Railways started 80 more special trains ప్రయాణికుల సౌలభ్యం కోసం మరో 80 ప్రత్యేక రైళ్లు

Railways started 80 more special trains from today

Coronavirus in india, coronavirus india news, coronavirus latest news, coronavirus news, coronavirus news today, coronavirus update, coronavirus, Indian Railways, special trains, Railway Board chairman VK Yadav, special trains to begin

'శty new special trains or 40 pair of trains will start operations from today. Reservations began since September 10. This are runing in addition to the 230 trains already in operation,' Railway Board chairman VK Yadav said.

పట్టాలెక్కనున్న మరో 40 ప్రత్యేక రైళ్లు

Posted: 09/16/2020 07:22 PM IST
Railways started 80 more special trains from today

(Image source from: Twitter.com/RailMinIndia)

భారతీయ రైల్వే ప్రయాణికుల కోసం మరికొన్ని రైళ్ల సేవలను పునరుద్దరించిన తరువాత ఆన్ లాక్ 4.0 నుంచి దేశవ్యాప్తంగా 80 ప్రత్యేక రైళ్లును ప్రారంభించిన విషయం తెలిసిందే. కేవలం మూడు రోజుల క్రిందటే ఈ రైళ్లు ప్రారంభమైనప్పటికీ ఈ రైళ్లలో ప్రయాణించేందుకు ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగింది. సెప్టెంబర్ 10 నుంచి రిజర్వేషన్ కూడా ప్రారంభం కాగా, సెప్టెంబర్ 12 నుంచి సేవలు అందిస్తున్నాయి. కాగా అప్పటికీ నడుస్తున్న 230 రైళ్లకు అదనంగా ఈ 80 ప్రత్యేక రైళ్లు నడుస్తుండగా, ప్రస్తుతం మరో 40 కొత్త రైళ్లు కూడా సేవలు అందించనున్నాయి. ఈ మేరకు తాజాగా భారతీయ రైల్వే ప్రకటించింది.

దీంతో భారతీయ రైల్వే నడుపుతున్న రైళ్ల సంఖ్య 350 కి చేరుకోనుంది. మే 12 నుంచి అందుబాటులోకి వచ్చిన 30 ప్రత్యేక రాజధాని రైళ్ల తరువాత, అన్ లాక్ 1.0 నేపథ్యంలో జూన్ 1 నుంచి 200 మెయిల్ ఎక్స్ ప్రెస్ రైళ్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇవి దేశంలోని వివిధ నగరాల నుంచి దేశరాజధాని నడుస్తున్నాయి. వీటి తరువాత ఇటీవల సెప్టెంబర్ 12 నుంచి 80 స్పెషల్ రైళ్లు కూడా వివిధ నగరాలకు సేవలను అందిస్తుండగా, తాజాగా మరో 40 ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు భారతీయ రైల్వే ప్రకటించింది. తాజాగా అందుబాటులోకి రానున్న 40 ప్రత్యేక రైల్లు ఈ నెల 21 నుంచి సేవలను అందించనున్నాయి.

ఇటీవల అందుబాటులోకి వచ్చిన 80 ప్రత్యేక రైళ్ల మార్గాల్లో ఏదేని రైలుకు విపరీతమైన డిమాండ్ వుంటే ఆ స్థానంలో క్లోన్ రైళ్లను ప్రత్యేకంగా ప్రవేశపెడతామని ఇటీవల ప్రకటించిన రైల్వే.. తాజాగా వాటిని 21 నుంచి అందుబాటులోకి తీసుకురానుంది. దీంతో ఆయా మార్గాల్లో వున్న ప్రయాణికుల డిమాండ్ అందుకునేందుకు ఈ క్లోన్ రైళ్లు దోహదపడనున్నాయి. కాగా క్లోన్ రైళ్లు అన్ని రిజర్వుడ్ రైళ్లని.. వీటిలో ప్రయాణించేందుకు ప్యాసింజర్లు ముందస్తుగా టిక్కెట్లు కొనుగోలు చేసుకోవాలని తెలిపింది. ఈ రైళ్లకు 10 రోజుల ముందు నుంచే టికెట్లు బుక్ చేసుకోవచ్చు. అయితే ఈ రైళ్లు కూడా లిమిటెడ్ స్టాపుల్లోనే ఆగనుంది.

* రైలు నెంబర్ 02787- సికింద్రాబాద్ నుంచి దానాపూర్ - ఉదయం 7.30 గంటలకు

* రైలు నెంబర్ 02788 - దానాపూర్ నుంచి సికింద్రాబాద్‌ - ఉదయం 9.00 గంటలకు

* రైలు నెంబర్ 06509 - బెంగళూరు నుంచి దానాపూర్ - ఉదయం 8 గంటలకు

* రైలు నెంబర్ 06510 - దానాపూర్ నుంచి బెంగళూరు - సాయంత్రం 6.10 గంటలకు

ఈ రైళ్లు విజయవాడ, వరంగల్ నగర రైల్వే స్టేషన్లలో ఆగుతాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : coronavirus  Indian Railways  special trains  Railway Board chairman  VK Yadav  special trains  

Other Articles