Viral Video: Thirsty Crow Opens Tap To Drink Water వైరల్ వీడియో‌: కాకులు కూడా అప్ డేట్ అయ్యాయి.. దాహమేస్తే..!

Skilled crow opening a tap to drink water leaves netizens impressed

crow, crow opens tap,video of crow, crow drinks water,crow video, crow water video, sushanth nanda, sushanth nanda IFS, viral videos, trending, trending videos

Adding a modern touch to the old thirsty crow story, a crow has found a new way to quench his thirst. Recently, a video is doing rounds on social media that shows a crow opening a tap and drinking water. The video has gone viral on social media and netizens took to the comments section to share their views.

ITEMVIDEOS: వైరల్ వీడియో‌: కాకులు కూడా అప్ డేట్ అయ్యాయి.. దాహమేస్తే..!

Posted: 03/27/2021 10:49 PM IST
Skilled crow opening a tap to drink water leaves netizens impressed

కాకులు కూడా అప్ డేట్ అయ్యాయి. శతాబ్దాల నాటి దాహం వేసిన కాకి గురించి ఇప్పటికీ పాఠ్యపుస్తకాలలో చదువుతున్న చిన్నారి విద్యార్థులను చూసి.. ఇక అప్ డేట్ కావాల్సిన సమయం ఆసన్నమైందని అనుకుందో ఏమో తెలియదు కానీ.. పాత చింతకాయ పచ్చడి లాంటి కుండలో అడుగున నీళ్లు.. రాళ్లను తీసుకువచ్చి నింపు.. దాహం తీర్చుకుని ఎగురిపోయిన కాకి గురించి ఇక ఆపండి.. ఇప్పుడు కుండల్లో నీళ్లు కూడా కరువవుతున్నాయి. కేవలం కుళాయిలో నీళ్లే దిక్కవుతున్నాయని అంటోంది ఈ కాకి. అదేంటి అంటారా.. అయితే స్టోరిలోకి ఎంటర్ కావాల్సిందే.

ఈ రోజుల్లో మనుషులు కూడా పెద్దగా కష్టపడాలని భావించడం లేదు. అలాంటప్పుడు మేము మాత్రం ఎందుకు అలాగే వుండాలి.. మేము పెద్దగా కష్టపడకుండానే అందివచ్చిన వాటితో మా అవసరాలను తీర్చుకోవాలని అని అనుకుందేమో ఈ కాకి. పెద్దగా కష్టపడకుండా ఈజీగా తన దాహం తీర్చుకునేందుకు ఏ చెట్టు మీద నుంచి ఎన్ని పర్యాయాలు నిశితంగా గమనించిందో తెలియదు కానీ.. దీని పరిశీలనా శక్తికి మాత్రం జేజేలు కొట్టాల్సిందే. ఎందుకంటే.. ఎక్కడినుంచో ఎగురుకుంటూ వచ్చి ఓ కుళాయి మీద కూర్చున్న కాకి తన ముక్కుతో దాహార్తిని తీర్చుకుంది.

కాళ్లతో బలంగా ఆ కుళాయిని తిప్పడంతో పాటు తన ముక్కుతో బలంగా ఓ వైపున కొట్టింది. దీంతో కుళాయి నుంచి నీళ్లు రాగా, వాటిని ఎంచక్కా తాగి దప్పిక తీర్చుకుంది. ఇక్కడివరకు బాగానే ఉన్నా చివర్లో ఆ కుళాయిని కట్టేసిందా? లేదా? అన్నది మాత్రం క్లారిటీ లేదు. ఈ వీడియోను అటవీశాఖ అధికారి సుశాంత్‌ నందా తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేయగా వైరల్‌గా మారింది. కాకి తెలివి చూసిన నెటిజన్లు 'దీని తెలివి సల్లగుండ..' అని అబ్బురపడుతూ కామెంట్లు చేస్తున్నారు. కొందరు మాత్రం అది కుళాయి బంద్‌ చేయలేదంటూ కాకి మీద చిరుకోపం ప్రదర్శిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : crow  crow opens tap  crow drinks water  viral videos  

Other Articles