Raghurama Krishnam Raju to be released after four days బెయిల్ లభించినా.. రఘురామకృష్ణరాజు విడుదలకు బ్రేక్..!

Raghurama krishnam raju to be released on bail after four days amid treatment

Raghurama Krishnam Raju to be released after 4 days, Raghuram Krishna Raju, Sedition Charges, Narsapuram MP, Guntur jail, Secundrabad Army Hospital, District Cou rt Magistrate, Supreme Court, Guntur, treatment, Andhra Pradesh, Crime

The release of Narsapuram MP Raghuram Krishna Raju has been postponed. The Guntur District Court Magistrate inquired about the health condition of Raghuram at the Secunderabad Army Hospital and discharge summary was requested from the hospital.

బెయిల్ లభించినా.. రఘురామకృష్ణరాజు విడుదలకు బ్రేక్..!

Posted: 05/24/2021 05:35 PM IST
Raghurama krishnam raju to be released on bail after four days amid treatment

సొంత పార్టీపైనే వ్యతిరేక గళం వినిపించిన వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజుకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బెయిలు మంజూరు చేసినా ఆయన విడుదలకు మాత్రం అరోగ్యమే అవాంతరంగా మారింది. ఇవాళ బెయిల్ పై విడుదల కావాల్సిన ఆయన చికిత్స పొందుతున్నారు. దీంతో ఇవాళ బెయిలుపై విడుదల కావాల్సిన ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది. విడుదలకు మరో నాలుగు రోజులు వేచి ఉండక తప్పదని ఆయన తరపు న్యాయవాది లక్ష్మీనారాయణ తెలిపారు. గుంటూరులోని జిల్లా మెజిస్ట్రేటు న్యాయస్థానం ఆయనకు బెయిలు మంజూరు చేసినా.. ఆయన విడుదలలో జాప్యం ఎందుకు జరుగుతోంది.? అన్న వివరాల్లోకి వెళ్తే..

తనను అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో పోలీసులు తనపై దాడి చేశారని, దెబ్బలు కానరాకుండా తనను హరికాళ్లు వాయిపోయేలా కోట్టారని ఆయన దేశ సర్వోన్నత న్యాయస్థాన ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. దీంతో అత్యున్నత న్యాయస్థానం ఆయనకు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో జుడీషియల్ అధికారి సమక్షంలో పరీక్షలు చేసి.. నివేదికను సీల్డు కవరులో తమకు అప్పగించాలని, ఇక దీంతో పాటు ఈ ప్రక్రియ మొత్తాన్ని వీడియో చిత్రీకరణ చేసి దానిని కూడా తమకు సమర్పించాలని సర్వోన్నత న్యాయస్థానం సుప్రంకోర్టు అదేశించింది. ఈ క్రమంలో జిల్లా న్యాయస్థానంలో రఘురామ కృష్ణరాజు అరోగ్య పరిస్థితిపై మేజిస్ట్రేట్ అడిగి తెలుసుకున్నారు.

ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ సమరీని ఆయన కోరారు. ఈ నేపథ్యంలో, రఘురాజుకు మరో నాలుగు రోజుల పాటు వైద్యం అవసరమని మేజిస్ట్రేట్ కు ఆర్మీ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఈనెల 21న రఘురాజుకు సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దీంతో, ఆయనను విడుదల చేసే అవకాశం ఉండటంతో... ఆయన తరపు న్యాయవాదులు సీఐడీ కోర్టుకు వెళ్లారు. ఆర్మీ ఆసుపత్రి నుంచి రఘురాజును నేరుగా విడుదల చేసేందుకు అనుమతించాలని కోర్టును కోరారు. అయితే, రఘురాజుకు మరో నాలుగు రోజులు చికిత్స అవసరమని వైద్యులు చెప్పడంతో... ఆయన విడుదల ప్రక్రియ మరో నాలుగు రోజుల పాటు ఆలస్యం కానుంది. నాలుగు రోజుల తర్వాత సీఐడీ కోర్టులో మరోసారి ష్యూరిటీ పిటిషన్ వేస్తామని న్యాయవాది లక్ష్మీనారాయణ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles