Trade Union's stir against centre statement on Vizag Steel కేంద్రమంత్రి వ్యాఖ్యలపై విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల నిరసన

Statewide bandh call against privatisation of vizag steel plant

Niramala Sitharaman, Finance Minister, Vizag Steel Plant privatisation, Agitations, Trade Unions, Employees, VSP privatisation, Vizag Steel Plant privatisation, statewide bandh, APSRTC services, Privatization of PSU, Visakha steel plant, somu veerraju, ISPAT, Vishaka steel Plant, trade Union agitation, Visakhapatnam North Constituency, non-political JAC, Vishakapatnam, Andrha Pradesh, Politics

The Vizag Steel Parirakshana Committee and the Trade Unions, hundreds of employees came out protesting against the Union Finance Minister Key Statement on privatisation of Vizag steel plant, they opposed centre decision. The agitations are continuing since last night after FM had clarified her government decision on steel plant.

ITEMVIDEOS: "స్టీల్ ప్లాంటు అమ్మేస్తాం" అన్న నిర్మల వ్యాఖ్యలపై పెల్లుబిక్కిన నిరసన

Posted: 03/09/2021 11:19 AM IST
Statewide bandh call against privatisation of vizag steel plant

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని వందశాతం ప్రైవేటీకరిస్తాం.. ఎట్టి పరిస్థితుల్లోనే అమ్మేస్తామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తమ ప్రభుత్వ నిర్ణయాన్ని బద్దలుకొడుతూ వెలువరించడంతో విశాఖలో ఒక్కసారిగా అలజడి రేగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ తాము గత కొన్ని రోజులుగా చేస్తున్న ఉద్యమాన్ని అసలు పరిగణలోకి తీసుకోని కేంద్రం.. ఏకపక్షంగా ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరిస్తామని చెప్పడం.. కేంద్రప్రభుత్వం అహంకారపూరిత ధోరణికి నిదర్శనమని కార్మికసంఘాల నేతలు విమర్శలు చేస్తున్నారు.

నిన్న పార్లమెంటులో నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు కార్మిక లోకానికి తీవ్ర ఆగ్రహానికి గురిచేశాయి. విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ సమితీ నేతృత్వంలో కార్మిక సంఘాలతో పాటు స్థానిక ప్రజలు, వందలాది కార్మికులు అర్థరాత్రి నుంచి ఆందోళనలను కోనసాగిస్తున్నారు. ఉదయం పూట మాత్రమే చేస్తున్న ఆందోళనకు మరింత ఉద్ధృతం చేసేందుకు కార్మికులు గత రాత్రి నుంచి రాత్రిళ్లు కూడా నిర్వహించాలని నిర్ణయించారు. ప్రభుత్వ రంగ సంస్థలను వదిలించుకోవడమే ప్రభుత్వం పరమావధిగా భావిస్తోందని, తద్వారా వచ్చే నిధులను కేంద్రంలోని మోడీ సర్కార్ ఎన్నికలలో ఖర్చు చేసేందుకు వినియోగిస్తోందని కార్మిక సంఘాల నేతలు విమర్శిస్తున్నారు.

జాతీయ రహదారిపై కూర్మన్నపాలెం కూడలి ఉక్కు పరిశ్రమ ప్రధాన ద్వారం వద్ద పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. మానవహారంతో రహదారిని దిగ్బంధించారు. కేంద్రప్రకటనతో ఉన్న ప్రతులను దహనం చేశారు. ఇవాళ విశాఖలోని ఉక్కు పరిపాలనా భవనం ముట్టడికి ఉక్కు పోరాట కమిటీ పిలుపునిచ్చింది. నిన్న లోక్‌సభలో వైసీపీ ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, గొడ్డేటి మాధవి అడిగిన ప్రశ్నలకు మంత్రి నిర్మలా సీతారామన్ బదులిస్తూ.. కర్మాగారంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి వాటా లేదని, వంద శాతం అమ్మేస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) జనవరి 27న సూత్రప్రాయంగా ఆమోద ముద్ర వేసినట్టు స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles