Inter Students get married in classroom, suspended తరగతి గదిలో తాళి కట్టిన ఘనుడు.. కలకలం రేపిన ఘటన

Boy and girl get married in classroom face suspension from college

Rajahmundry inter students marriage, intermiediate students marriage, minor students marriage in classroom, minor students marriage in rajahmundry, inter students, class room, marriage, auspicious knots, prank video, minor students marriage, rajahmundry, viral video, andhra pradesh, crime

A classroom was turned into an instant marriage hall at a college in Rajahmundry, Hyderabad, when two love birds decided to tie the knot. The duo are studying Intermediate. Someone in the know shot their wedding and released it. Although the event took place in mid-November, the news has emerged only now.

ITEMVIDEOS: తరగతి గదిలో తాళి కట్టిన ఘనుడు.. కలకలం రేపిన ఘటన

Posted: 12/03/2020 11:28 PM IST
Boy and girl get married in classroom face suspension from college

ఇద్దరు మైనర్ విద్యార్థులు తరగతి గదినే వివాహ వేదికగా చేసుకున్నారు. బంధవులు, మేళతాళాలు, మంగళవాయిద్యాలు ఏమీ లేకుండా తన సహచర విద్యార్థిని మెడలో (మంగళసూత్రం) పసుపుతాడు కట్టాడు ఓ విద్యార్థి. అయితే ఇక్కడ తాళి కట్టిన విద్యార్థి.. తాళిని కట్టించుకున్న విద్యార్థిని ఇద్దరూ మైనర్లు కావడం గమనార్హం. వీరిద్దరూ చదువుతున్నది ఇంటర్ ద్వితీయ సంవత్సరం. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్లో సంచలనం రేపింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వీడియోతో అంతకు పది రోజుల ముందుగానే ఈ ఘటన చోటుచేసుకుందని తేలింది. దీనిపై స్పందించిన కాలేజీ యాజమాన్యం విద్యార్థి, విద్యార్థినితో పాటుగా సహకరించిన మరో విద్యార్థినిని కూడా సస్పెండ్ చేసింది.

సినిమాలు, సీరియళ్ల ప్రభావం.. ఇక తాజాగా అందుబాటులోకి వచ్చిన పలు సామాజిక మాద్యమాలో హీరో కావడానికి చేసే వీడియోలు.. తెలిసితెలియని అమాయకత్వ యువతపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయో ఈ ఘటనే ఉదాహరణ. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో జరిగిన ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి సమాచారం అందుకున్న కాలేజీ యాజమాన్యం వారిని విచారించింది. దీంతో టిక్ టాక్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ ఫ్లామ్ పై పోస్టు చేసేందుకు ఈ వీడియో తీశారని, అంతేకానీ ఈ వీడియో నిజమైన వివాహమో లేక ప్రేమ వివాహమో కాదని వారిద్దరూ అంగీకరించారని యాజమాన్యం తెలిపింది. కేవలం సోషల్ మీడియాలో లైకుల కోసం చేసిన తూతూమంత్రపు పెళ్లని వారు తెలిపారు. అందుకోసమే వీడియోను కూడా తీశారని యాజమాన్యం వారి తల్లిదండ్రులకు వివరించింది.

అయితే బాలిక మెడలో తాళి కట్టిన విద్యార్థి, ఆపై ఆమెకు బొట్టు పెడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో స్పందించిన కాలేజీ ప్రిన్సిపాల్, ఇలాంటి చర్యలను మున్ముందు ఏ విద్యార్థి చేయకుండా చర్యలకు ఉపక్రమించింది. వీరిద్దరినీ కాలేజీ నుంచి సస్పెండ్ చేసింది. వీరితో పాటు ఉన్న మరో విద్యార్థిని కూడా వీరికి వీడియో తీసేందుకు సహకరించిన కారణంగా అమెను కూడా సస్పెండ్ చేసింది. అయితే సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించడం కోసం కట్టుబాట్లు, సంస్కృతులు తెలియకుండా.. పవిత్ర కార్యాలను కూడా పిల్లలాటలా మార్చడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాను సమాజ శ్రేయస్సు కోసం వినియోగించాలని ప్రభుత్వాలు చట్టలాను తీసుకురావాలని కూడా డిమాండ్లు పెరుగుతున్నాయి.

(Video Source: ABN Telugu)

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles