Kodali Nani responds to SEC’s show-cause notice ఎస్ఈసీ అదేశాలపై హైకోర్టుకు కొడాలి నాని

Kodali nani to approach high court on sec n ramesh latest restrictions

panchayat elections, N. Ramesh Kumar, Kodali Nani, AP Panchayat elections 2021, AP Panchayat elections 2021 results, AP Panchayat election, AP Panchayat election results, Andhra Pradesh Panchayat elections 2021, panchayat elections, JanaSena, BJP, TDP, Congress, opposition parties, Andhra pradesh, Politics

Civil Supplies Minister Kodali Nani to Challenge orders of State Election Commissioner Nimmagadda Ramesh Kumar in High Court after SEC barred the minister from speaking to the media and holding group meetings till February 21.

ఎస్ఈసీ అదేశాలపై న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్న కోడాలి నాని

Posted: 02/13/2021 02:33 PM IST
Kodali nani to approach high court on sec n ramesh latest restrictions

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల అధికారి తన అధికారంలో ఎన్నికల నిర్వహణను సక్రమంగా జరిగేలా చర్యలు చేపడుతున్నారు. అయితే మొన్న రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని మీడియాకు దూరంగా వుండాలని, ఇంటికే పరిమితం అయ్యేలా చూడాలని ఏపీ పోలీసులను అదేశించిన ఆయన తాజాగా మరో రాష్ట్రమంత్రిపై కూడా అలాంటి అదేశాలనే జారీ చేశారు. తాను పంపిన షోకాజ్ నోటిసుకు బదులు రావడంతో దానిని పరిశీలించిన ఆయన రాష్ట్ర పౌరసరఫాలశాఖ మంత్రి కొడాలి నానిని కూడా ఈ నెల 21 వరకు మీడియాకు దూరంగా వుండాలని అదేశాలు జారీ చేశారు.

ఇక మరోవైపు కోడాలి నాని ఎన్నికల కోడ్ ను ఉ్లలంఘించారని ఆయనపై ఐపీసీ 504, 505(1)(సి), 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కోడ్ ను ఉల్లంఘించినందుకు క్లాజ్-1, క్లాజ్-4 కింద కేసులు నమోదు చేయాలని కృష్ణా జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు. నిమ్మగడ్డ రమేశ్ పై కొడాలి నాని అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడతూ నిమ్మగడ్డను, చంద్రబాబును విమర్శించారు. దీంతో, కొడాలి నానికి ఎస్ఈస్ షోకాజ్ నోటీసులు పంపించింది. ఈ నోటీసులకు తన వివరణను లాయర్ ద్వారా నాని పంపించారు.

రాజ్యాంగ వ్యవస్థలపై తనకు గౌరవం ఉందని, ఎస్ఈసీని కించపరిచే ఉద్దేశం తనకు లేదని వివరణలో పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీ అరాచకాలను బయటపెట్టే క్రమంలోనే తాను మీడియా సమావేశాన్ని నిర్వహించానని చెప్పారు. షోకాజ్ నోటీసును ఉపసంహరించుకోవాలని కోరారు. అయితే, నాని వివరణతో సంతృప్తి చెందని ఎస్ఈసీ... ఆయనపై చర్యలకు ఆదేశించారు. కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో ఎస్ఈసీ తాజా అదేశాలపై మంత్రి కొడాలి నాని సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి బాటలోనే నడవనున్నారు. ఆయన కూడా హైకోర్టును ఆశ్రయించి.. లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేయనున్నారని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : panchayat elections  SEC  N. Ramesh Kumar  Kodali Nani  AP MInister  YSRCP  TDP  JanaSena  BJP  Andhra pradesh  Politics  

Other Articles