ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ మహమ్మారి తగ్గుముఖం పట్టింది. మే నెల చివరి వారం నుంచి వేగాన్ని పుంజుకున్న కరోనా మహమ్మారి రాష్ట్రంలో రోజుకు వందలాది మందిని తన ప్రభావానికి గురిచేస్తూ ఏకంగా 8.65లక్షల మార్కును అధిగమించింది. ఇక పక్షం రోజులుగా రాష్ట్రంలో కరోనా కేసులు వేగానికి కళ్లాలు పడ్డాయి, మరోవైపు మరణాల సంఖ్య కూడా గణనీయంగా తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో క్రమంగా తగ్గుతున్న మరణాలు, కేసులతో ప్రజలు కాసింత ఊరట చెందుతున్నారు. దాదాపుగా పక్షం రోజులుగా ప్రతీ రోజు మూడు వేల మార్కుకు దిగువన కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా కేసులు నిర్థారణతో ఏకంగా ఎనమిది లక్షల 65 వేల మార్కు అధిగమించాయి, ప్రభుత్వం కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకుంటున్నా వైరస్ ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు.
తమిళనాడు కోయంబేడు మార్కట్ లో విజృంభించిన కరోనా ఏపీపై కూడా తన ప్రభావాన్ని చాటింది. అప్పటి నుంచి కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే వుంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 1000 మార్కుకు చేరువలో కేసులు నమోదు కావడం వైద్యాధికారులకు కాసింత ఊరటనిస్తోంది. తాజాగా నమోదైన పాజిటివ్ కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య ఏకంగా 8.65 లక్షల మార్కును అధిగమించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ తాజా బులిటెన్లో వివరాలను పేర్కోంది. తాజాగా 1031 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. రాష్ట్రంలో మొత్తంగా 8,65,705 కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే ఇందులో విదేశాల నుంచి వచ్చిన వారితో పాటు పోరుగు రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు ఎవరూ లేకపోవడం గమనార్హం.
ఇవాళ నమోదైన కరోనా కేసుల్లో అత్యధికంగా అత్యధికంగా పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, చిత్తూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో నమోదయ్యాయి. దీంతో పాటు అనంతపురం, గుంటూరు, నెల్లూరు, విశాఖపట్నం జిల్లాల్లో రమారమి రెండు వందలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి, గత వారం రోజులుగా తగ్గుతున్న ఈ కేసులు మళ్లీ పెరగడంతో స్థానిక అధికార యంత్రాంగంతో పాటు జిల్లా వాసులను కూడా కలవరానికి గురిచేస్తోంది. ఇక రాష్ట్రంలో జిల్లాలవారీగా పరిశీలిస్తే.. ఆనంతపురంలో 56, చిత్తూరు జిల్లాలో 102, తూర్పు గోదావరి జిల్లాలో 117, గుంటూరు జిల్లాలో 172, కడప జిల్లాలో 55, కృష్ణా జిల్లాలో 162, కర్నూలు 21 పాజిటివ్ కేసులు నిర్థారణ అయ్యాయి.
నెల్లూరు జిల్లాలో 41, ప్రకాశం జిల్లాలో 43, శ్రీకాకుళం జిల్లాలో 23, విశాఖపట్నం జిల్లాల్లో 84, విజయనగరంలో 29, పశ్చిమ గోదావరి జిల్లాలోనూ 126 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, వైద్యశాఖ అధికారులు కరోనా కేసులు నమోదైన ప్రాంతాల్లో కంటైన్ మెంట్ జోన్లు ఏర్పాటు చేసి.. వైరస్ వ్యాప్తి చెందకుండా పటిష్ట చర్యలు తీసుకునన్నారు. ఇక పురపాలక సంఘాలు, గ్రామ పంచాయితీల ఆధ్వర్యంలో కంటైన్ మెంట్ జోన్లలో రసాయనాలు చల్లారు. ఆయా ప్రాంతాలను సానిటైజ్ చేశారు. కాగా, రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో కరోనా బారినపడి 8 మంది అసువులు బాసారు. కృష్ణా, గుంటూరు, కడప, తూర్పు గోదావరి జిల్లాల్లో మరణాలు సంభవించాయి.
24 గంటల వ్యవధిలో 8 మంది కరోనాతో చికిత్స పొందుతూ మృతిచెందారు. కృష్ణ జిల్లాలో ఇద్దరు మరణించగా, కడప జిల్లాలో ఒక్కరు, తూర్పుగోదావరి జిల్లాలో ఒక్కరు, గుంటూరులో ఒక్కరు, కర్నూలులో ఒక్కరు, విశాఖపట్నంలో జిల్లాలో ఒక్కరు, పశ్చిమ గోదావరి జిల్లాలో మరణించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 6,927కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్ విడుదల చేసింది. దీంతో కోరాన వైరస్ బారిన పడి చికిత్స పోందుతూ ఇవాళ 1081 మంది అసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ఈ సంఖ్య 8,46,170 కు చేరడం రాష్ట్రప్రజలకు, వైద్య సిబ్బందికి కొంత ఊరటనిస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుత్తం 14,770 యాక్టివ్ కేసులున్నాయి. ఇక కరోనా బారిన పడి.. విదేశాల నుంచి వచ్చి.. చికిత్స పోందుతున్న వారి సంఖ్య 434గా నమోదు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికుల సంఖ్య కూడా ఏకంగా 2461కు చేసింది.
(And get your daily news straight to your inbox)
Jan 21 | తెలంగాణ అధికార పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు తనయ.. షేక్ పేట్ తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డీలు పరస్పరం బంజారాహీల్స్ పోలిస్ స్టేషన్లో పిర్యాదు చేసుకున్నారు. అదేంటి కేకే తనయ విజయలక్ష్మి... Read more
Jan 21 | ఆంధ్రప్రదేశ్ లో గ్రామపంచాయితీ ఎన్నికల నిర్వహణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర ప్రభుత్వం వాదనలతో ఏకీభవించని న్యాయస్థాన ధర్మాసనం రాష్ట్ర ఎన్నికల సంఘం వాదనలను బలపరుస్తూ రాష్ట్రంలో... Read more
Jan 21 | టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి కళా వెంకట్రావును అరెస్టు చేయలేదని, కేవలం విచారణకు మాత్రమే పిలిచామని విజయనగరం జిల్లా ఎస్పీ బి రాజకుమారీ తెలిపారు. రామతీర్థాన్ని టీడీపీ నేతలు సందర్శించిన రోజున జరిగిన ఘటనపై... Read more
Jan 21 | అగ్రరాజ్యం అమెరికా 46వ అధ్యక్షుడిగా డెమొక్రాట్ పార్టీ అభ్యర్థి జోబైడెన్ ప్రమాణ స్వీకారం చేశారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా రెండో పర్యాయం బరిలో నిలిచిన డోనాల్డ్ ట్రంప్ ను గణనీయమైన ఓట్లతో ఓడించి.. ఆయన... Read more
Jan 21 | దేశ రాజధానిలో తన సత్తాను చాటిన అమ్ ఆద్మీ పార్టీ రెండో పర్యాయం కూడా అధికారంలోకి రాకముందే అటు పంజాబ్, ఇటు హర్యానా సహా పలు రాష్ట్రాల్లోనూ సత్తా చాటుకునేందుకు ప్రయత్నాలు కొనసాగించింది. పంజాబ్... Read more