Telugu family extorted by dacoits in Vashi PS limits' షర్డీకి వెళ్లి తిరిగివస్తూ దోపిడీ దొంగల బారిన..

Telugu family extorted by dacoits in vashi ps limits returning from shiridi

Telugu family, Shirdi sai, Vikarabad district, Kulkacherla, dacoits in Vashi, Maharashtra Police, Humnabad Hospital, Maharashtra, Telangana, Crime

Telugu family from vikarabad district extorted by dacoits in Vashi Police Station limits, while returning from Shirdi on Friday Midnight. The Victims where admitted in a Hospital at Humnabad, after the dacoits hit them badly with lathis and swords.

షిర్డీసాయి దర్శనానికి వెళ్లి తిరిగివస్తూ.. దొపిడిదొంగల బారిన..

Posted: 02/13/2021 03:31 PM IST
Telugu family extorted by dacoits in vashi ps limits returning from shiridi

భక్తితో దైవ దర్శనం చేసుకుని సొంతవూరికి తిరుగు ప్రయాణమైన తెలుగు వారికి మహారాష్ట్రలో అర్థరాత్రి దోపిడీ దొంగలు దారి కాచి వారిని లూఠీీ చేశారు. మహిళలు, చిన్నారుల అన్న తేడా లేకుండా విలువైన బంగారు అభరణాలు, నగదు సహా అన్ని దోచుకెళ్లారు. అంతేకాదు వీరిని అడ్డగించేందుకు వారు చేసిన ప్రయత్నాలను దాటి వెళ్తున్నారని వారిపై కనీస కనికరం కూడా లేకుండా కత్తులు, కర్రలతో దాడికి పాల్పడ్డారు. తెలంగాణ వారిని ఉల్లిక్కిపడేలా చేసిన ఈ ఘటన మహరాష్ట్రలోని వాసీ పోలిస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

అర్థరాత్రి ప్రయాణాల విషయంలో అత్యంత జాగ్రత్తగా.. ముందుచూపుతో వ్యవహరించాలని పెద్దలు చెబుతూనే వుంటారు. అయినా ఉదయం వేళకు ఇళ్లకు చేరుకుని సకాలంలో విధులకు హాజరయ్యేందుకు అనేకమంది రాత్రి ప్రయాణాలకు అధికంగా మొగ్గుచూపుతుంటారు. అయితే మహారాష్ట్రకు మాత్రం రాత్రివేళ ప్రయాణాలుప్రమాదకరం. గతంలోనూ తలెంగాణ టూరిజానికి చెందిన బస్సులతో పాటు ప్రైవేటు బస్సులను టార్గెట్ చేసుకున్న దోపిడీ దొంగలు.. బస్సులపై రాళ్లు రువ్వుతూ దాడులకు పాల్పడి దొపిడీలకు తెగబడిన ఘటనలు వున్నాయి.

తాజాగా వికారాబాద్‌ జిల్లాకు చెందిన రెండు కుటుంబాలు క్రితం రోజు రాత్రి ప్రయాణంలో దోపిడీ దొంగల దాడిలో గాయపడిన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వికారాబాద్‌ జిల్లా బండవెల్కిచర్ల గ్రామానికి చెందిన కె.రాములు పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు. పరిగి నియోజకవర్గ పరిధిలోని కుల్కచర్ల తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్‌ రమేశ్‌. వీరిద్దరూ తమ కుటుంబంతో కలిసి మహారాష్ట్రలోని షిర్డీకి కారులో వెళ్లారు. షిర్డీ యాత్ర ముగించుకుని శుక్రవారం తిరుగు ప్రయాణమయ్యారు. కర్నాటకలోని వాసీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోకి రాగానే దొంగలు వీరి కారును అడ్డగించారు. రోడ్డుపై మేకులు వేసి కారు పంక్చరయ్యేలా చేశారు.

అయితే దొంగలను చూసి తప్పించుకునేందుకు ప్రయత్నించగా కారు అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో దొంగలు రెచ్చిపోయారు. ఆ కుటుంబసభ్యులపై దాడికి పాల్పడ్డారు. విచక్షణా రహితంగా కొడుతూ.. కత్తులతో బెదిరిస్తూ డబ్బులు, ఆభరణాలు వసూల్‌ చేశారు. దీంతో ప్రాణభయంతో వారంతా తమ వద్ద ఉన్న ఆభరణాలు, నగదు ఇచ్చేశారు. ప్రస్తుతం కర్నాటకలోని హుమ్నాబాద్‌లో ఉన్న ఓ ఆస్పత్రిలో బాధితులు చికిత్స పొందుతున్నారు. చిన్న‌పిల్ల‌లు, మ‌హిళ‌లు అని కూడా చూడ‌కుండా క‌త్తులు, రాళ్ల‌తో విచ‌క్ష‌ణ ర‌హితంగా దాడి చేశారని తెలుస్తోంది. వీరి దాడిలో ఐదుగురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. వీరి వ‌ద్ద నుంచి 8 తులాల బంగారు న‌గల‌ను దొంగ‌లు అప‌హ‌రించుకుపోయారు. ఈ ఘటన వాసీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles