Mystery Illness Sweeps Eluru, Infects Over 500 ఏలూరులో వింత వ్యాధి.. కొనసాగుతున్న అలజడి..

Mystery illness sweeps eluru of andhra pradesh infecting over 500 people

India, Health, epidermic, mystery illness, coronavirus, eluru, Andhra Pradesh, nausea, seizures, unconscious, symptoms, coivd-19

As per the reports, around 500 people have reported symptoms of the unknown disease in the Eluru region in Andhra Pradesh. Of the 500 infected, around 153 were later admitted to the hospital because of the concerning symptoms and 332 discharged after recovering. According to doctors, these include nausea, seizures, and even falling unconscious.

ఏలూరులో వింత వ్యాధి.. కొనసాగుతున్న అలజడి..

Posted: 12/08/2020 12:55 PM IST
Mystery illness sweeps eluru of andhra pradesh infecting over 500 people

కరోనా మహమ్మారి విజృంభనతో భయాందోళనకు గురైన ఆంధ్రప్రదేశ్ వాసులను తాజాగా వింత వ్యాధి కలవర పెడుతోంది. ఎందుకు వస్తోందో.. కారణాలేంటో కూడా తెలియకపోవడంతో ఈ వ్యాధి ఎలా సంక్రమిస్తుందో కూడా తెలియని ఆందోళనకు ఆంధ్రప్రదేశ్ వాసులు గురవుతున్నారు. కాగా ఈ వ్యాధి బారిన పడిన వారు త్వరగానే కోలుకుంటున్న నేపథ్యంలో వైద్యవర్గాలతో పాటు ప్రజలు కూడా కొంత ఉపశమనం పోందుతున్నారు. మరీముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఈ వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అనూహ్యంగా పెరుగుతున్న బాధితులతో జిల్లా అసుపత్రిలో తీవ్ర కలవరం రెకెత్తుతోంది.

ఆదివారం రోజు ఏకంగా మూడువందల మందిని పాకిన ఈ వ్యాధి.. తాజాగా సోమవారం రోజుల ఈ సంఖ్యను మరింత పెంచుకుంది. దీంతో ఏకంగా ఐదు వందలకు ఈ సంఖ్య పెరిగింది. కోవిడ్ మహమ్మారి కారణంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పటికే వేలాది మంది చికిత్సపొంది కోలుకోగా వందలాది మంది అసువులు బాసారు. ఈ క్రమంలోనే మరో అంతుచిక్కని మహమ్మారి ఏలూరు వాసులను అందోళనకు గురిచేస్తోంది. శనివారం నుంచి అకస్మికంగా ఈ వ్యాధిబారిన పడుతున్న స్థానికుల సంఖ్య సోమవారం వరకు 300ల పైగా చేరగా, సోమవారం ఒక్క రోజునే ఏకంగా రెండు వందల మంది ఈ వ్యాధి బారిన పడి ఆసుపత్రులలో చికిత్స పోందుతున్నారు.

శనివారం రోజన ఏకంగా 108 మంది అసుపత్రిలో చేరగా అదివారం 209 మంది, సోమవారం రోజున మరో 200 మంది ఈ గుర్తుతెలియని వ్యాధి బారిన పడ్డారు. కాగా వీరిలో మొత్తంగా 332 మంది రోగులు త్వరగానే కోలుకుని డిశ్చార్జ్ అయినట్టు వైద్య, అరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. కాగా, పరిస్థితి విషమంగా వున్న 19 మంది రోగులను మాత్రం సమీపంలోని మల్టీ స్పెషాలిటీ అసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ఈ వింతవ్యాధి బారిన పడిన వందలాది మంది అసుపత్రులకు చేరుకుంటున్నా.. ఈ వ్యాధికి గల కారణాలు మాత్రం ఇంకా అంతుచిక్కడం లేదు. ఈ వ్యాధి బారిన పడుతున్నవారిలో అత్యధికులు 20 నుంచి 30 ఏళ్ల లోపువారే కావడం గమనార్హం. అయితే ఈ వార్తతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ తీవ్ర కలవరం రేకెత్తుతోంది.

అయితే ఏకంగా 12 ఏళ్లు వారితో పాటు అటు నలభై ఏళ్లకు పైబడిన వారు కూడా బాధితుల్లో వున్నారు. చికిత్స పోందుతున్న వారిలో 71 మంది చిన్నారులు, 27 మంది మహిళలు వున్నారు. రక్తపోటు, షుగర్, ఆస్తమా వంటి దీర్ఘకాలిక వ్యాధులతో పాటు ఎలాంటి రోగాల బారిన పడనివారు కూడా ఈ వింత వ్యాధిబారిన పడుతూ ఆసుపత్రులకు చేరడం చర్చనీయాంశంగా మారింది. కాగా కారణాలను తెలుసుకునే పనిలో పడిన ఎయిమ్స్ వైద్యులు రోగుల రక్త నమూనాల్లో సీసం, నికెల్ లోహాలు అధికంగా వున్నట్లు గుర్తించారు. తాగునీరు, పాల ద్వారా ఈ అవశేషాలు రోగుల శరీరంలోకి చేరి ఉంటాయని వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India  Health  epidermic  mystery illness  coronavirus  eluru  Andhra Pradesh  nausea  seizures  unconscious  symptoms  coivd-19  

Other Articles