Lawyer PV Nagamani requested DCP for Police Protection న్యాయవాదుల హత్య కేసు: డీసీపీని రక్షణ కోరిన పీవీ నాగమణి

Telangana lawyer couple murder pv nagamani requested dcp for police protection

Veldi Vasantha Rao, Kunta Srinivas, DCP Ravinder, PV Nagamani Audio Tape, Akkapaka Kumar, Bittu Srinu, Murder, Lawyer Couple, Telangana High Court, Chief Justice Telangana High court, Justices Hima Kohli, HIgh Court Division Bench, Justice B. Vijaysen Reddy, Gattu Vaman Rao, PV Nagamani, Manthani, Ramagundam Police, Telangana, crime

In an audio clip which went viral in social media on Friday, lawyer Vaman Rao’s wife PV Nagamani was heard explaining to deputy commissioner of police, Peddapalli, P Ravinder on the inaction on the part of Ramagudam police despite the temple issue being brought to the notice of police commissioner and also local police station.

న్యాయవాదుల హత్య కేసు: డీసీపీని రక్షణ కోరిన పీవీ నాగమణి

Posted: 02/20/2021 01:23 PM IST
Telangana lawyer couple murder pv nagamani requested dcp for police protection

తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనంగా మారిన న్యాయవాద దంపతుల కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. తెలంగాణ పోలీస్ శాఖ పనితీరునే ప్రశ్నించేలా వున్న మరో ఆడియో వెలుగుచూసింది. ఈ కేసు విషయంలో పోలీసుల నిర్లిప్తత ఎంతలా వుందో స్పష్టం చేసేలా.. ఆ నిర్లక్ష్యమే న్యాయవాదుల ప్రాణాలను హరించేలా మారిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇక ఈ ఆడియో టేపులో హుతురాలైన న్యాయవాది పివీ నాగమణితో మాట్లాడిన పోలీసు అధికారి వ్యవహారశైలిపై కూడా పలు విమర్శలు వస్తున్నాయి.

గుంజపడుగు రామాలయం విషయంలో తమకు రక్షణ కల్పించాలని న్యాయవాది నాగమణి  డీసీపీ రవీందర్ ను కోరిన ఆడియో కలకలం రేపుతోంది. శుక్రవారం రాత్రి ఈ ఆడియో క్లిప్పింగ్‌ సోషల్‌ మీడియాలో వైరల్ గా మారింది. గుంజపడుగు గ్రామంలోని ఆలయం విషయంలో కుంట శ్రీనివాస్‌ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని, తమకు రక్షణ కల్పించాలని నాగమణి డీసీపీని కోరారు. ఈ విషయంలో స్థానిక పోలీసులు తమ ఫిర్యాదును పట్టించుకోవడం లేదని, ఎస్సై తమ ఫోన్‌ లిఫ్ట్‌ చేయడం లేదని, మీరైనా స్పందించాలని విజ్ఞప్తి చేశారు.

అయితే, డీసీపీ రవీందర్‌ ఆమెకు రక్షణ విషయం కల్పించే విషయాన్ని పదే పదే దాటవేస్తూ.. ప్రతీది పోలీసుల పరిధిలోకి రాదని, ఆలయానికి సంబంధించిన గ్రామ సర్పంచ్ చర్యలు తీసుకుంటారని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఈ విషయంలో సర్పంచ్ తో సమస్య పరిష్కారం కాని పక్షంలో దానిపై జిల్లా అధఇకారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రతీదానికి పోలీసుల శాఖను జోక్యం చేసుకోవాలని కోరడంలో అర్థం లేదని చెప్పిన ఆయనకు అడ్డుతగులుతూ.. రక్షణ కల్పించాలని చెప్పినా పట్టించుకోని.. స్వయంగా గ్రామ సర్పంచ్ పోలీసులకు పిర్యాదు చేసినా.. చర్యలు తీసుకున్న నాథుడే కరువయ్యాడని అమె ఆయన దృష్టికి తీసుకువచ్చారు.

సర్పంచ్ నేతృత్వంలోని ఆలయ కమిటీ రామాలయ పర్యవేక్షణ వ్యవహారాలను చూసుకుంటుందని చెప్పినా.. కుంట శ్రీను అనే వ్యక్తి సుమారు 50 నుంచి 60 మందితో వచ్చి దౌర్జన్యాలకు పాల్పడుతున్నాడని అమె పిర్యాదు చేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరినా పోలీసులు చర్యలు తీసుకోలేదని అరోపించారు. ఇక ఆలయకమిటీ సభ్యులకు రక్షణ కల్పించాలని కోరినా పోలీసు అధికారులు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని అమె అవేదన వ్యక్తం చేశారు. దీంతో రామాలయానికి రక్షణ కల్పించడం దేశంలోనే ఎక్కడ జరగదని పోలీసు అధికారి అమెతో అన్నారు. అయితే రక్షణ కల్పించాలంటూ న్యాయవాద దంపతులు తమను ఎప్పుడూ సంప్రదించలేదని గురువారం పోలీసులు వెల్లడించిన నేపథ్యంలో నాగమణి స్వయంగా డీసీపీ రవిందర్ ను రక్షణ కోరిన ఆడియో క్లిప్పింగ్‌ ప్రస్తుతం నెట్టింట్లో సంచలనం సృష్టిస్తోంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles