(Image source from: Indianexpress.com)
కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ దేశరాజధాని శివార్లలోని సింఘు, టిక్రీ ప్రాంతంలో రైతు సంఘాలు చచేపడుతున్న ఆందోళనలు కొలిక్కి రాకపోవడంతో రైతులు తమ ఉద్యమాన్ని ఉద్దృతం చేస్తున్నారు. నెల రోజులకు పైగా సాగుతున్న రైతుల అందోళనలపై ఏడో విడత చర్చలు కూడా ముగింపు పలుకలేకపోవడంతో ఇదంతా కేంద్రం చేస్తున్న తాత్సారమే అంటూ రైతులు అరోపిస్తున్నారు. దీంతో కేంద్రప్రభుత్వానికి తమ తడాఖా ఏంటో చూపించాలని నిర్ణయించుకున్నాయి. ఇంతకుముందు హెచ్చరించినట్లుగానే ట్రాక్టర్ మార్చు కోసం రైతులు సమాయత్తం అవుతున్నారు.
తమ డిమాండ్లకు కేంద్రం సానుకూలంగా దిగిరాని పక్షంలో ఆందోళనలను మరింత తీవ్రం చేస్తామని.. మాల్ లు, పెట్రోల్ బంకులు మూసివేయిస్తామని ఇదివరకే హెచ్చరించిన రైతు సంఘాలు.. ఇక త్వరలోనే కేంద్రానికి తమ ఉద్యమ ట్రైలర్ రుచి చూపిస్తామని హెచ్చరిస్తున్నాయి, ఈ ట్రైలర్ కాస్తా రానున్న గణతంత్ర దినోత్సవం రోజన సినిమాగా కూడా మారవచ్చునని, అయితే అది జరగడం, జరగకపోవడం అంతా కేంద్ర ప్రభుత్వం చేతుల్లోనే వుందని పేర్కోంటున్నారు. తమ ప్రధాన డిమాండ్లైన మూడు వ్యవసాయ చట్టాలను కేంద్రం బేషరుతుగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో పాటు కనీస మద్దతు ధరపై చట్టబద్దతను చేయాలని పట్టుబడుతున్నారు,
కేంద్రంతో ఇప్పటి వరకు ఏడుసార్లు జరిగిన చర్చలు నిష్ఫలంగా ముగిశాయి. ఇటు రైతులు కానీ, అటు ప్రభుత్వం కానీ మెట్టు దిగేందుకు అంగీకరించడం లేదు. దీంతో చర్చల్లో ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేయాలని భావిస్తున్న రైతు సంఘాలు ఈ నెల 26న రిపబ్లిక్ డే రోజున ఢిల్లీలో ట్రాక్టర్ మార్చ్ చేపట్టాలని నిర్ణయించాయి. కాగా, ఈ నెల 7న ఢిల్లీ సరిహద్దులో నిర్వహించనున్న ట్రాక్టర్ మార్చ్‌తో కేంద్రానికి ట్రైలర్ చూపిస్తామని హెచ్చరించాయి. రైతులు, కేంద్రం మధ్య ఈ నెల 8న 8వ విడత చర్చలు జరగనుండగా, ఒక్క రోజు ముందు ట్రాక్టర్ ర్యాలీకి రైతులు పిలుపునివ్వడం గమనార్హం.
చర్చలు విఫలమైన నేపథ్యంలో గణతంత్ర దినోత్సవం రోజున ఢిల్లీ నాలుగు సరిహద్దుల్లో ట్రాక్టర్లతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించనున్నట్టు చెప్పారు. ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్న ‘దేశ్ జాగరణ్ అభియాన్’ రెండు వారాలపాటు కొనసాగుతుందన్నారు. అనంతరం దేశవ్యాప్తంగా నిరసనలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. రిపబ్లిక్ డే నాడు ఢిల్లీలో ‘ట్రాక్టర్ కిసాన్ పరేడ్’ నిర్వహించనున్నట్టు క్రాంతికారి కిసాన్ యూనియన్ అధ్యక్షుడు దర్శన్ పాల్ ఇప్పటికే ప్రకటించారు. 23న ఆయా రాష్ట్రాల్లోని గవర్నర్ల ఇళ్లవైపు రైతులు కవాతు నిర్వహిస్తారని తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Jan 19 | ఆంధ్రప్రదేశ్ లో గ్రామస్థాయిలో ఎన్నికల నిర్వహణ పంచాయితీ హైకోర్టుకు చేరిన తరుణంలో ఎన్నికల నిర్వహణ వుంటుందా.? లేదా అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఫిబ్రవరిలో నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణ రాష్ట్ర ఎన్నికల... Read more
Jan 19 | అనునిత్యం దేశం కోసం.. దేశభక్తి కోసం ప్రసంగాలు గుప్పించే వ్యక్తుల నుంచి దేశానికి సంబంధించిన అత్యంత గోప్యమైన సమాచారం ఓ జర్నలిస్టుకు లీక్ కావడంపై కాంగ్రెస్ మాజీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రంగా... Read more
Jan 19 | హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ లిమిటెడ్ సంస్థ రూపోందించిన కరోనా వాక్సీన్ కోవాక్సీన్ ను మూడవ దశ ట్రయల్స్ పూర్తి కాకుండానే అత్యవసర వినియోగం కోసం లైసెన్స్ పొందిన విషయం తెలిసిందే. అయితే... Read more
Jan 19 | నాగార్జునసాగర్ ఉప ఎన్నికను అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఉప ఎన్నికలలో భారీ మెజారిటీని సాధించేందుకు పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోంది. రాష్ట్రంలో తమకు ఎదురులేదని.. మోనార్క్ ముద్రను వేసుకున్న టీఆర్ఎస్ ఇకపై ఎన్నికలంటే... Read more
Jan 19 | కరోనా మహమ్మారి ప్రపంచ మానవాళిని భయం గుప్పెట్లోకి నెట్టిన తరువాత రెండో వేవ్ అంటూ భయాలు ఉత్పన్నమైన వేళ.. సెకెండ్ స్ట్రెయిన్ కూడా పలు దేశాలను అతలాకుతలం చేసింది. కరోనా నుంచి కోలుకున్న తరువాత... Read more