Ramesh Jarkiholi finally booked in sex-for-jobs scam రాసలీలల సీడీలో మరో ట్విస్టు.. మాజీమంత్రిపై కేసు..

Sex for job scandal woman shares third video says will file a complaint against jarkiholi

Sex scandal, Ramesh Jarkiholi, Third Video, FIR filed against former Minister Ramesh Jarkiholi, Ramesh Jarkiholi Sex scandal, Cubbon Park Police Station, lawyer Jagadish Kumar, Karnataka, Crime, Politics

In a new twist to the ongoing probe into the sex scandal allegedly involving former Minister Ramesh Jarkiholi, an FIR was registered against him on a complaint by the woman, said to be in the purported video.

రాసలీలల సీడీలో మరో ట్విస్టు.. మూడో సీడి విడుదల.. మాజీమంత్రిపై కేసు..

Posted: 03/27/2021 02:51 PM IST
Sex for job scandal woman shares third video says will file a complaint against jarkiholi

కర్ణాటక రాజకీయాలను కుదిపేసిన రాసలీల సీడీ వివాదంలో మరో ట్విస్ట్‌ చోటుచేసుకుంది. సెక్స్ ఫర్ జాబ్ స్కామ్ లో అభియోగాలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి రమేశ్‌ జార్కిహొళి బాధితురాలి తరపున ఆమె న్యాయవాది బెంగళూరు కమీషనర్ కార్యాలయంలో పిర్యాదు చేశారు. దీంతో కమీషనర్ అదేశాలతో మాజీ మంత్రిపై కబ్బన్ పార్కు పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది. రాసలీలల సీడీ యువతి మూడో వీడియోను అజ్ఞత ప్రాంతం నుంచి విడుదల చేశారు.

తాను అజ్ఞాతంలో ఉన్నానని, న్యాయవాది ద్వారా కమిషనర్ కమల్ పంత్ కు తన ఫిర్యాదును పంపుతున్నానని ఆమె వీడియో సందేశంలో పేర్కొన్నారు. ఇక ఈ వీడియో విడుదలైన నేపథ్యంలో అమె అడ్వొకేట్‌ కేఎన్‌ జగదీశ్‌కుమార్‌ నగర పోలీసు కమిషనర్‌ కమల్‌పంత్ కు యువతి ఫిర్యాదును అందించారు. ఆ వెంటనే రమేశ్‌ జార్కిహొళిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. తాజా పరిణామాలపై బీజేపీ ఘాటుగా స్పందించింది. ఆ తర్వాత కాసేపటికే యువతి పేరిట విడుదలైన ఆడియోలో కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకు మార్‌ పేరు ప్రస్తావించటం కలకలం రేపుతోంది.

కాగా, ‘సమస్య వచ్చింది. ఎదుర్కొంటా, భయపడను అసలు ఆట ఇప్పుడే మొదలైంది.. రేపటి నుంచే నా అస్త్రాలు వదులుతా’ అని మాజీ మంత్రి రమేష్‌ జార్కిహొళి సవాల్‌ విసిరారు. రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చిన తర్వాత తమపై కుట్ర మొదలైందన్నారు. కాగా, రాసలీలల సీడీ కేసు యువతి తన ఇంట్లో వారితో (తమ్ముడు) ఫోన్‌లో చేసిన సంభాషణగా చెబుతున్న ఒక ఆడియో విడుదలైంది. జార్కిహోళిపై బాధిత యువతి ఫిర్యాదు చేసిన కొన్ని గంటల్లోనే ఈ ఆడియో బయటకు రావడం విశేషం. 6.59 నిమిషాల నిడివి కలిగిన ఈ ఆడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

‘‘వీడియో నిజం. కానీ అందులో ఉన్నది నేను కాదు. అదంతా గ్రాఫిక్స్, వాయిస్‌ మాడ్యులేషన్‌.. అన్ని క్లియర్‌ చేస్తాను. డీకే శివకుమార్‌ వారి వైపు కోసం ఎదురు చూస్తున్నాను. మీ మద్దతు లేకుంటే ఎలా.. తమ్ముడు.. నన్ను నమ్ము.. నేనెందుకు అలాంటి పని చేస్తాను. అందరూ నన్నే అనుమానిస్తున్నారు. వార్తల్లో చూపించేదంతా అబద్ధం. ఎవరో వాయిస్‌ను మాడ్యులేషన్‌ చేశారు. డీకే శివకుమార్‌కు సంబంధించిన వారు వస్తారు. మళ్లీ కాల్‌ చేస్తాను. అసలు వీడియో వారి వద్దే ఉంది. అమ్మ, నాన్నను నువ్వే హ్యాండిల్‌ చేయ్‌’’ అని చెప్పింది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles