AP SEC issues shedule to Municipal elections ఏపీలో పురపాలకాలకు నగరా.. మార్చి 10న ఎన్నికలు

Ap sec issues shedule to municipal elections polls will be held on march 10

Muncipal elections, Zptc Elections, Mptc elections, gram panchayat elections, N. Ramesh Kumar, AP Panchayat elections 2021, AP Muncipal elections 2021, AP Muncipal results, AP Muncipal election, AP Muncipal election results, Andhra Pradesh Muncipal elections 2021, AP Muncipal elections, JanaSena, BJP, TDP, Congress, opposition parties, Andhra pradesh, Politics

Andhra Pradesh SEC Nimmagadda Ramesh Kumar has released the Municipal Election Schedule for Municipalities and City Governing Bodies in AP. Municipal elections will be held on March 10. The re-poll will be held on March 13, the counting of votes will take place on March 14.

ఏపీలో పురపాలకాలకు నగరా.. షెడ్యూల్ విడుదల చేసిన ఎస్ఈసీ..

Posted: 02/15/2021 11:08 AM IST
Ap sec issues shedule to municipal elections polls will be held on march 10

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి.. రాష్ట్ర ఎన్నికల సంఘానికి మధ్య ఏర్పడిన పోరపచ్చాలు.. చివరకు తొలగిపోయాయి. దీంతో రాష్ట్రంలో పురపాలక సంఘాల ఎన్నికలతో పాటు జడ్సీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతూ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. ఈ వినతిపై స్పందించిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెనువెంటనే స్పందించి ఇవాళ షెడ్యూల్ విడుదల చేశారు. గత ఏడాది కరోనా మహమ్మారి విజృంభన నేపథ్యంలో ఈ ఎన్నికల ప్రక్రియ నిలిచిన విషయం తెలిసిందే.

ఎక్కడ నిలిచిపోయిందో అక్క‌డి నుంచే ఎన్నికలను కార్యక్రమాలను కొన‌సాగించాల‌ని నిర్ణయం తీసుకున్న ఎస్ఈసీ.. మొత్తం 12 మునిసిపల్‌ కార్పొరేషన్లు, 75 మునిసిపల్‌, నగర పంచాయతీలకు ఎన్నికలు నగారాను మ్రోగిస్తూ షెడ్యూల్ విడుదల చేశారు. మార్చి 10వ తేదీన మున్సిఫల్ ఎన్నికలు నిర్వహించనున్నారు. వ‌చ్చేనెల‌ 3న మధ్యాహ్నం 3 గంటల్లోపు నామినేషన్ల ఉపసంహరణ‌కు చివరి తేదీని విధించారు. కాగా, గత ఏడాది మార్చి 23న పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు జ‌ర‌పాల‌ని ఏర్పాట్లు చేసుకోగా క‌రోనా విజృంభ‌ణ కార‌ణంగా వాయిదాప‌డ్డ విష‌యం తెలిసిందే.

అయితే అప్పట్లో విడుదల చేసిన షెడ్యూల్ మరియు నోటిఫికేషన్ ప్రకారం 12 నగరపాలక సంస్థల్లో 6,563 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖ‌లు చేశారు. అలాగే, 75 పురపాలక, నగర పంచాయతీల్లోనూ వార్డు స్థానాలకు 12,086 మంది నామినేషన్లు వేశారు. దీంతో నామినేషన్ల గడువుకు ముగిసిన నేపథ్యంలో కేవలం ఉపసంహరణలు, ఎన్నికలు, కౌంటింగ్ తేదీలను మాత్రమే నిర్వహించనుంది. మ‌రోవైపు, ప్రస్తుతం పంచాయతీలకు ఎన్నికలు జ‌రుగుతున్నాయి. తొలి రెండు ద‌శ‌ల ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ పూర్తయింది. ఈ నేప‌థ్యంలో మునిసిప‌ల్ ఎన్నిక‌ల‌కు కూడా ఎస్ఈసీ సిద్ధ‌మ‌యింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Muncipal elections  SEC  N. Ramesh Kumar  Muncipal elections shedule  YSRCP  TDP  JanaSena  BJP  Andhra pradesh  Politics  

Other Articles