No CAA In Assam If Comes To Power: Rahul Gandhi ‘‘ప్రజలను దోచేస్తారా..’’ ఎల్సీజీ గ్యాస్ ధరల పెంపుపై రాహుల్ ఫైర్

Looting from public rahul gandhi attacks centre over lpg price hike

Rahul Gandhi, Congress Party, assam, assembly elections, narendra modi, CAA, Tea workers, Gujarat businessmen, LPG Gas, subsidy gas cylinder, UPA, NDA, BJP, farmers protests, farmers protests delhi border, barricades at delhi border, singhu border farmers protests, police barricades, protest delhi, farmers laws farm, republic day farmers, farmers tractor rally, farmers farm laws, delhi police, Intelligence bureau, delhi, National, politics

The government is "looting from the public" and is helping in the development of only "two", Congress leader Rahul Gandhi said today in a fresh attack on the centre as the price of each domestic LPG cylinder was hiked by ₹ 50 in Delhi.

‘‘ప్రజలను దోచేస్తారా..’’ ఎల్సీజీ గ్యాస్ ధరల పెంపుపై రాహుల్ ఫైర్

Posted: 02/15/2021 03:45 PM IST
Looting from public rahul gandhi attacks centre over lpg price hike

2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు వేటిని బీజేపి ప్రచారాస్త్రాలుగా వాడుకుందో.. ఆ తరువాత దేని ధరలు తగ్గాయని, ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించారో.. అవే ఇప్పుడు ఆకాశాన్ని తాకుతుండటం.. అయినా ప్రభుత్వం ఎలాంటి మినహాయింపులు కల్పించకుండా ధరల మీద ధరలను పెంచుతూ వెళ్తండటంపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో పైర్ అయ్యారు. ఓ వైపు ఇంధన ధరలు పెంచుతూ వాహనదారుల జేబులు గుళ్ల చేస్తున్న కేంద్రం, ఇంధన సంస్థలు.. తాజాగా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను కూడా పెంచుతూ సామాన్యుల పాలిగ గుదిబండగా మార్చడంపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

ప్రజలను కేంద్ర ప్రభుత్వం దోచుకుంటోందని దుయ్యబట్టారు. గ్యాస్ సిలిండర్ ధర ఒకేసారి రూ. 50 పెరగడంపై ఆయన తన సామాజిక మాద్యమ అకౌంట్ ద్వరా ట్వీట్ చేస్తూ, 'సబ్ కా సాథ్... సబ్ కా వికాస్' అంటూ నినాదాలు చేసే ప్రధాని  మోదీ... జనాలను దోచేస్తూ, కేవలం ఇద్దరికి మాత్రమే వికాసాన్ని అందిస్తున్నారని విమర్శించారు. అయితే ఆ ఇద్దరి పేర్లను మాత్రం ఆయన వెల్లడించలేదు. కొత్త వ్యవసాయ చట్టాలపై విమర్శలు గుప్పిస్తూ గతంలో రాహుల్ ట్వీట్ చేసిన సందర్భంగా... అంబానీ, అదానీలను ట్యాగ్ చేయడం గమనార్హం.

దీంతో వారిద్దరూ అనిల్ అంబానీ, గౌతమ్ అదానీలే అయి ఉంటారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇద్దరు ధనవంతులైన వ్యాపారవేత్తల కోసం మోదీ పని చేస్తున్నారని ఆయన విమర్శించారు. సామాన్య ప్రజల సంక్షేమాన్ని మోదీ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. ఇక అంతకుముందు అసోంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి శంఖం పూరించిన ఆయన శివసాగర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీలపై నిప్పులు చెరిగారు. సీఏఏ అని రాసున్న అక్షరాలను కొట్టివేసినట్టున్న కండువాను ధరించిన రాహుల్ మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని విభజించేందుకు బీజేపీ, ఆరెస్సెస్ కలిసి కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు.

‘‘రాష్ట్రాన్ని విభజించడం వల్ల రాష్ట్ర ప్రజలకు, దేశంలోని మిగతా ప్రాంతాలకు తీరని హాని జరుగుతుంది. దేశం మీకెంత అవసరమో, దేశానికీ మీరు అంతే అవసరం. ప్రపంచంలోని ఏ శక్తీ రాష్ట్రాన్ని విభజించలేదు. అసోం ఒప్పందం జోలికి రావాలని చూసే వారికి కాంగ్రెస్, రాష్ట్ర ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు’’ అని హెచ్చరించారు. అసోంలో తమ పార్టీ అధికారం ఇస్తే పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు కానీయదు’’ అని అన్నారు. 167 రూపాయలను ప్రజలకు చూపుతూ.. ఇది తేయాకు కార్మికులకు రోజు వారీ దక్కుతున్నది.. కానీ గుజరాతీ వ్యాపారవేత్తలు మాత్రం తేయాకు తోటలనే దక్కించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే తేయాకు కార్మికులకు రోజుకు రూ. 367 అందిస్తామని హామీ ఇచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh