CM KCR Pays Tributes To Nomula Narsimhaiah నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కన్నుమూత

Cm kcr attends the lastrites of nomula narsimhaiah consoles his family members

CM KCR, TRS Party MLA, nomula last rites, Telangana, CM, trs mla, trs, nomula narasimhaiah, Nagarjunasagar, nakrekal, Bhuvanagiri, CPIM, peoples leader, Advocate, Nalgonda, Telangana, Politics

Telangana CM, TRS party Chief K Chandra Shekar Rao, attended the Lastrites of demised TRS legislator from Nagarjunasagar Nomula Narsimhaiah. KCR pays his tributes and consoles nomula family members.

నోముల నర్సింహయ్య అంత్యక్రియలకు హాజరైన కేసీఆర్

Posted: 12/03/2020 06:07 PM IST
Cm kcr attends the lastrites of nomula narsimhaiah consoles his family members

(Image source from: Twitter.com/TelanganaCMO)

నాగార్జున సాగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అంత్యక్రియలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. మంగళవారం ఉదయం గుండెపోటు కారణంగా మరణించిన ఆయన అంత్యక్రియలను ఇవాళ కుటుంబసభ్యులు నిర్వహించారు. నల్గోండ జిల్లా నకిరేకల్ మండలంలోని పాలెం గ్రామంలో నిర్వహించిన ఆయన అంత్యక్రియలకు అక్కడి ప్రజలు కూడా పెద్దసంఖ్యలో హాజరయ్యారు, ఎమ్మెల్యే కన్నా ముందు పదేళ్ల కాలం పాటు ఆయన నకిరేకల్ మండల అధ్యక్షుడి హోదాలోనూ ప్రజలకు సేవలు అందించారు. ఆ తరువాత ఎమ్మెల్యేగానే అక్కడి ప్రజలతో సన్నిహిత సంబంధాలు వున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన చివరి చూపు కోసం స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

నల్గొండ జిల్లా అభివృద్దిలో తన వంతు సాయాన్ని అందించిన ప్రజానాయకుడు అని కీర్తించిన ప్రజలు ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. పాలెం గ్రామానికి విచ్చేసిన సీఎం కేసీఆర్ నోముల నర్సింహయ్య బౌతికకాయంపై పుష్పగుచ్చాని ఉంచి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నోముల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్.. వారిని ఓదార్చి.. ధైర్యం చెప్పారు. తమ పార్టీ నోముల కుటుంబానికి అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని అభయానిచ్చారు. సీఎం కేసీఆర్ తో పాటు మంత్రి జగదీశ్వర్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి సహా పలువురు నేతలు నోముల అంత్యక్రియలకు హాజరయ్యారు.

ఈ ఉదయం బేగంపేట నుంచి హెలికాప్టర్ లో పాలెం గ్రామం చేరుకున్న సీఎం కేసీఆర్... నోముల అంత్యక్రియలకు హాజరయ్యారు. దాదాపు గంట పాటు అక్కడే గడిపారు. అధికార పార్టీ ఎమ్మెల్యే హోదాలో మరణించిన నోముల నర్సింహయ్యకు రాష్ట్ర ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది. నోముల నర్సింహయ్య హైదరాబాదులో మంగళవారం తెల్లవారుజామున తీవ్రమైన గుండెపోటుకు గురయ్యారు. ఆయనను హైదర్ గూడ అపోలో ఆసుపత్రికి తీసుకెళ్లగా, అప్పటికే ఆయన ప్రాణాలు విడిచినట్టు వైద్యులు నిర్ధారించారు. విద్యార్థి నాయకుడి స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయికి అంచెలంచెలుగా ఎదిగిన నోముల అన్ని రంగాలలో ముక్కుసూటి మనిషిగా వ్యవహరించారు. నోముల అంత్యక్రియలు ఆయన స్వంత వ్యవసాయక్షేత్రంలో నిర్వహించారు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles