RX 100 producer Ashok Reddy arrested in Sravani case శ్రావణి ఆత్మహత్య కేసులో నిర్మాత అరెస్టు

Hyderabad police arrested rx 100 producer ashok reddy in sravani case

telugu tv actress suicide case, tv actress sravani kondapalli suicide case, Devaraj Reddy, Sai Kumar Reddy, RX 100 producer, Ashok Reddy Gummakonda, telugu tv actress, suicide case, sravani kondapalli, Sravani, Osmania Hospital, mounaraagam, Manasu Mamatha, Devaraju Reddy, Blackmail, SR nagar police, Hyderabab, crime

Hyderabad Police had arrested RX 100 producer Ashok Reddy Gummakonda in the suicide case of TV actress Sravani Kondapalli. The producer was absconding since the suicide of sravani.

టీవి నటి శ్రావణి ఆత్మహత్య కేసులో ఆర్ఎక్స్ 100 నిర్మాత అరెస్టు

Posted: 09/17/2020 02:25 AM IST
Hyderabad police arrested rx 100 producer ashok reddy in sravani case

‘మనసు మమత’, ‘మౌనరాగం’ సీరియల్స్ లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసులో ఆర్ఎక్స్ 100 నిర్మాత అశోక్ రెడ్డిని సంజీవరెడ్డి నగర్ పోలీసులు ఎట్టకేలకు కటకటాల వెనక్కి పంపారు. శ్రావణి హత్యకేసు నేపథ్యంలో పరారీలో వున్న అశోక్ రెడ్డిని పోలీసులు ఇవాళ అరెస్టు చేసి అరదండాలు వేశారు. శ్రావణి ఆత్మహత్య కేసులో ఆయన ప్రమేయం కూడా వుందని పోలీసులు అభియోగాలు ఎదుర్కోంటున్న తరుణంలో తమ ఎదుట విచారణకు హాజరుకావాలని పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చారు.

దీంతో తాను సోమవారం రోజున విచారణకు హాజరవుతానని చెప్పిన ఆయన తన ఫోన్ ను స్విచ్ఛాప్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. చివరకు ఇవాళ పోలీసులు కూడా తమ అధునాతన సాంకేతికను వినియోగించి అశోక్ రెడ్డి ని కనిపెట్టి ఎట్టకేలకు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన తరువాత ఆయనను ఆసుపత్రికి తరలించి అరోగ్య పరీక్షలను నిర్వహించారు. సినిమాల్లో చక్కని అవకాశాలు కల్పిస్తానని ఆశ చూపిన ఆయన శ్రావణితో సంబంధం ఏర్పర్చుకున్నారని పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు. అయితే, దేవరాజ్ కు శ్రావణి దగ్గర కావడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. సాయికృష్ణ ద్వారా ఒత్తిడి తీసుకొచ్చి వారిద్దరూ విడిపోయేందుకు యత్నించాడు.

ఈ నెల 7న అమీర్ పేట హోటల్ వద్ద శ్రావణి, దేవరాజ్ గొడవపడ్డారు. ఆ తర్వాత సాయికృష్ణ ఆమెను ఇంటికి తీసుకెళ్లాడు. అప్పటికే అశోక్ రెడ్డి అక్కడ ఉన్నాడు. ఆ తర్వాత అందరూ కలిసి ఆమెను హింసించారు. అనంతరం ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. అశోక్ రెడ్డితో పాటు నటి శ్రావణి ఆత్మహత్యకు సంబంధించిన అభియోగాలు ఎదుర్కోంటున్న సాయి కృష్ణారెడ్డి, దేవరాజు రెడ్డిలను పోలీసులు ఇదివరకే అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపర్చారు. న్యాయస్థానం అదేశాల మేరకు వారిద్దరినీ జుడీషియల్ రిమాండ్ కు తరలించిన విషయం తెలసిందే. ఇక అప్పటి నుంచి అశోక్ రెడ్డి కోసం తీవ్రంగా అన్వేషణ చేపట్టిన పోలీసులు ఆయనను ఇవాళ అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపర్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh