Curbing free speech on social media wrong: Attorney General సామాజిక మాద్యమాల్లో ఆంక్షలు కూడదు: అటర్నీ జనరల్

For healthy democracy social media must not be curbed attorney general

Sabarimala temple, Lord Ayappa Temple, Makaravilakku, Sabarimala temple news, Sabarimala Pilgrimage, Sabarimala, pilgrimage season, hill temple, Kerala government, state Health department, Covid-19 Protocol, coronavirus

Freedom of speech on social media should not be curbed and any move to do so may invite litigation, the government's top law officer has said, adding that it is unbecoming of a 'healthy democracy'. The Supreme Court does initiate contempt cases but only in the rarest of rare cases says, Attorney General KK Venugopal.

సామాజిక మాద్యమాల్లో ఆంక్షలు కూడదు: అటర్నీ జనరల్

Posted: 12/07/2020 07:26 PM IST
For healthy democracy social media must not be curbed attorney general

(Image source from: Nyoooz.com)

సోషల్ మీడియాలో నెటిజనులు పెట్టే పోస్టులను.. వారి అభిప్రాయాలను పరోక్షంగాకానీ, ప్రత్యక్షంగా కానీ నియంత్రించాలని భావిస్తే, అది వివాదాలకు దారి తీస్తుందని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ పేర్కోన్నారు. సామాజిక మాధ్యమాల్లో ప్రజలు తమ అభిప్రాయాలను ఎలాంటి స్వేఛ్చగా, స్వతంత్రంగా వెలుబుచ్చడమే అరోగ్యవంతమైన ప్రజాస్వామ్యానికి నిదర్శనమని అన్నారు. సోషల్ మీడియా నియంత్రణలు కూడదని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తీకరించారు, అత్యంత అరుదైన కేసులను మాత్రమే కోర్టు ధిక్కార నేరాలుగా దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు పరిగణించాలని ఆయన సూచనలు చేశారు. సామాజిక మాధ్యమాల్లో జరిగే బహిరంగ చర్చలను స్వాగతించాల్సిన అవసరం ఎంతైనా వుందని పేర్కోన్నారు.

అయితే అవి కూడా పరిధిని దాటకుండా ఉంటేనే మంచిదని, అసలు అలాంటి వ్యాఖ్యల గురించి ఇబ్బందులు ఉండవని, సాధారణంగా అటువంటి విమర్శలపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా స్పందించకుండా ఉంటుందని ఆయన అన్నారు. ఇటీవలి కాలంలో సుప్రీంకోర్టు నిర్ణయాలపై సామాజిక మాధ్యమాల్లో పలువురు విమర్శల వర్షం కురిపిస్తున్న నేపథ్యంలో ఇలాంటి వాఖ్యలపై ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు, భారత్ దేశంలో బహిరంగ ప్రజాస్వామ్యం ఉందని, ఎవరైనా, ఏదైనా చర్చించే స్వేచ్ఛను కలిగివున్నారని వ్యాఖ్యానించిన కేకే వేణుగోపాల్, ఈ స్వేచ్ఛను హరించేలా ప్రభుత్వం ఎటువంటి అడుగులూ వేయరాదని ఆయన సూచించారు.

ఇక చాలా అరుదుగా మాత్రమే ఇటువంటి వ్యాఖ్యలపై అత్యున్నత న్యాయస్థానం కల్పించుకుంటుందని ఆయన అన్నారు.  ఇటీవలి కాలంలో సామాజిక మాధ్యమాల్లో వ్యాఖ్యలపై కోర్టు ధిక్కార నేరాలను మోపాలని తనకు ఎన్నో సూచనలు వచ్చాయని, వాటిల్లో కార్టూనిస్ట్ కునాల్ కమ్రాపై మాత్రమే ఆరోపణలను నమోదు చేశామని వేణుగోపాల్ తెలిపారు. రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్నబ్ గోస్వామి వ్యవహారంలో సుప్రీంకోర్టును ప్రశ్నిస్తూ, కునాల్ పలు వ్యంగ్య చిత్రాలను గీయగా, అవి కలకలం రేపాయి. అంతకుముందు సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్, ధర్మాసనాన్ని ప్రశ్నిస్తూ, రెండు ట్వీట్లను చేయగా, కోర్టు ధిక్కార అభియోగాలు నమోదై, ఆయనకు రూ. 1 జరిమానా విధించిన సంగతి తెలిసిందే.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles