Jarkhand Orders Enquiry on Lalu లాలూ ప్రసాద్ యాదవ్ చుట్టూ బిగిస్తున్న మరో ఉచ్చు..

Bihar fir filed against lalu yadav by bjp mla for promising him ministerial berth

BJP MLA Lalan Kumar Paswan, MLA Lalan Kumar Paswan, Rashtriya Janata Dal, RJD chief Lalu Prasad Yadav, Bihar Assembly, Speaker Election, Bihar, Politics

BJP MLA Lalan Kumar Paswan on Thursday filed an first information report against Rashtriya Janata Dal chief Lalu Prasad Yadav for offering him a ministerial berth and inducing him to side with the Opposition during the election for the post of the Speaker in the Bihar Assembly

లాలూ ప్రసాద్ యాదవ్ చుట్టూ బిగిస్తున్న ఫోన్ కాల్ ఉచ్చు..

Posted: 11/26/2020 11:06 PM IST
Bihar fir filed against lalu yadav by bjp mla for promising him ministerial berth

కంద్రమంత్రి హోదాలో అక్రమాలకు పాల్పడినట్టు అభియోగాలు నిరూపితమైన కేసులో జార్ఖండ్ జైలులో జ్యుడీషియల్ కస్టడీ అనుభవిస్తున్న అర్జేడీ అధినేత లాలు ప్రసాద్ యాదవ్ చుట్టూ మరో ఉచ్చు బిగుసుకుంటోంది. జైలులో శిక్ష అనుభవిస్తూనే ఆయన ఓ ఎన్డీయే ఎమ్మెల్యేకు ఫోన్ చేసి, స్పీకర్ ఎన్నికల్లో ఓటింగ్ కు దూరంగా ఉండాలని కోరుతూ ఆయన మాట్లాడిన ఆడియో టేపులు బహిర్గతమైయ్యాయి. దీంతో బీహార్ రాష్ట్ర రాజకీయాలలో ఈ టేపులు కలకలం రేపాయి, ఈ ఆడియో టేపులు బహిర్గతం కావడంతో జార్ఖండ్ లో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న లాలూ ఫోన్ ను ఎలా వినియోగించారన్న విషయాన్ని తేల్చేందుకు ఝార్ఖండ్ సర్కారు విచారణకు ఆదేశించింది.

జార్ఖండ్ జైళ్ల శాఖ ఐజీ వీరేంద్ర భూషణ్ ఈ విషయమై స్పందిస్తూ.. లాలు ప్రసాద్ యాదవ్ ఫోన్ సంభాషణ ఎలా సాధ్యపడిందన్న విషయమై విచారణ జరుపుతున్నామని చెప్పారు. రాంచీ డిప్యూటీ కమిషనర్, ఎస్పీ, బిస్రా ముండా జైలు సూపరింటెండెంట్ ల ఆధ్వర్యంలో ఈ విచారణ కొనసాగుతుందని ఆయన తెలిపారు. ఈ ఆడియో క్లిప్ ను తాను కూడా విన్నానని, ఆ తరువాతే విచారణకు ఆదేశించానని భూషణ్ స్పష్టం చేశారు. జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న వారికి జైలు మాన్యువల్ ప్రకారం మొబైల్ ఫోన్ అందుబాటులో ఉండే అవకాశం లేదని, ఆయన ఫోన్ వాడుంటే, ఎవరి ఫోన్ ను వాడారన్న విషయాన్ని కూడా విచారణలో నిగ్గు తేలుస్తామని తెలిపారు.

లాలూ ప్రసాద్ యాదవ్ కు ఫోన్ ఎవరు అందించారన్న కోణంలోనూ తమ విచారణ సాగనుందన్న ఆయన ఇందుకు బాధ్యులైన వారిపై తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రస్తుతం లాలూ రిమ్స్ డైరెక్టర్ బంగళాలో ఉన్నతాధికారుల అనుమతితో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. లాలూను కలవడానికి వచ్చే వారి విషయంలోనూ రాంచీ జిల్లా పరిపాలనా విభాగం అధికారులే నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆయన్ను తిరిగి జైలుకు పంపేందుకు అనుమతి కోరుతూ ఝార్ఖండ్ హైకోర్టులో ఓ పిటిషన్ విచారణ దశలో ఉంది. వైద్యులు ఓ మారు ఆయన్ను పరిశీలించి, ఆరోగ్యం విషయంలో నివేదిక ఇస్తే, దాన్ని బట్టి తాము నిర్ణయం తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles