చైన్ స్నాచర్లు, మొబైల్ స్మార్ట్ఫోన్ స్నాచర్లు రోజురోజుకీ పెరుగిపోతున్నారు. మహిళలను, వయస్సుపైబడిన మధ్యవయస్కులతో పాటు వృద్దులను టార్గెట్ చేసే దొంగలు వారి మెడలోంచి తమ చైన్లను, సెల్ ఫోన్లను లాక్కుని పారిపోతుంటారు. ఇలాంటే ఘటనలను ఎదుర్కోన్న చాలా మంది మహిళలు కేకలు వేస్తూ సాయాన్ని అర్థించగా, వారికి సాయం చేసేవారు స్పందించేలోగా దొంగలు అక్కడి నుంచి వాయువేగంతో వెళ్లిపోవడంతో వారి ఆచూకీ తెలియకుండా పోతుంది. అయితే ఇలాంటి ఘటనను ఎదుర్కోన్న ఓ మహిళ మాత్రం దొంగను టార్గెట్ చేసి మరీ పట్టుకుంది.
ఇందుకోసం రాత్రి సమయం అని కూడా బెరకుచెందని యువతి ఏకంగా ఆరువందల మీటర్ల దూరం పాటు దొంగను వెంబడించింది. అతడి ముఖాన్ని పట్టేసుకున్న యువతి దొంగ ఎక్కడికి పరిగెత్తాడు.. ఎక్కడ దాక్కున్నాడు అన్ని విషయాలను నిశితంగా గమనిస్తూనే అతడ్ని వెంబడించింది. ఇందంతా ఓ కంట కనిపెడుతూనే పరుగెత్తుకెళ్లిన దొంగ.. అమె ఇక రాదని భావించినా.. ఎందుకనో అతడు కూడా కీడు శంఖించి మెల్లిగా వెళ్లి ఓ గల్లిలోకి దూరి అక్కడ గోడ వెనుక నక్కాడు. దీంతో మహిళ.. వెంబడించి అతడు నక్కిన చోటు నుంచే లాక్కుని వచ్చి తన ఫోన్ ను లాక్కుంది. దీంతో అతనికి స్థానికులు దేహశుధ్ది చేసి పోలీసులకు అప్పగించారు.
హైదరాబాదులోని యూసఫ్ గూడలో చోటు చేసుకున్న ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే సికింద్రాబాద్ కు చెందిన భూమిక అనే మహిళ ఓ బొటిక్ లో డిజైనర్ గా పనిచేస్తోంది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్.12లోని తన కార్యాలయంలో విధులు ముగించుకుని యూసుఫ్ గూడ చెక్ పోస్ట్ వద్దకు చేరుకుంది. మెట్రో రైలు ఎక్కేందుకు నడుచుకుంటూ వెళ్లిన అమెకు పదిన్నర తరువాత మెట్రో రైళ్లు ఆ మార్గంలో నడవడం లేదని తెలిసి కిందకు చేరుకుని క్యాబ్ బుక్ చేసుకుందామని తన సెల్ ఫోన్ తీసి క్యాబ్ కోసం వెతుకుతుంది.
అమెను అంతకు కొద్ది సమయం నుంచి గమనిస్తున్న దొంగ.. ఆమె వెనకాలే వచ్చి.. ఆమె చేతిలో ఉన్న ఫోన్ లాక్కొని పరుగు తీశాడు. దీంతో భూమిక అరుస్తూ.. దొంగ వెనకాలే పరిగెత్తింది. దొంగ కృష్ణానగర్ వైపు పరుగు తీయడంతో అమె కూడా అటుగానే పరుగుతీసింది. మహిళ అలా పరుగెత్తడంతో ఓ వాహనదారుడు అపి.. వివరాలు తెలుసుకుని అమెను తన బైక్ పై ఎక్కించుకుని కృష్ణానగర్ కు చేరుకున్న తరువాత డ్రాప్ చేశాడు. శ్రీకృష్ణానగర్ లోని సింధు టిఫిన్ సెంటర్ వీధిలో దొంగను గుర్తించిన భూమిక అతడి కాలర్ పట్టుకొని లాగి, అతడి చేతిలో ఉన్న తన సెల్ఫోన్ ను లాక్కుంది.
అనంతరం స్థానికులు మహిళ చేతిలో సెల్ ఫోన్ ను దొంగలిస్తావా అంటూ అతడికి దేహశుద్ది చేశారు. ఈలోగా అతడ్ని కొట్టవద్దని పోలీసులకు అప్పగిద్దామని చెప్పిన మహిళకు స్థానికులు సాయంగా.. దొంగ పారిపోకుండా పట్టుకున్నారు. భూమిక 100కి ఫోన్ చేయడంతో వెంటనే జూబ్లీహిల్స్ పోలీసులు అక్కడికి చేరుకుని దొంగను అరెస్టు చేశారు. అతడి పేరు జే నవీన్ నాయక్ (20)గా గుర్తించారు. అయితే సినీపరిశ్రమలో జూనియర్ అర్టిస్టుగా పనిచేస్తున్నా.. గత కొంత కాలంగా ఎలాంటి అవకాశాలు రాక.. అతడు అప్రయత్నంగానే దొంగగా మారాల్సివచ్చిందని తెలిసింది.
(And get your daily news straight to your inbox)
Apr 03 | ఉత్తరప్రదేశ్ లో జరగనున్న పంచాయతీ ఎన్నికలు ఈసారి గ్లామరెస్ గా మారనున్నాయి. తాను పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ఫెమినా మిస్ ఇండియా -2015 రన్నరప్ దీక్షాసింగ్ ప్రకటించింది. జౌన్ పూర్ జిల్లా బక్షా... Read more
Apr 03 | ఎనబై ఏళ్లకు పైబడిన వయస్సులోనూ అమె తన జీవనం కోసం అలోచించకుండా పది మంది కడుపు నింపే పనికి పూనుకున్నారు. అందరూ తన బిడ్డల లాంటి వారేనని, అమె అందరికీ అందుబాటు ధరలోనే ఇడ్లీలు... Read more
Apr 03 | బెంగళూరు డ్రగ్స్ కేసు..శాండిల్ వుడ్ పరిశ్రమను షేక్ చేసి అక్కడి ప్రముఖులను ఊచలు లెక్కపెట్టించిన కేసుకు సంబంధించిన లింకులు తెలంగాణలోనూ బయటపడ్డాయి. ఆ మధ్య పలువురు నటుల చు్ట్టూ తిరిగిన ఈ కేసులో వారి... Read more
Apr 03 | అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్న అసోంలో బీజేపీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. అసోం బీజేపి ప్రతినిధిగా ముఖ్యమంత్రి సోనూవాల్ ను అధిగమించి మరీ దూసుకుపోతున్న రాష్ట్ర మంత్రి హిమంత విశ్వశర్మపై చర్యలు తీసుకున్నఎన్నికల కమీషన్... Read more
Apr 03 | తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం అంకానికి మరికొన్ని గంటల వ్యవధిలో తెరపడుతుందన్న తరుణంలో రాజకీయ పార్టీల మధ్య విమర్శలు ప్రతివిమర్శలు, అరోపణలు ఊపందుకుంటున్నాయి. మరీముఖ్యంగా బీజేపిని టార్గెట్ చేస్తున్న ప్రతిపక్ష పార్టీ డీఎంకే అధినేత... Read more