super spreaders given first priority in Telangana నిత్యం ప్రజల్లో ఉండే వారి తొలి ప్రాధాన్యత

New vaccination policy in telangana super spreaders given first priority

New vaccine policy in Telangana, New Guidelines for Covid Vaccine in Telangana, Telangana New vaccine policy, Cheif Minister, CM KCR, Covid Vaccine, Global E Tender, superspreader, vaccine policy, new guidelines, new vaccine policy, Telangana

Telangana Government had desinged a new vaccination policy, where the super spreaders get the first priority of vaccination in the state. CM KCR gives nod for the newly drafted vaccination policy.

తెలంగాణలో వ్యాక్సిన్ పాలసీ: నిత్యం ప్రజల్లో ఉండే వారికి తొలి ప్రాధాన్యత

Posted: 05/24/2021 09:49 PM IST
New vaccination policy in telangana super spreaders given first priority

కరోనా వ్యాక్సినేషన్ కోసం ఇదివరకే కేంద్రప్రభుత్వం పలు మార్గదర్శకాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే కేంద్రం మార్గదర్శకాలకు అనుగూణంగా మరో నూతన విధానాన్ని తీసుకువస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాక్సీనేషన్ ప్రక్రియలో ఫ్రంట్ లైన్ వారియర్స్ కు ఇచ్చిన ప్రాధాన్యత క్రమంలోనే సూపర్ స్పెడర్స్ కు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు కరోనా వ్యాక్సినేషన్ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఇక వీరితో పాటు తొలుత 30 ఏళ్లు పైబడిన వారికి ప్రాధాన్యతా క్రమంలో వ్యాక్సిన్ ఇవ్వాలని యోచిస్తున్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ వారి అవసరాలను ఎరిగి అత్యవసర సరుకులను అందించే వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తున్నారు. వీరిలో ముఖ్యంగా పాలు, కూరగాయలు, గ్యాస్ డెలివరీ బాయిస్, మెడికల్ షాపు సిబ్బంది, నిత్యావసర సరుకుల విక్రయదారులు, రేషన్ షాపుల డీలర్లు, సిబ్బందిని పలు వర్గాలుగా విభజించి.. ప్రాధాన్యత క్రమంలో వారందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది.

వైద్య ఆరోగ్య శాఖతో పాటు..రాష్ట్రంలో కొనసాగుతున్న లాక్ డౌన్ అంశంపై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో ఇవాళ సమీక్షసమావేశం నిర్వహించారు. మంత్రి హరీష్ రావుతో పాటు సీఎస్ సోమేష్ కుమార్, పోలీసు ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానంగా వ్యాక్సినేషన్ తో పాటు కొనసాగుతున్న లాక్ డౌన్ కొనసాగింపుపై చర్చిస్తున్నారు. నాలుగు కోట్ల మందికి వ్యాక్సిన్ ఇవ్వాలని, ఇందుకు రూ. 2 వేల 500 కోట్లు ఖర్చు చేయాలని ప్రభుత్వం భావించింది. కానీ.. ప్రస్తుతం సెకండ్ డోస్ దొరకని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో..ప్రభుత్వం గ్లోబల్ టెండర్స్ లు పిలుస్తోంది. మొదటగా ఫ్రంట్ లైన్ వారియర్స్ కు వ్యాక్సిన్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

 జనాభాకు అనుగుణంగా వ్యాక్సిన్ అందడం లేదు. అందులో భాగంగా..వ్యాక్సిన్ పాలసీని రూపొందించింది. పోలీసు విభాగంతో పాటు ఫ్రంట్ లైన్ వారియర్స్ కు వ్యాక్సిన్ ఇవ్వాలని తాజాగా నిర్వహించిన ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 55 లక్షల 28 వేల మందికి పైగా ఫస్ట్ డోస్, 10 లక్షల 74 వేల మందికి వ్యాక్సిన్ వేసింది. ఇప్పటి వరకు కొవిషీల్డ్, కొవాగ్జిన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. స్పుత్నిక్, ఫైజర్ లను కొనుగోలు చేసి రాష్ట్ర ప్రజలకు వ్యాక్సిన్ లను వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. 30 ఏళ్ల పైబడిన వారికి, సూపర్ స్ప్రైడర్స్‌కి వ్యాక్సిన్ ఇవ్వాలని, వచ్చే వారం రోజుల్లో మొదటి డోస్ అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles