Flood Victims Throng Mee Seva centres for Compensation మీ సేవ కేంద్రాల వద్ద బారులు తీరిన వరద ముంపు బాధితులు..

Flood victims throng mee seva centres for rs 10000 financial assistance

CM KCR, TRS Party, Telangana floods, Telangana government flood fund, flood financial assistance, Hyderabad MeeSeva Centres, Hyderabad floods, Hyderabad flood victims, Flood assistance, Hyderabad, Telangana, Politics

The pain victims of Hyderabad floods are going through to get the 10k flood relief promised by the Govt. Huge queues at facilitation centres called MeeSeva Kendras to register for getting #FloodRelief compensation of Rs 10k promised by #TRS government; with #NoSocialDistancing, poor adherence to mask.

మీ సేవ కేంద్రాల వద్ద బారులు తీరిన వరద ముంపు బాధితులు..

Posted: 12/07/2020 08:15 PM IST
Flood victims throng mee seva centres for rs 10000 financial assistance

(Image source from: Newsmeter.in)

హైదరాబాద్‌ నగరంలో ఇటీవల కురిసిన వర్షాలతో వరదముంపుకు గురైన ఇళ్ల బాధితులందరికీ ప్రభుత్వం సాయం నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రకటించినా.. బాధితులు మాత్రం మీ సేవా కేంద్రాల వద్ద బారులు తీరారు. ముంపుకు గురై సాయం అందనివారు ఎన్నికల అనంతరం ఈ నెల 7న మీ సేవా కేంద్రాలలో ఆర్థిక సాయం కోసం ధరఖాస్తు చేసుకోవాలని ఇటీవల ప్రభుత్వ పెద్దలు ప్రకటించారు. దీంతో ఇవాళ ఉదయం నుంచే ప్రజలు తమ చేతుల్లో ధరఖాస్తులు పట్టుకుని క్యూలో నిలబడ్డారు, వరద సాయం పంఫిణీ కోసం బాధితులు నగరంలోని పలు ప్రాంతాల్లో క్యూలో నిల్చోవడంతో రద్దీ నెలకొంది.

అయితే తాజాగా ప్రభుత్వం నుంచి అదేశాలు అందకలేదని, ఇక ఈ ధరఖాస్తులు తీసుకోవచ్చునునో లేదో తెలియక మీ సేవా కేంద్రాలను నిర్వహకులు తెరవలేదు. దీంతో ఉదయం నుంచి తాము క్యూలో నిల్చున్నా మీ సేవా కేంద్రాలను తెరువకపోవడంతో బాధితులు రోడ్డుపైనే బైఠాయించి నిరసత తెలిపారు. ఇక అటు సీతాఫల్ మండిలో కార్పోరేటర్ సామల హేమ ఇంట్లోకి చోచ్చేకెళ్లేందుకు బాధితులు యత్నించారు. అయితే పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఇవాళ్టి నుంచి ధరఖాస్తులను స్వీకరిస్తామని చెప్పిన ప్రభుత్వం మీ సేవా కేంద్రాలను తెరవకుండా అదేశాలను జారీ చేసిందని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు, కాగా, పలు చోట్ల మాత్రం మీ సేవా కేంద్రాల వారు అప్లికేషన్లను తీసుకున్నారు.

ఇదిలావుండగా ముంపుకు గురైన బాధితులందరకీ తమ బ్యాంకు ఖాతాల్లో ఆర్థిక సాయాన్ని అందిస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌ తెలిపారు. బాధితుల వివరాల ధ్రువీకరణ పూర్తి అయ్యాక ఈ మేరకు చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు. వరద సాయం కోసం బాధితులెవరూ మీ-సేవ సెంటర్ల చుట్టూ తిరగొద్దని విజ్ఞప్తి చేశారు. జీహెచ్‌ఎంసీ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించి సాయం అందని వారి వివరాలను సేకరిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం బాధితుల వివరాలు, ఆధార్‌ నంబర్‌ ధ్రువీకరణ జరుగుతోందని కమిషనర్ వివరించారు. జీహెచ్ఎంసీ బృందాలు పరిశీలించి అకౌంట్లలో జమ చేస్తామని కమిషనర్ పేర్కొన్నప్పటికీ వరద బాధితులు మీ సేవ కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles