Serum gets DGCI nod for trials in India పునఃప్రారంభమైన ఆక్స్ ఫర్డ్‌ వ్యాక్సిన్‌ ట్రయల్స్.. డీజీసిఐ అనుమతి

Serum institute gets dcgi nod to resume clinical trial of oxford vaccine

COVID-19, coronavirus, corona positive, COVID-19 vaccine, coronavirus vaccine,vaccine latest updates,corona vaccine latest,covid vaccines news,latest coronavirus vaccine,oxford covid vaccine,astrazeneca oxford vaccine latest news

Drugs Controller General of India (DCGI) Dr VG Somani gave permission to Serum Institute of India to resume clinical trial of the Oxford COVID-19 vaccine candidate in the country while revoking its earlier order of suspending any new recruitment for phase two and three trial.

పునఃప్రారంభమైన ఆక్స్ ఫర్డ్‌ వ్యాక్సిన్‌ ట్రయల్స్.. డీజీసిఐ అనుమతి

Posted: 09/16/2020 08:09 PM IST
Serum institute gets dcgi nod to resume clinical trial of oxford vaccine

కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసి.. ప్రజాజీవనాన్ని స్థంభింపజేసి అప్పుడే ఏకంగా తొమ్మిది మాసాలు పూర్తికావస్తొంది. దీంతో ఈ మహమ్మారిని నియంత్రించడానికి వాక్సీన్ రూపోందిస్తున్న పలు దేశాలు ప్రస్తుతం ట్రయల్స్ దశలో వున్నాయి. కాగా ఇప్పటికే దక్షిణాఫ్రికా తమ ప్రాంత ప్రజలకు అవసరమైన వాక్సీన్ ను రూపోందించి.. అక్కడి ప్రజలకు అందిస్తోండగా, ఆ వెంటనే రష్యా కూడా తమ వాక్సీన్ ను తమ దేశ ప్రజలకు అందుబాటులోకి తీసుకురానుంది. కాగా ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ కూడా టీకా రూపోందించింది. కాగా ప్రస్తుతం ఈ టీకా ప్రయోగ దశలో వున్న విషయం తెలిసిందే.

అయితే ఇటీవల కొంత వ్యతిరేక నివేదికలతో ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ, అస్ట్రాజెనెకా మూడో దశ ప్రయోగాలను తాత్కాలికంగా నిలిపివేసింది. బ్రిటన్ లో ఈ టీకా వేయించుకున్న ఓ వాలంటీరుకు అనారోగ్య సమస్యలు తలెత్తిన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో తొలి రెండు దశలు పూర్తి చేసుకున్న వాక్సీన్ కీలకమైన మూడవ.. తుది దశకు చేరుకున్న తరుణంలో క్లినికల్‌ ట్రయల్స్ ను ప్రస్తుతానికి నిలిపివేసినట్లు ఆస్ట్రాజెనెకా వెల్లడించింది. వ్యాక్సిన్‌ తయారీ, భద్రతపై మరోసారి పూర్తి స్థాయి సమీక్ష నిర్వహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. దీంతో భారత్ లో ఆక్స్ ఫర్డ్-ఆస్ట్రాజెనెకా ప్రయోగాలకు కూడా డీజీసిఐ నోటీసులతో ఈ టీకా రెండో దశ ప్రయోగాలకు బ్రేకులు పడ్డాయి.

తొలుత భారత్ లో తమ ప్రయోగాలు యధాతథంగా కొనసాగుతున్నాయని ఫూణే కేంద్రంగా హ్యూమన్ ట్రయల్స్ నిర్వహిస్తున్న సెరమ్ ఇండియా ప్రకటించిగా,, డీజీసీఐ అదేశాల నేపథ్యంలో బ్రేకులు పడ్డాయి. అయితే తాజాగా కరోనా వాక్సీన్ ప్రయోగాలకు డీజీసీఐ అనుమతులు మంజూరు చేశారు. కాగా ప్రయోగాల నేపథ్యంలో స్ర్కీనింగ్ జరుగుతున్న క్రమంలోనే పూర్తి పరీక్షలు నిర్వహించి నిత్యం పర్యవేక్షించాలని అదేశాలను కూడా జారీ చేసింది. అత్యంత జాగ్రత్తతో ఈ ప్రయోగాలను నిర్వహించాలని అదేశిస్తూ.. రెండు, మూడవ దశ ప్రయోగాలను నిలిపివేయాలన్న అదేశాలను వెనక్కి తీసుకోవాలని అదేశించారు. దీంతో పాటు అనారోగ్య సమస్యలు తలెత్తన పక్షంలో ఇవ్వాల్సిన మందుల జాబితా, ఇతర చికిత్సా నిబంధనలను కూడా తమకు సమర్పించాలని డీజీసీఐ కోరింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AstraZeneca  coronavirus  India  Serum Institute  covid vaccine  Oxford University  covid-19  

Other Articles