Cobra Brings Traffic To Halt on Busy Road in Udupi రోడ్డు ధాటేందుకు అరగంట పాటు ట్రాపిక్ జామ్ చేసిన విఐపి

Snake tries to cross busy karnataka street brings traffic to a halt rescued later

, snake, Reptile, snake video, snake cross road video, traffic stop snake cross video, karnataka snake video, Udipi, Karnataka

Traffic on a busy road in Karnataka was stopped for about 30 minutes by an unusual being and it has now grabbed the attention of netizens. The abrupt halt in the traffic was caused by a snake trying to cross the road.

రోడ్డు ధాటేందుకు అరగంట పాటు ట్రాపిక్ జామ్ చేసిన విఐపి

Posted: 02/15/2021 09:18 PM IST
Snake tries to cross busy karnataka street brings traffic to a halt rescued later

సాధారణంగా రోడ్డుపై వాహనాలు ఎవరో వివిఐపీలు వచ్చినప్పుడు మాత్రమే నిలిచిపోతాయి. మురీ ముఖ్యంగా ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రి, రాష్ట్రపతి, ఇలా ప్రముఖ వ్యక్తుుల ఆ మార్గంలో వెళ్తున్నప్పుడు వాహనాలను స్థానిక పోలీసులు నిలిపి.. ప్రముఖుల వాహనాల శ్రేణి వెళ్లిన తరువాత వదిలేస్తూ వుంటారు. కానీ తాజాగా కర్నాటకలో ఓ విఐపీ కోసం ట్రాపిక్ ను నిలిపేసారు. అయితే పొరబాటున ఆయన మంత్రో, లేక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తో అనుకుంటే పోరబాటే. కానీ ట్రాపిక్ మాత్రం నిలిచిపోయింది. ఐదు నిమిషాలో పది నిమిషాలో కాదు ఏకంగా అరగంట సేపు ట్రాపిక్ అర్థాంతరంగా నిలిచిపోయింది. అయితే అంతసేపు ట్రాఫిక్ ను ఇబ్బంది పెట్టిన ప్రముఖుడు ఎవరో తెలుసా.

ఓ విఐపీ రోడ్డు క్రాస్ చేయడంతో ట్రాఫిక్ ను అంతసేపు నిల్చోబెట్టారు. అహా అరగంట పాటు ట్రాపిక్ ను నిలిపి రోడ్డు దాఠిన విఐపీ ఎవరైవుంటారు. అనేగా మీ సందేభం. మేము పరుగు పరుగున రోడ్డు క్రాస్ చేస్తాం. వృద్ధులైతే కాస్త నెమ్మదిగా క్రాస్ చేస్తారు. మరీ ఈ వీఐపీ ఎవరో తెలుసా.? పాము.. అయినా అరగంట పట్టుదు కదా.. అంటారా.. ఇది కాసింత భారీ పాము. అందుకనే లేట్ కాక తప్పదు. ఇలాంటి ఘటనే కర్ణాటకలో చోటుచేసుకుంది. ఓ పాము నెమ్మదిగా రోడ్డు దాటుకుంది. ఇందుకు అరగంట సమయం పట్టింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో, ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలో ఓ పాము రోడ్డుపై రావడంతో వాహన రాకపోకలకు అంతరాయం కలిగింది. కర్ణాటకలో ఎప్పుడూ రద్దీగా వుండే ఉడుపి కల్స్కా జంక్షన్‌లో నాగుపాము ప్రత్యక్షమైంది. దీంతో షాకైన ట్రాఫిక్ పోలీసులు.. ఆ పామును ప్రజల నుంచి రక్షించారు. వాహన రాకపోకలను ఆపేశారు. ఆ పాము రోడ్డు దాటుకుని వెళ్ళేవరకు ఓపిక పట్టారు. ఈ గ్యాప్‌లో వాహనదారులు ఆ పాము రోడ్డు దాటే దృశ్యాలను వీడియో తీశారు. సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అలా నాగుపాము మండే ఎండలో రోడ్డును దాటేందుకు 30 నిమిషాలు పట్టింది. అనంతరం ఆ పామును చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles