Mamata launches Rs 5 meal scheme ఉడకబెట్టిన గుడ్డుతో భోజనం.. ’కేవలం రూ.5కే..

Bengal polls mamata takes a cue from jayalalithaa launches rs 5 meal scheme for poor

Bengal Elections 2021, Mamata Banerjee, Rs 5 meals, poor, daily wage earner, Kolkata Municipal Corporation, free health insurance, Bengal polls, maa scheme, West Bengal, Politics

West Bengal CM Mamata Banerjee on Monday flagged off a similar scheme titled ‘Maa’ (mother) offering a lunch plate with rice, daal, veg and egg curry at Rs 5. The common kitchen named 'Maa' will offer food between 1 pm and 3 pm and lunch will be given on a first come first serve basis.

ఉడకబెట్టిన గుడ్డుతో భోజనం.. ’కేవలం రూ.5కే..

Posted: 02/15/2021 08:09 PM IST
Bengal polls mamata takes a cue from jayalalithaa launches rs 5 meal scheme for poor

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రవేశపెట్టిన అమ్మ క్యాంటీన్ తరహాలోనే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా రూ.5కే గుడ్డుతో బోజనం పథకాన్ని ఇవాళ ప్రారంభించారు. ముందుగా ఈ పథకాన్ని కొల్ కతా పురపాలక సంఘం పరిధిలోని 16 ప్రాంతాల్లో ప్రారంభించారు. దీనిని త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తారని కూడా అమె ప్రకటించారు. రాష్ట్రంలోని పేదలు, దినసరి కూలీలతో పాటు ఆకలిగోన్న వారందరూ తిసేందుకు సౌకర్యం కల్పిస్తున్నారు. దీంతో రాష్ట్రంలోని పేదలు, దినసరి కూలీలు కూడా కడుపునిండా బోజన వసతి లభించనుంది.

ఈ పథకంలో కోసం రూ. 100 కోట్ల రూపాయలను విడుదల చేసిన మమతా బెనర్జీ.. అధికారికంగా ఇవాళ ఈ పథకాన్ని ప్రారంభించారు. జయలలిత తరహాలోనే మా పథకంగా ఈ పథకానికి నామకరణం చేశారు. ఇక రాష్ట్రంలో బీజేపి ఎత్తుగడలకు ప్రజలు గురికాకుండా పైఎత్తు వేశారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలకు జరగనున్న ఈ రాష్ట్రంలో ఇటీవలే మమతా బెనర్జీ రాష్ట్రంలోని ప్రజలందరికీ జీవిత భీమా సౌకర్యాన్ని ఉచితంగా కల్పించారు. ప్రజలు తమ జేబుల్లోంచి ఒక్క రూపాయ కూడా చెల్లించకుండా వారికి భీమా సౌకర్యం కలిగేలా మమతా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

ఒక వైపు భీమా సౌకర్యంతో రాష్ట్రంలో ఎవరూ మరణించినా.. వారి కుటంబాలకు భీమా సంస్థల నుంచి భీమా సొమ్ము అందుతుంది. ఇక అదే సమయంలో రాష్ట్రంలోని పేదలందరికీ కేవలం ఐదు రూపాయలకే గుడ్డుతో బోజనం కల్పించడంలో.. పేదలు, దినసరి కూలీలు, అటోవాలాలు, రిక్షావాలాలు, భవన నిర్మాణ కార్మికులు ఇలా అన్ని వర్గాల పేదలకు ఈ పథకం ఎంతగానే ఉపయుక్తం కానుంది. మధ్యహ్నం 1 నుంచి మూడు గంటల వరకు అమ్మా కిచెన్ లలో బోజనం అందుబాటులో వుంటుంది. అయితే ముందు వచ్చిన వారికి మాత్రమే బోజనం అందుతుంది.

ఈ మెనూలో అన్నం, పప్పు, కూరగాయలతో పాటు గుడ్డు కూర కూడా ఉండనుంది. ఈ భోజనానికి రూ.15ల సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది. రాష్ట్రంలోని స్వయం సహాయక బృందాలు ఈ కిచెన్లను నిర్వహించనున్నాయి. ప్రతిరోజూ మధ్యాహ్నం 1గంటనుంచి 3గంటల వరకు భోజనం సరఫరా చేయనున్నట్టు మమత తెలిపారు. అలాగే, ఈ కిచెన్లను క్రమంగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించనున్నట్టు మమతా బెనర్జా వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bengal Elections 2021  Mamata Banerjee  Rs 5 meals  maa scheme  West Bengal  Politics  

Other Articles