High Court grants conditional bail to Dhulipalla Narendra సంగం డైరీ కేసులో ధూళిపాళ్ల నరేంద్రకు బెయిలు..

Sangam dairy case ap high court grants conditional bail to dhulipalla narendra

Sangam Dairy Case, AP High Court, Andhra Pradesh High Court, Dhulipalla Narendra, Dhulipalla Narendra Kumar, Conditional bail, Gopala Krishnan, Bail, Vijayawada, Rajamahendravaram, Rajahmundry,Andhra Pradesh, Politics, crime

TDP senior leader and former Ponnur MLA Dhulipalla Narendra has got a sigh of relief from the Andhra Pradesh High Court as it has granted bail in the Sangam Diary case. He was arrested over the irregularities in the Sangam Dairy case, however, he was granted conditional bail by the Andhra Pradesh High Court.

సంగం డైరీ కేసులో ధూళిపాళ్ల నరేంద్రకు బెయిలు..

Posted: 05/24/2021 03:42 PM IST
Sangam dairy case ap high court grants conditional bail to dhulipalla narendra

సంగం డెయిరీ కేసులో అవకతవకలకు కారణమయ్యారన్న అభియోగాలపై అరెస్టైయిన టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రకు నెలరోజుల తరువాత విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రోన్నతన్యయాస్థానం హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. టీడీపీ సీనియర్ నేత, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్లకు బెయిల్ మంజూరు కావడంతో టీడీపీ కార్యకర్తల్లో ఆనందం వెల్లివిరిసింది. థూళిపాళ్లతో పాటు సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణకు సైతం న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. గత నెల 23న అవినీతి నిరోధకశాఖ అధికారులు ధూళిపాళ్లను అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే.

సంగం డైరీలో అవకతవకలు జరిగాయని వాటిపై కేసులు నమోదు చేసిన అవినీతి నిరోదక శాఖ.. ధూళిపాళ్ల నరేంద్రతో పాటు గోపాలకృష్ణన్ కూడా అరెస్టు చేశారు. ఈ కేసులో నరేంద్రతో పాటు గోపాల్ కృష్ణన్‌ దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు వారికి షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. నాలుగు నెలల పాటు విజయవాడ మునిసిపల్ పరిధిలోనే ఉండాలని కోర్టు ష‌ర‌తు విధించింది. వారు నివాసముంటున్న స్థలం చిరునామాను విచారణ అధికారికి ఇవ్వాలని ఆదేశించింది. అలాగే, విచారణకు 24 గంటల ముందు విచారణ అధికారి నోటీసు ఇవ్వాలని సూచించింది.  

ఇద్దరు వ్యక్తులతో రూ.లక్ష మేర షూరిటీ ఇవ్వాలని న్యాయస్థానం అదేశించిన నేపథ్యంలో ఆయన తరపు న్యాయవాదులు ఆ వ్యవహారాలను పూర్తి చేసే పనిలో వున్నారు. కాగా, ధూళిపాళ్ల నరేంద్ర అరెస్టు నేప‌థ్యంలో నాలుగు వారాలుగా వైసీపీ ప్ర‌భుత్వంపై టీడీపీ నేత‌లు మండిప‌డుతోన్న విష‌యం తెలిసిందే. ఆయ‌న ఇన్ని రోజులు రాజ‌మ‌హేంద్రవ‌రం జైలులో ఉన్నారు. అందులోనే ఆయ‌న‌కు క‌రోనా పరీక్షలు చేయించ‌గా పాజిటివ్ అని తేలడంతో హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఆయ‌న‌ను విజయవాడలోని ఆయుష్ ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందేలా చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles