple singing together while celebrating their wedding anniversary had attracted a lot of eyeballs on the internet recently, thanks to a massive piece of jewellery that the woman showed off. Bhiwandi Police took cognizance of the viral video and called the man seen in this video to enquire about the unusually massive gold mangalsutra.

భార్యకు కిలో బంగారు తాళి గిఫ్ట్ ఇచ్చిన భర్త.. పోలీసులు షాక్

Posted: 05/24/2021 08:26 PM IST
Viral 1 kg gold mangalsutra seen in mumbai couple s anniversary video turns out to be fake

దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని బివాండీ ప్రాంతానికి చెందిన బాలా కోలి అనే వ్యక్తి తన పెళ్లి రోజు సందర్భంగా తన భార్యకు ఏకంగా కిలో అంటే 1000 గ్రాముల బరువున్న బంగారు మంగళసూత్రాన్ని కానుకగా అందించడం.. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. దీంతో పోలీసులు భర్తను విచారించగా.. అతడు చెప్పిన మాటలు విని.. విస్తుపోయారు. ఇంతకీ ఏం జరిగిందంటే..  పెళ్లైన మహిళలు మెడలో రెండు నుంచి నాలుగు, ఐదు తులాల మేర అంటే 50 గ్రాముల బరువున్న మంగళసూత్రాలు వారి వారి ఆర్థిక తాహత్తు మేర చేయించుకుంటారు. కానీ ఎవరి మెడలోనూ ఏకంగా కేజీ బంగారు మంగళసూత్రం ఉండదు. ఇంకా డబ్బుంటే ఏడు వారాల నగలు చేయించుకుంటారే కానీ కేజీ బంగారంతో తాళి చేయించుకుని మెడలో వేసుకుంటే అది వింత, విచిత్రమే.

మహారాష్ట్రకు చెందిన ఓ మహిళకు తమ పెళ్లి రోజు సందర్భంగా కేజీ బంగారంతో మంగళసూత్రాన్ని చేయించిన భర్త అమెకు కానుకగా ఇచ్చాడు. ఈ విషయం కాస్తా వైరల్ గా మారడంతో ముంబై పోలీసులు సదరు వ్యక్తిని పిలిచి విచారించారు, ‘ఏందీ భారీ మంగళసూత్రం’ కథా కమామీషు.. అంత డబ్బు ఎక్కడ నుంచి తీసుకువచ్చావ్.? అంటూ అన్ని కోణాల్లో విచారించగా, తొలుత గొప్పలకు పోయిన బాల కోలి.. తమదైన స్టైయిల్లో పోలీసులు గధ్దించి అడగంలో అసలు విషయం చెప్పేశాడు. తన భార్యకు గిఫ్టుగా ఇచ్చిన ఒక కేజీ బంగారు మంగళసూత్రం నిజమైనది కాదని.. నకిలీ బంగారం (గిల్టు) అని చెప్పాడు. బంగారు షాపు నుంచి 38వేల రూపాయలకు కొన్నానని చెప్పటంతో పోలీసులు షాక్ అయ్యారు.

దీంతో పోలీసులు అది నిజమా? కాదా? అని విచారించి.. బాలా చెప్పింది నిజమేనని నిర్థారించుకున్న తరువాత వదిలేశారు. ఇక ఈ ఘటనపై ఓ పోలీస్‌ అధికారి మాట్లాడుతూ.. ‘‘ కేజీ బంగారు తాళి వీడియో వైరల్‌ మా దృష్టికి రావటంతో చోరీలు జరుగుతున్న క్రమంలో అది వారికి ప్రమాదమని..దాంతో అతడిని ఎంక్వయిరీకి పిలిపించామని తెలిపారు. అలాగే ఇలా బంగారు నగలు అని పబ్లిసిటీ చేసుకుంటే అది ప్రమాదాలకు దారి తీస్తుందనీ..ఇటువంటి పబ్లిసిటీలు దొంగల్ని ఆహ్వానించటమే. ప్రాణాలమీదకు తెచ్చుకోవటమనేనని తెలిపారు. అందుకే బాలా కోలిని పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించామని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles