Rahul Gandhi slams PM Modi over renaming of Motera stadium మొతేరా స్టేడియానికి మోదీ పేరు.. రాహుల్ విమర్శలు..

Pm modi stadium reveals truth about hum do humare do rahul gandhi

motera stadium, sardar patel stadium, narendra modi stadium, congress, bjp, rss, rahul gandhi, ravi shankar prasad, prakash javadekar, BJP President, JP Nadda, ahmedabad stadium, Sonia Gandhi, Rajiv Gandhi, National politics

Former Congress president Rahul Gandhi said that the renaming of the stadium after PM Modi and its two ends after Reliance and Adani has revealed the truth. With the ‘HumDoHumareDo’ hashtag, Gandhi wrote on Twitter, “Beautiful how the truth reveals itself.

మొతేరా స్టేడియానికి మోదీ పేరు.. రాహుల్ విమర్శలు.. తిప్పికోట్టిన బీజేపి

Posted: 02/25/2021 01:33 PM IST
Pm modi stadium reveals truth about hum do humare do rahul gandhi

గజరాత్ లోని అహ్మదాబాద్ మొతేరాలోని స్పోర్స్ట్ కాంప్లెక్స్ కు భారత్ ఉక్కుమనిషి, దేశ తొలి హోం మినిస్టర్ సర్దార్ వల్లభబాయ్ పటేల్ పేరుగా కొనసాగుతున్న స్టేడియాన్ని పునఃనిర్మాణం చేసిన తరువాత దానిని భారత ప్రస్తుత ప్రధాని నరేంద్రమోడీ పేరుగా మార్చడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దేశంలోనే అత్యంత పెద్దదైన మొతేరా స్టేడియానికి వల్లభభాయ్ పటేట్ పేరును తొలగించి.. ప్రధాని మోదీని పేరు పెట్టడం స్వతంత్ర సమరయోధుడిని అవమానించడమేనని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు.

వల్లభభాయ్ పటేల్ పేరున అత్యంత భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం.. ఆ తరువాత మొతేరాలో ఆయన పేరునున్న స్టేడియాన్ని పునఃనిర్మించడం.. దానికి ఆయన పేరును తొలగించి మోదీ పేరుగా నామకరణం చేయడం అంతా బీజేపి పథకం ప్రకారమే చేసిందని రాహుల్ గాంధీ విమర్శించారు. కేవడ్యాలోని పటేల్ విగ్రహ నిర్మాణం వెనుకు ముందు నుంచే కుట్ర సాగిందన్న అనుమానాలను కాంగ్రెస్ వ్యక్తం చేసింది. అతిపెద్ద క్రికెట్ స్టేడియానికి మోదీ పేరును పెట్టడం వారికి పటేల్ పట్ల వున్న ప్రేమను, చిత్తశుద్దని బహిర్గతం చేస్తోందని కూడా దుయ్యబట్టారు.

ఈ క్రమంలో స్టేడియంలోని రెండు వైపులకు వారికి మద్దతునిచ్చే అంబానీ, అదానీల పేర్లను పెట్టడంతో వారికి ఈ వాణిజ్యవేత్తల పట్ల ఎంతటి ప్రేమ ఉందన్న విషయం దానంతట అదే బయటపడుతోందని రాహుల్ తీవ్రంగా విమర్శలు చేశారు. ఇక కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్ దీప్ సూర్జేవాలా కూడా ఇది పటేల్ ను అవమానించడమేనని విమర్శించారు. ప్రధాని మోడీ ప్రభుత్వం ఇప్పటికే కాంగ్రెస్ పథకాలను మార్చి తమ పేర్లు పెట్టుకుందని విమర్శించారు. కాగా ఈ రకమైన పేరు మార్పు పథకాలకు మాత్రమే కాలేదన్నారు.

దేశ స్వతంత్ర సమరయోధుల పేరునున్న కట్టడాలకు కూడా వర్తింపజేయడం నిజంగా వారిని అవమానించడమేనని అన్నారు. ప్రధాని మోడీ ప్రభుత్వం అమలు చేయాలని అనుకున్న మూడు మార్పులను నిర్విఘ్నంగా కొనసాగిస్తుందని అన్నారు. వాటిల్లో ఒకటి అమ్మకాలను చేపట్టడం.. రెండు నిలిపివేయడం.. మూడు పేర్లు మార్పు చేయడం.. దిగ్విజయంగా కొనసాగుతున్నాయని విమర్శించారు. ఇక మరోఅడుగు ముందుకేసీన కాంగ్రెస్ నేత డాక్టర్ మనీష్ దోషి.. ఆర్ఎస్ఎస్ ను బహిష్కరించిన పటేల్ పై బీజేపి ప్రతీకారం తీర్చుకుంటోందని కూడా విమర్శించారు.

ఇక దీనిపై స్పందించిన బీజేపి నేతలు స్పోర్ట్స్ కాంప్లెక్స్ పేరు సర్థార్ వల్లభభాయ్ పటేల్ అనే వుందని, కానీ అందులో నిర్మించిన స్టేడియానికి ప్రధాని మోదీ పేరు పెట్టామని పేర్కోంది. ఇక పటేల్ పేరు మార్చామని విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ నేతలు ఇప్పటి వరకు దేశంలో నిర్మించి అత్యంత ఎత్తైన పటేల్ విగ్రహాన్ని సందర్శించారా.? అలాంటిది చేకకుండా విమర్శలకు మాత్రమే కట్టుబడితే ప్రజలు విశ్వసించరని పేర్కోంది. పటేల్ జీవించినప్పుడు కానీ ఆయన మరణానంతరం కానీ ఏ మాత్రం గౌరవం, గుర్తింపును ఇవ్వని కాంగ్రెస్ ఇప్పడు విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles