vendor couple hands over jackpot to customer జాక్ పాట్ టిక్కెట్ ను.. గెలిచిన వ్యక్తి ఇచ్చిన దంపతులు

Parents of two hands over jackpot to customer who had not paid for ticket

lottery vendor, Smija K. Mohan, Rs 6 cr jackpot, mathematics graduate, honesty, financial problems, Aluva, Ernakulam district, Kerala police, kerala police facebook salute, lottery vendors, jackpot ticket, Kerala

A lottery vendor who handed over a Rs 6-crore jackpot-winning ticket to a buyer who had not paid her or cleared his past dues is being extolled for her honesty across Kerala. Smija K. Mohan, 37, a mathematics graduate who sells lottery tickets on the roadside in Aluva, Ernakulam district, played down suggestions that she had shown extraordinary honesty in handing the promised ticket over to a client who had not paid for it.

నిలువెత్తు నిజాయితీ: జాక్ పాట్ టిక్కెట్ ను.. గెలిచిన వ్యక్తి ఇచ్చిన దంపతులు

Posted: 03/27/2021 04:30 PM IST
Parents of two hands over jackpot to customer who had not paid for ticket

కేరళ పోలీసులు తమ అధికారిక ఫేస్ బుక్ పేజీలో ఓ వివాహిత ఫోటోను పోస్టు చేసి అమెకు పెద్ద సెల్యూట్ చేశారు. ఎందుకిలా చేశారు. అసలామె ఎవరు.? అని సర్వత్రా ప్రశ్నలు తలెత్తాయి. అమె ఓ లాటరీ టిక్కెట్ల విక్రేత. తన భర్తతో కలసి అమె ఎర్నాకుళం జిల్లాలోని అళువ గ్రామంలో రోడ్డు పక్కన లాటరీ టికెట్లను విక్రయిస్తోంది. అయితే అమె లాటరీలు విక్రయించే ఫోటోను కేరళ పోలీసులు తమ అదికార ఫేస్ బుక్ పోస్టులో ఎందుకు పోస్టు చేసి.. సెల్యూట్ చేశారు.? అన్న సందేహాలు ఉత్పన్నం అవుతున్నాయా..

అయినవారి మధ్య, అన్నదములు, అక్కాచెలెళ్ల మధ్య, అమ్మానాన్నలకు సంతానానికి మధ్య పేచీ పెట్టే తమాషా చూసేది ఒక్క డబ్బు అన్న విషయం తెలిసిందే. వేల రూపాయలు కాదు వందల రూపాయల కోసం హత్యలు జరుగుతున్నాయి. మానవీయ విలువలకు తిలోదకాలు ఇచ్చి.. మనిషి కరెన్సీ నోటు చుట్టూ తిరుగుతున్నా దారుణ రోజులు వచ్చాయి. రక్త సంబంధాలు, పేగు బంధాలను కూడా తుంచేస్తున్నాయి. అయినా అళువకు చెందిన ఈ లాటరీ విక్రయ దంపతులు మాత్రం నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు. తాము తమ కష్టాన్ని నమ్ముకున్నామని, ఇతరుల అదృష్టాన్ని కాదని.. అంటున్నారు. ఇంతకూ వీరు నిజాయితీకి నిలువెత్తు రూపంగా ఎందుకు మారారు.

ఎర్నాకుళం ప్రాంతానికి చెందిన ఆ దంపతులు.. జాక్ పాట్ తగిలిన టికెట్‌ ను.. ఫోన్ ద్వారా దానిని కొన్న వ్యక్తి ఇంటికి వెళ్లి ఇచ్చేశారు. అంతేకాదు సదరు వ్యక్తి నుంచి ఏకంగా 1450 రూపాయల బాకీలను కూడా వసూలు చేసుకున్నారు. అయితే అంతకుముందు రోజు సాయంత్రమే వారు ఈ టికెట్ జాక్ పాట్ కోట్టిందని కూడా సదరు వ్యక్తికి సమాచారం చేరవేశారు. టికెట్ పైన అతని పేరు వుందోమో.. లేక ఫోన్ నెంబరు వుందేమో.. అన్న సందేహాలు అవసరం లేదు. టికెట్ ఎవరి వద్ద ఉంటే వారికే డబ్బులు లభించే వెసలు బాటు వుందని వారికి తెలిసినా వారు ఆశపడలేదు.

ఏదోలే చిన్నమెత్తమే కదా అని వదిలేశారో అన్న సందేహం కూడా అవసరం లేదు ఎందుకంటే ఏకంగా ఆ టికెట్ జాక్ పాట్ కోట్టింది. ఏకంగా రూ.6 కోట్ల ప్రైజ్ మనీని గెలుచుకుంది. అంత పెద్దమొత్తం కళ్ల ముందు లాటరీ టికెట్ రూపంలో కనబడుతున్నా.. దానిని భద్రంగా కొన్న వ్యక్తికి అప్పగించి తమ బాధ్యతను తీర్చుకున్న ఈ దంపతులు నిజాయితీకి నిలువెత్తు రూపం కాదంటారా.! ఇక అందులోనూ టికెట్ డబ్బులు కూడా చెల్లించని వ్యక్తి.. కేవలం ఫోన్‌ ద్వారానే లాటరీ టికెట్‌ కొనుగోలు చేసిన వ్యక్తి టికెట్ ను అందించిన వీరు తమ నిజాయతీని చాటుకున్నారు.

ఎర్నాకుళంలోని వలంబుర్‌కక్కనాడ్ కు చెందిన దంపతులు స్మిజా కే మోహన్, రాజేశ్వరన్ లు లాటరీ టికెట్లు విక్రయిస్తుంటారు. రోజూలాగానే గత ఆదివారం రాజగిరి ఆసుపత్రికి సమీపంలో లాటరీ టికెట్లను అమ్ముతున్నారు. 12 టికెట్లు మినహా అన్నీ అమ్ముడైపోయాయి. వీటిని అమ్మి ఇంటికి వెళదామంటే ఎవరూ కొనడం లేదు. తరచుగా తన దగ్గర టికెట్లు కొనే వారికి సమాచారం అందించి తీసుకోవాలని చెప్పారు స్మిజా. వారిలో పాలచోటిల్ కు చెందిన పీకే చంద్రన్‌ ఉన్నారు. చంద్రన్ కి ఫోన్‌ చేసి టికెట్‌ కొనాల్సిందిగా కోరారు.

అయితే టికెట్‌ కొనడానికి కావల్సిన రూ.200 ప్రస్తుతం తన దగ్గర ఇప్పుడు లేవని మరునాడు ఇస్తానని అన్నాడు. సరే అని ఫోన్ లోనే టికెట్‌ నంబర్‌ చెప్పారు స్మిజా. ఇక అంతకుముందు కొన్న పలు టికెట్లకు కూడా అతను డబ్బు చెల్లించలేదు. అయినా పర్వాలేదని భావించిన సిజ్మా.. అతని టికెట్ల నెంబరును చెప్పగా.. అతను ఓ నెంబరును తన కోసం పక్కనపెట్టమన్నాడు. మరుసటి రోజు సాయంత్రం లక్కీడ్రా తీయగా అతనికి చెప్పిన టికెట్టు నంబర్‌కే రూ.6 కోట్లు వచ్చాయి. ఆ విషయాన్ని వెంటనే అతనితో సిజ్మా చెప్పింది. ఆటపట్టిస్తున్నావని అనుకున్నా.. కాదు నిజమని చెప్పింది.

ఇక మరుసటి రోజు ఉదయం తన భర్తతో కలసి చంద్రన్ ఇంటికి వెళ్లి  టికెట్ ను అందించింది. ఇక చంద్రన్ అప్పటివరకు అమె వద్ద తీసుకున్న లాటరీ టికెట్ల బాకీ మొత్తం రూ. 1450 మొత్తాని ఇచ్చాడు. ఇక అప్పటివరకు లాటరీ టికెట్ల కోసం కూడా లాటరీ కొట్టేందుకు అలోచించిన చంద్రన్.. ఈ డబ్బుతో తన పెద్ద కూతురికి ఇళ్లు, రెండో కూతురి వివాహం, కొడుకు విద్య, వ్యాపారానికి డబ్బును వెచ్చిస్తానని అన్నాడే తప్ప.. తనకు అదృష్టాన్ని ఇంటి గుమ్మం వరకు తీసుకువచ్చి ఇచ్చిన సిజ్మా దంపతులను మాత్రం మర్చిపోయాడు. ఇక ఈ దంపతులకు ఆరు కోట్లు పెట్టినా రాని గొప్ప ఆదరణ మాత్రం సొంతమైంది. వీరిని సన్మానిస్తామని పలు సంఘాలు క్యూకట్టాయి. ఇక కేరళ పోలీసులే ఏకంగా అధికారిక ఫేస్ బుక్ లో సెల్యూట్ చేశారంటే.. వీరి ఔన్నత్యం ముందు ఆరు కోట్లు నిలువగలదా.? అనిపిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles