(Image source from: India.com)
భారత సరిహద్దులోని నియంత్రణ రేఖ పోడువునా ఏకంగా 400 తీవ్రవాదులు మాటువేసి వున్నారని, వారంతా భారత్ తోకి చోరబడేందుకు సిద్దంగా వున్నారని ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం రావడంతో భారత భద్రత బలగాలు అప్రమత్తమయ్యాయి, భారత్ లో ఉగ్రదాడులు చేసే కుట్రలతో వీరిని పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు పంపుతున్నాయని ఇ:టెలిజెన్స్ సమాచారం, దీంతో సరిహద్దుల్లో దాదాపు 400 మంది వరకూ ఉగ్రవాదులు చేరారని వారంతా అదును చూసుకుని సరిహద్దు దాటేందుకు కాసుకున్నారని.. ఈ నేపళ్యంలో సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) అప్రమత్తంగా వుండాలని ఇంటెలిజెన్స్ వర్గాలు అలర్ట్ చేశాయి.
శీతాకాలంలో పగలు ఉప్ణోగ్రతలు అత్యల్పంగా పడిపోతున్న తరుణంలో అదే అదనుగా భావించిన పాకిస్థాన్ ఉగ్రసంస్థలు వారిని భారత్ లోకి చోరబడేందుకు సహకరించనున్నాయి, అయితే తాజాగా భారత్ పాకిస్థాన్ మధ్య సరిహద్దులో ఏర్పాటు చేసిన చోరబాట్ల నిరోధక గ్రిడ్ లోంచి చోరబడేందుకు పాకిస్థాన్ ఉగ్రసంస్థలు చేసిన ప్రయత్నాలు కూడా బెడసికోట్టాయని భారత భద్రతా బలగాలు తెలిపాయి, దీంతో చోరబాట్లకు గ్రిడ్ అనుకూలంగా లేదని పాకిస్థాన్ ఆర్మీ కాల్పుల విరమణకు తెగబడుతోందని భారత అధికారులు తెలిపారు, గత ఏడాదిలో ఓ వైపు కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నా పాకిస్థాన్ మాత్రం ఏకంగా 5100 పర్యాయాలు కాల్పుల విరమణకు తెగబడిందని భారత అధికారులు తెలిపారు.
భారత దళాలపై దాడులు చేయాలన్న వ్యూహంతో ఉన్నారని నిఘా వర్గాలు హెచ్చరించాయి. వీరి వద్ద జీపీఎస్, నావిగేషన్ వ్యవస్థలు కూడా ఉన్నాయని, వాటిని ఐఎస్ఐ సమకూర్చిందని, వివిధ లాంచ్ ప్యాడ్ల వద్ద వీరు నక్కి ఉన్నారని పేర్కొన్నాయి. వాస్తవానికి గత నవంబర్ లోనే ఉగ్రవాదులు ఒక చోటకు చేరుతుండటంపై ఇంటెలిజన్స్ కు ఉప్పందింది. కశ్మీర్ లోయ సమీపంలో 65 మంది టెర్రరిస్టులు ఆయుధాలతో సహా ఉన్నారని, వారు ఏ క్షణమైనా జొరబడవచ్చని హెచ్చరికలు జారీ అయ్యాయి. శీతాకాల పరిస్థితులు తమకు అనుకూలమని భావిస్తున్న ఉగ్రవాదులు, లునియా ధోక్, చిరికోట్ నబన్, దేగ్వార్ ట్రెవాన్, పీపి నాలా, కృష్ణ ఘాటి, భీంబర్ గాలి, నౌషెరా, సుందర్బానీ తదితర లాంచ్ ప్యాడ్లకు చేరారని తెలుస్తుండటంతో సరిహద్దుల్లో పహారాను మరింత కట్టుదిట్టం చేశారు.
(And get your daily news straight to your inbox)
Jan 19 | ఆంధ్రప్రదేశ్ లో గ్రామస్థాయిలో ఎన్నికల నిర్వహణ పంచాయితీ హైకోర్టుకు చేరిన తరుణంలో ఎన్నికల నిర్వహణ వుంటుందా.? లేదా అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఫిబ్రవరిలో నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణ రాష్ట్ర ఎన్నికల... Read more
Jan 19 | అనునిత్యం దేశం కోసం.. దేశభక్తి కోసం ప్రసంగాలు గుప్పించే వ్యక్తుల నుంచి దేశానికి సంబంధించిన అత్యంత గోప్యమైన సమాచారం ఓ జర్నలిస్టుకు లీక్ కావడంపై కాంగ్రెస్ మాజీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రంగా... Read more
Jan 19 | హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ లిమిటెడ్ సంస్థ రూపోందించిన కరోనా వాక్సీన్ కోవాక్సీన్ ను మూడవ దశ ట్రయల్స్ పూర్తి కాకుండానే అత్యవసర వినియోగం కోసం లైసెన్స్ పొందిన విషయం తెలిసిందే. అయితే... Read more
Jan 19 | నాగార్జునసాగర్ ఉప ఎన్నికను అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఉప ఎన్నికలలో భారీ మెజారిటీని సాధించేందుకు పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోంది. రాష్ట్రంలో తమకు ఎదురులేదని.. మోనార్క్ ముద్రను వేసుకున్న టీఆర్ఎస్ ఇకపై ఎన్నికలంటే... Read more
Jan 19 | కరోనా మహమ్మారి ప్రపంచ మానవాళిని భయం గుప్పెట్లోకి నెట్టిన తరువాత రెండో వేవ్ అంటూ భయాలు ఉత్పన్నమైన వేళ.. సెకెండ్ స్ట్రెయిన్ కూడా పలు దేశాలను అతలాకుతలం చేసింది. కరోనా నుంచి కోలుకున్న తరువాత... Read more