ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి, ప్రభుత్వానికి మధ్య విభేదాలు పోడచూపడంతో ఈ వివాదం చివరకు రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టుకు చేరింది, ఈ ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం ఏర్పాట్లను చేసినా.. రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్.. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి వచ్చిన ఆదేశాల నేపథ్యంలో వాటిని చివరి నిమిషంలో వాయిదా వేశారు. అందుకు కరోనా వైరస్ మహమ్మారి విజృంభన కారణంగా చూపారు. అనుకున్నట్లుగానే కరోనా రాష్ట్ర ప్రజలను పట్టిపీడించింది, అయితే ప్రస్తుత తరుణంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో బిహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, తెలంగాణ జీహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో రాష్ట్రంలోనూ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమీషన్ మూడు పర్యాయాలు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసిన విషయం తెలిసిందే.
అయితే అదే కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఎన్నికలను నిర్వహించడం సముచితం కాదని రాష్ట్రప్రభుత్వం చెబుతూవస్తోంది. ఈ క్రమంలో ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు జరపాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించడంపై ఏపీ సర్కారు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ పిటిషన్ పై హైకోర్టు విచారిస్తూ.. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు జరపాలన్న నిర్ణయంపై స్టే ఇవ్వలేమని తేల్చిచెప్పింది. పిటిషన్ పై తదుపరి విచారణను రేపటికి (శుక్రవారానికి) వాయిదా వేసింది. వాదనల సందర్భంగా... కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. పంచాయతీ ఎన్నికల విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని, సుప్రీంకోర్టు ఆదేశాలను ఎన్నికల సంఘం అతిక్రమించిందని ఆరోపించారు.
ఈ సందర్భంగా ఎన్నికల సంఘం తరఫున లాయర్ అశ్విన్ కుమార్ తన వాదనలు వినిపిస్తూ, ఒకవేళ సుప్రీం కోర్టు ఆదేశాలను ఎన్నికల సంఘం ఉల్లంఘించినట్టయితే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సుప్రీంకోర్టులో ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. సుప్రీంకు వెళితే తమ తప్పిదాలు బయటపడతాయనే ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ వేసిందని అన్నారు. అంతేకాకుండా, పంచాయతీ ఎన్నికల నిర్ణయం ఏకపక్షం కాదని, ఇప్పటికే ఎన్నికల సంఘం మూడుసార్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించిందని స్పష్టం చేశారు. దీంతో ప్రభుత్వ న్యాయవాది తమ వాదనలు వినిపించేందుకు కొంత సమయం ఇవ్వాలని అడిగారు. ఈ నేపథ్యంలో, ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ప్రభుత్వ విజ్ఞప్తిని తోసిపుచ్చింది. ఎన్నికల నిర్వహణపై స్టే ఇవ్వడం సాధ్యంకాదని, ప్రభుత్వ న్యాయవాది మరో అవకాశం అడిగినందున తదుపరి విచారణ రేపటికి వాయిదా వేస్తున్నామని పేర్కొంది.
(And get your daily news straight to your inbox)
Jan 19 | ఆంధ్రప్రదేశ్ లో గ్రామస్థాయిలో ఎన్నికల నిర్వహణ పంచాయితీ హైకోర్టుకు చేరిన తరుణంలో ఎన్నికల నిర్వహణ వుంటుందా.? లేదా అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఫిబ్రవరిలో నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణ రాష్ట్ర ఎన్నికల... Read more
Jan 19 | అనునిత్యం దేశం కోసం.. దేశభక్తి కోసం ప్రసంగాలు గుప్పించే వ్యక్తుల నుంచి దేశానికి సంబంధించిన అత్యంత గోప్యమైన సమాచారం ఓ జర్నలిస్టుకు లీక్ కావడంపై కాంగ్రెస్ మాజీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రంగా... Read more
Jan 19 | హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ లిమిటెడ్ సంస్థ రూపోందించిన కరోనా వాక్సీన్ కోవాక్సీన్ ను మూడవ దశ ట్రయల్స్ పూర్తి కాకుండానే అత్యవసర వినియోగం కోసం లైసెన్స్ పొందిన విషయం తెలిసిందే. అయితే... Read more
Jan 19 | నాగార్జునసాగర్ ఉప ఎన్నికను అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఉప ఎన్నికలలో భారీ మెజారిటీని సాధించేందుకు పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోంది. రాష్ట్రంలో తమకు ఎదురులేదని.. మోనార్క్ ముద్రను వేసుకున్న టీఆర్ఎస్ ఇకపై ఎన్నికలంటే... Read more
Jan 19 | కరోనా మహమ్మారి ప్రపంచ మానవాళిని భయం గుప్పెట్లోకి నెట్టిన తరువాత రెండో వేవ్ అంటూ భయాలు ఉత్పన్నమైన వేళ.. సెకెండ్ స్ట్రెయిన్ కూడా పలు దేశాలను అతలాకుతలం చేసింది. కరోనా నుంచి కోలుకున్న తరువాత... Read more