Revanth Reddy tears into BJP, MIM over NTR, PV పీవీ, ఎన్టీఆర్ లకు భారత రత్న ఇవ్వండీ: రేవంత్ రెడ్డి

If you really respect pv ntr award bharat ratna revanth reddy tears into bjp

Revanth Reddy slams into BJP MIM over NTR PV, Revanth Reddy, Congress, Bharat Ratna, Amit Shah, JP Nadda, PM Modi, NT Rama Rao, PV Narasimha Rao, political mileage, LK Advani, MM Joshi, Kalyan Singh, Bandi Sanjay, Asaduddin Owaisi, Akbaruddin Owaisi, GHMC elections, Hyderabad, Politics

Revanth Reddy has slammed the BJP and MIM over dragging the names of NT Rama Rao and PV Narasimha Rao ahead of the GHMC elections. The Congress MP accused the saffron party of disrespecting their own senior leaders such as LK Advani, MM Joshi and Kalyan Singh. He said to make an announcement that NTR and PVNR will be given Bharat Ratna by the Centre in the coming years.

ఓట్ల కోసం పివీ, ఎన్టీఆర్ పేర్లా.. భారత రత్న ఇవ్వండీ: బీజేపికి రేవంత్ కౌంటర్

Posted: 11/26/2020 11:21 PM IST
If you really respect pv ntr award bharat ratna revanth reddy tears into bjp

(Image source from: Thehansindia.com)

తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వరకు చాటిన మహానుభావుడు మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ అని, ప్రపంచంలోని తెలుగువారందరినీ ఏకం చేసిన ఘనత ఆయనదని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి కొనియాడారు. ఇక తెలుగువారికి మరింత వన్నె తీసుకువచ్చిన మహనీయుడు, తన ఆర్థిక సంస్కరణలతో ఈ దేశాన్ని అర్థిక సంక్షోభంలో పడనీయకుండా కాపాడిన ఘనుడు మాజీ ప్రధానమంత్రి సీపీ నరసింహారావుదని ప్రశంసించారు. దేశ ఆర్థిక వ్యవస్థను ఒడిదొడుకులు చుట్టుముట్టినా చెక్కుచెదరని అత్యున్నతమైన స్థితికి చేర్చిన ఘనత ఆయనదని అన్నారు. ప్రపంచ దేశాలతో భారత్ పోటీ పడేలా తీర్చిదిద్దారని అన్నారు.

ఇలా దేశానికి, రాష్ట్రానికే వన్నె తెచ్చిన మహనీయుల పేర్లను ఓట్ల కోసం వినియోగించుకుని దిగజారుడు రాజకీయాలకు పాల్పడటంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు, ఈ మహనీయులకు పేర్లను తుచ్చ రాజకీయాల కోసం వినియోగించడం చౌకబారు రాజకీయాలకు ఆజ్యం పోయడమేనని అన్నారు. ఎంఐఎం నేతలు ఎన్టీఆర్, పీవీ ఘాట్ గురించి వ్యాఖ్యలు చేయడం.. దానిని రాజకీయ మైలేజీకి బీజేపి వినియోగించుకునేందుకు యత్నించడం కూడా దారుణమనే అన్నారు. ఈ మహనీయుల పేర్లను నిజంగా ఉచ్చరించాలంటే.. వారికి భారత దేశ అత్యున్నత పురస్కారాలైన భారత రత్న అవార్డులను అందజేసే క్రమంలోనే తప్ప.. ఓట్ల కోసం, సీట్ల కోసం మాత్రం కారాదని రేవంత్ సూచించారు.

బీజేపిలోని అగ్రనేతలైన ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషీ, కళ్యాణ్ సింగ్ లాంటి మహనీయులను పక్కనబెట్టిన బీజేపి ఇతర పార్టీలకు చెందిన నాయకులను ప్రశంసిస్తూ.. రాజకీయ మైలేజీకి పాకులాడుతుందని దుయ్యబట్టారు, ఎన్టీఆర్, పీవీలపై ఎంతో గౌరవం ఉందని బీజేపీ చెపుతోందని... నిజంగా మీకు వారిపై గౌరవమే ఉంటే... కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి వారికి భారతరత్న ఇవ్వాలని రేవంత్ అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ పీవీ, ఎన్టీఆర్ ఘాట్లను సందర్శించి, వారిద్దరికీ భారతరత్నను ప్రకటించాలని డిమాండ్ చేశారు. పార్లమెంటు సమావేశంలో చర్చ పెట్టి, ఈ ఇద్దరు మహానాయకులకు మేము భారతరత్న ఇస్తున్నామని ప్రకటించాలని కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles