Former Union minister beats up woman party worker మహీళాపై చేయిచేసుకున్న అశోక్ గజపతిరాజు

Ashok gajapathi raju beats up woman party worker during campaigning for local polls

Former Union minister, TDP leader, Ashok Gajapathi Raju, woman party worker, local polls election campaining, Vizianagaram, Chandrababu, Election code, Vizianagaram municipal election Campaign, Andhra Pradesh, Politics

Former minister and TDP leader Ashok Gajapathi Raju has beaten up a woman party worker during campaigning for local polls at Vizianagaram in Andhra Pradesh. Pusapati Ashok Gajapathi Raju is an Indian politician and the former Union Minister for Civil Aviation in the Narendra Modi Government.

ITEMVIDEOS: టీడీపీ మహీళా కార్యకర్తపై చేయిచేసుకున్న అశోక్ గజపతిరాజు

Posted: 03/08/2021 03:32 PM IST
Ashok gajapathi raju beats up woman party worker during campaigning for local polls

టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు 'సహనం కొల్పోయారు. ఆశించిన స్థాయిలో పార్టీ కార్యకర్తలు రాకపోవడంతోనో.. లేక మరే కారణమో తెలియదు కానీ ఆయన ఇవాళ విజయనగరం జిల్లా ఎన్నికల ప్రచారంలో ఓ మహిళ చెంపచెల్లుమనిపించారు. ఏకంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజునే ఆయన తన పార్టీకి చెందిన మహిళా కార్యకర్తపై చేయిచేసుకోవడంతో ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. దీంతో ఆయన ఎన్నికల ప్రచార ర్యాలీలో అపశృతి చోటుచేసుకుంది. ఈ ఘటనకు దారితీసినపరిస్థితులు ఇలా వున్నాయి.

రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ఇవాళ సాయంత్రం ఐదు గంటలతో తొలి అంకానికి తెరపడనుంది. దీంతో అన్ని పార్టీల నేతలు తమ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించారు. ఇందులో భాగంగా ఇవాళ విజయనగరం జిల్లాలో అశోక్ గజపతిరాజు కూడా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అయితే అయన వచ్చిరాగనే పై పార్టీకి చెందిన మహిళ కార్యకర్తలు.. అభిమాన నేతపై పూలు చల్లారు. దీనిని ముందే పనిగట్టిన ఆయన ఎవర్వనీ తనపై పూలు చల్లవద్దని సూచించారు. అయినా ఆయన సూచనలను పట్టించుకోకుండా అభిమాన నేతపై పూలు జల్లి అభిమానం చాటుకుంది ఓ మహిళా కార్యకర్త.

ఉద్దేశ్యపూర్వకంగానే తన కంటిపై పూలతో కొట్టారని సదరు మహిళపై ఆయన చేయి చేసుకున్నారు. విజయనగరంలోని పూల్ బాగ్ లో టీడీపీ కార్యకర్తతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కొన్ని బంతిపూలు ఆయన కంటికి తగిలాయి. దీంతో ఆయన అసహనానికి గురయ్యారు. మహిళ తనపై కావాలనే పూలు చల్లిందని, ఆమెపై చేయిచేసుకున్నారు. ఆయన అవేశంగా వెళ్తుండగా, అడ్డుకునేందుకు ప్రయత్నించినా ఓ కార్యకర్త ఆయన ఆగ్రహాన్ని చూసి పక్కకు తప్పుకున్నారు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది.

ఎప్పుడూ సౌమ్యంగా ఉండే ఆయన చేయి చేసుకోవడంపై కార్యకర్తలు ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. అయితే అమరావతి కోసం నినదిస్తున్న మహిళా రైతులుకు ఇదేనా కానుక అంటూ గుంటూరులో ప్రశ్నించిన టీడీపీ అధినేత చంద్రబాబు.. అశోక్ గజపతి రాజు విషయాన్ని కూడా కలపి టార్గెట్ చేస్తున్నాయి విపక్ష పార్టీలు. మీ పార్టీ సీనియర్ నేతలు సహనం కోల్పోయి మహిళా దినత్సవం రోజునే మహిళపై దాడి చేస్తే.. మీరెందుకు మౌనంగా వున్నారంటూ చంద్రబాబును నెటిజనులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనను మన్సాన్ ట్రస్టు చైర్ పర్సెన్ సంచయిత స్పందించారు. ఇలాగేనా మహిళలకు మీరిచ్చే గౌరవం అని ప్రశ్నించారు. పురుష అహంకార భావజాలంతో ఉన్న ఒక మహిళాద్వేషి నుంచి ఇంతకన్నా ఎక్కువ ఆశించలేం అని విమర్శించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles