Paytm good news to 2.6 lakh FASTag users ఫాస్ట్ ట్యాగ్ వాహనదారులకు ‘పేటియం’ గుడ్ న్యూస్..

Paytm payments bank helps 2 6 lakh fastag users get back wrongly deducted toll charges

business, companies, Paytm Payments bank, Fastag, Paytm dispute cases, toll plaza, refund of toll charges, Vehicle owners, customers, Economy

Paytm Payments Bank said it has won 82 percent of dispute cases on behalf of FASTag users with toll plazas in 2020 and facilitated refund of wrongly deducted toll charges to 2.6 lakh customers.

ఫాస్ట్ ట్యాగ్ వాహనదారులకు ‘పేటియం’ గుడ్ న్యూస్..

Posted: 02/25/2021 12:17 PM IST
Paytm payments bank helps 2 6 lakh fastag users get back wrongly deducted toll charges

దేశంలోనే అత్యధిక ఫ్యాస్ట్ ట్యాగ్ లను విక్రయించిన అతిపెద్ద పేమెంట్స్ బ్యాంక్ గా అవతరించిన పేటియం సంస్థ.. తాజాగా వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. గత ఏడాది 2020వ సంవత్సరంలో జాతీయ రాహదారులపై ఏర్పాటు చేసిన టోట్ ప్లాజాల ద్వారా 2.6 లక్షల మంది ఫ్యాస్ట్ ట్యాగ్ వినియోగదారుల నుంచి తప్పుగా వసూలు చేసిన టోల్ చార్జీ రుసుము మొత్తాన్ని తిరిగి చెల్లించేందుకు పేటీయం తన వినియోగదారులకు సహయపడనుంది. దీంతో తాము ఆయా టోల్ ప్లాజాల మీదుగా వెళ్లకపోయినా తమ ఫాస్ట్ ట్యాగ్ అకౌంట్ మొత్తంలోంచి తీసుకున్న మొత్తం తిరిగి వాహనదారులకు చేరనుందని పేటియం పేమెంట్స్ బ్యాంకు వాహనదారులకు శుభవార్తను చెప్పింది.

ఫాస్ట్ ట్యాగ్ వున్న వాహ‌నాన్ని త‌ప్పుగా గుర్తించ‌డం లేదా టోల్ ప్లాజాల ద్వారా పొర‌పాటుగా రెండుసార్లు టోట్ చార్జీలను వసూళ్లు చేయడం లాంటి వాటిని గుర్తించి.. వాటిని సవరించే క్రమంలో వాహ‌న య‌జ‌మానుల‌కు అందించ‌డానికి జ‌రిపే చెల్లింపులను సుల‌భ‌త‌రం చేసిన‌ట్లు పేటీఎమ్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ ప్ర‌క‌టించింది. ఇందుకుగాను పేటీఎమ్ చెల్లింపుల సంస్థ వేగ‌వంత‌మైన ప‌రిష్కార యంత్రాంగాన్ని ఏర్పాటు చేసింది. ఇది టోల్ ప్లాజాల్లో జ‌రిగే త‌ప్పుడు చెల్లింపుల‌ను వెంట‌నే గుర్తించి ప‌రిష్కారం చూపుతుంది.

ఫాస్టాగ్‌ల ద్వారా టోల్ ఛార్జీల ఆటోమేటిక్ చెల్లింపును నిర్దారించేట‌ప్పుడు కొన్ని సార్లు టోల్ ప్లాజాల‌ వ‌ద్ద ఉన్న సిస్ట‌మ్స్ మ‌రియు ప్రాసెస్‌ల‌లో స‌మ‌స్య‌లు కార‌ణంగా అస‌లు ఛార్జీ కంటే ఎక్కువ వ‌సూలుకు కార‌ణ‌మ‌వుతున్నాయి. ఇటువంటి క‌స్ట‌మ‌ర్ ఫిర్యాదుల‌న్నింటినీ త్వ‌రిత‌గ‌తిన ప‌రిష్క‌రించ‌డానికి, `పీపీబీఎల్‌` (పేటీఎమ్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌) త‌న‌ క‌స్ట‌మ‌ర్ల ఫిర్యాదులు, అనుబంధ టోల్ లావాదేవీలు, టోల్ ప్లాజాల్లో జ‌రిగే స‌మ‌స్య‌ల‌ను పూర్తిగా ఆడిట్ చేసే ఒక ఖ‌చ్చిత‌మైన వివాదాల‌ను నివారించే నిర్వ‌హ‌ణ ప్రక్రియ‌ను ప్ర‌వేశ‌పెట్టింది.

ఇప్పటికే దాదాపుగా పేటీఎమ్ పేమెంట్స్ బ్యాంకు త‌మ వినియోగ‌దారుల త‌ర‌పున ఇటువంటి 82శాతం కేసుల‌ను ప‌రిష్క‌రించింది. ఫాస్ట్ ట్యాగ్ ద్వారా టోల్ ప్లాజాల‌లో  జ‌రిగే  చెల్లింపుల‌లో వినియోగ‌దారులు ఎదుర్కొనే ఫిర్యాదుల‌ను సాధ్య‌మైనంత వేగంగా ప‌రిష్కారించాడానికి, స‌రైనా టోల్ మొత్తాన్ని వసూలు చేసేలా నిరంత‌రం ప్ర‌య‌త్నిస్తామ‌ని..  పేటీఎమ్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్, సీఈఓ స‌తీష్ గుప్తా తెలిపారు.


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles