SBI ATM cash withdrawal guidelines OTP time limit పెద్ద మొత్తంలో డబ్బు విత్ డ్రా చేయాలా.. అయితే ఫోన్ తప్పనిసరి..

Sbi issues new guidelines for otp based atm withdrawal facility

sbi, sbi atm, SBI OTP-based ATM withdrawal facility, state bank of india, sbi cash withdrawal, SBI OTP-based cash withdrawal, Business

The State Bank of India (SBI) has announced new guidelines on cash withdrawal by its customers having OTP based ATM cards. SBI has extened the time for the OTP-based cash withdrawal from its ATMs. The cash withdrawal facility for the SBI customers will now be available throughout the day for transactions of Rs 10,000 and above from September 18.

పెద్ద మొత్తంలో డబ్బు విత్ డ్రా చేయాలా.. అయితే ఫోన్ తప్పనిసరి..

Posted: 09/17/2020 02:11 AM IST
Sbi issues new guidelines for otp based atm withdrawal facility

భారతీయ స్టేటు బ్యాంకు తమ ఖాతాదారుల డబ్బును పటిష్ట భద్రతను కల్పించే విషయంలో మరో అడుగుముందుకేసింది. ఇన్నాళ్లు కేవలం రాత్రి సమయంలోనే వర్తించే ఓటీపిని ఇక పగలు కూడా అమల్లోకి తీసుకురానుంది. అదేంటీ అంటే.. భారతీయ స్టేట్ బ్యాంకు ఖాతాదారులు ఇకపై ఎప్పుడు కాసింత పెద్ద మొత్తంలో డబ్బును విత్ డ్రా చేయాలని భావించినా ఇకపై ఫోన్ ను తప్పనిసరిగా తీసుకువెళ్లాలి. లేని పక్షంలో డబ్బులు విత్ డ్రా కావు. ఫోన్ కు డబ్బుకు అనుసంధామేంటీ అంటే ఇకపై పది వేల రూపాయల కన్నా అధికంగా డబ్బును విత్ డ్రా చేయాలంటే తప్పనిసరిగా ఓటిపీని ఎంటర్ చేయాల్సిందే.

అయితే గత జనవరి మాసం నుంచి అమల్లోకి వచ్చిన ఈ నిబంధన ఎస్బీఐ ఏటీఎంలలో రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల మధ్య రూ.10 వేలు లేక అంతకంటే కంటే ఎక్కువ డబ్బును విత్ డ్రా చేసుకోవాలంటే కస్టమర్ల మొబైల్‌కు వచ్చే ఓటీపీ నంబర్ ఎంటర్ చేయడం ఇప్పటివరకు అమల్లో ఉంది. అయితే, ఈ నెల 18 నుంచి 24 గంటల పాటు ఈ నిబంధన అమల్లోకి రానుంది. రూ.10 వేలు లేక అంతకంటే ఎక్కువ నగదు తీసుకుంటే డెబిట్ కార్డు పిన్‌ నంబరునే కాకుండా, ఓటీపీని కూడా నమోదు చేయాల్సిందేనని ఎస్బీఐ తెలిపింది. అయితే విత్ డ్రా సమయంలో జరుగుతున్న నేరాలను అదుపు చేయడానికే ఎస్బీఐ ఈ కొత్త నిబంధన అమల్లోకి తీసుకువచ్చింది.

కాగా గ్రామీణ భారతంలో నాలుగు నెంబర్లు వున్న పిన్ ఎంటర్ చేయడానికే వేరొకరి సాయం కోరుతున్న నిరక్షరాస్యులకు ఈ కొత్త నిబంధన మరిన్ని కష్టాలను తీసుకువస్తోందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు, ఎస్బీఐ క్రెడిట్‌ కార్డుదారులకు క్రెడిట్‌ స్కోరు తెలుసుకునే సదుపాయాన్ని కల్పిస్తామని ఆ బ్యాంకు తెలిపింది. అమెరికాలో మాదిరిగా మరికొన్ని సదుపాయాలు కూడా కల్పించాలనుకుంటున్నట్లు పేర్కొంది. క్రెడిట్‌కార్డు ఉన్న వారు వారి ఖాతా నుంచి క్రెడిట్‌ స్కోరు తెలుసుకునేందుకు ఖాతాలోకి లాగిన్‌ అయి తెలుసుకోవచ్చని, ఇందుకోసం ఎటువంటి చెల్లింపులూ చేసే అవసరం లేదని తెలిపింది. కస్టమర్లకు ఉపయోగపడే ఈ ఫీచర్‌ను వెంటనే అమలు చేయడానికి ప్రయత్నిస్తామని తెలియజేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles