Lakhs of farmers will reach Parliament, if needed: Tikait కేంద్రానికి రైతుల మరో అల్టిమేటం.. పార్లమెంటును ముట్టడిస్తాం..

Will reach parliament on lakhs of tractors if needed rakesh tikait

farmers rail roko, farmers candle march, protest delhi, farmers laws farm, farmers rail roko agitation, farmers protests, farmers protests delhi border, barricades at delhi border, singhu border farmers protests, police barricades, protest delhi, farmers laws farm, farmers tractor rally, farmers rally violent, farmers farm laws, delhi police, Intelligence bureau, supreme court committee, delhi, politics

Bharatiya Kisan Union leader Rakesh Singh Tikait warned that if needed, their tractors would reach the Parliament to press the government for the repeal of contentious farm laws. He also said that attacked the Centre and said the leaders chosen by voters are powerless. "He can't reply to us on his own. He gets back with files and returns with replies," he also said.

కేంద్రానికి రైతుల మరో అల్టిమేటం.. పార్లమెంటును ముట్టడిస్తాం..

Posted: 03/09/2021 11:57 AM IST
Will reach parliament on lakhs of tractors if needed rakesh tikait

కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా వంద రోజులకు పైగా రైతులు దేశరాజధాని ఢిల్లీ శివార్లలో నిరసన కార్యక్రమాలను శాంతియుతంగా చేపడుతున్నారు. అయినా ప్రభుత్వం తమను పట్టించుకునే స్థితిలో లేదని, అసలు రైతులతో తమకు వచ్చిన నష్టమేంటి.. దానిని ఎలా పూడ్చుకోవాలన్న ఎన్నికలు, ఓట్ల గణంకాలుగానే పరిగణిస్తూ.. పబ్బం గడుపుకుంటోందని రైతు సంఘాల నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దేశంలోని అన్ని ఉద్యమాలను అణిచివేస్తున్న కేంద్రం.. తమ ఉద్యమాన్ని కూడా అణివేసేందుకు ప్రయత్నాలు చేసి విఫలమయ్యిందని అరోపించారు.

ఈ క్రమంలో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్రంలోని ప్రభుత్వం యంత్రాంగం పూర్తిగా పశ్చిమ బెంగాల్ కు పయనమయ్యిందని, ఈ క్రమంలో తాము వారిని ఈ నెల 13న అక్కడే కలుస్తామని రైతు సంఘాల నేతలు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఇక దీనికి తోడు ఇవాళ తాజాగా భారతీయ కిసాన్ యూనియన అధ్యక్షుడు రాకేష్ తికాయత్ మీడియాతో మాట్లాడుతూ.. రైతు సమస్యలపై కేంద్రం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని.. తాము చేస్తున్న నిరసన కార్యక్రమాలను కూడా లక్ష్యపెట్టడం లేదని, అసలు రైతుల శ్రమను. వారి ఎలాంటి స్వార్ధ చింతన లేకుండా దేశానికి చేస్తున్న సేవను కూడా విస్మరిస్తోందని దుయ్యబట్టారు.

ఇదే తీరున కేంద్రం వ్యవహరిస్తే.. లక్ష ట్రాక్టర్లతో పార్లమెంటును ముట్టడిస్తామని కేంద్రానికి తికాయత్ అల్టిమేటం జారీ చేశారు. కేంద్రప్రభుత్వం తక్షణం తాము తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను బేషరుతుగా వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేశంలోని ప్రజల ఓట్లతో గెలిచిన పార్లమెంటు సభ్యులు, నేతల చేతుల్లో ఎలాంటి పవర్ లేదని విమర్శించారు. వాళ్లు మనకు సంఘీభావం తెలుపురని, కనీసం అడిగిన వాటికి కూడా సమాధానం ఇవ్వరని, వాళ్లు ఫైళ్లతో వెళ్లి.. జవాబులతో తిరిగివస్తారని రాకేశ్ తికాయత్ తూర్పారబట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles