Prof K Nageshwar Gets Threatening Calls మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్ కు బెదిరింపులు.. చర్యలు చేపట్టని పోలీసులు..

Former mlc prof k nageshwar gets threatening calls

K Nageshwar Gets Threatening Calls, Prof K Nageshwar Gets Threatening Calls, Prof K Nageshwar Threatening Calls, internet based threat calls, abuse, filthy language, hawk-eye, Hyderabad police, Telangana, Crime

Former MLC and political analyst professor K Nageshwar has lodged a complaint with the Hyderabad cops after he received death threat calls. As we know professor Nageshwar is very active person and with his official YouTube channel, he expresses his opinion on political and non-political issues.

మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్ కు బెదిరింపులు.. చర్యలు చేపట్టని పోలీసులు..

Posted: 08/07/2020 02:37 PM IST
Former mlc prof k nageshwar gets threatening calls

విశ్లేషకులు, విమర్శకులు కూడా తమ దారికి తెప్పించుకునేందుకు గత కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలు అందోళన రేకెత్తించేలా వున్నాయి. తమకు అనుకూలంగా వ్యాఖ్యానలు, అభిప్రాయాలను వ్యక్తం చేయాలనే ప్రయత్నాలు సాగుతున్నాయి. వారి మాటలను లక్ష్యపెట్టక నిష్టూరమైన నిజాలను వ్యక్తం చేస్తూ.. తమ అభిప్రాయాలను వాస్తవాలకు అనుగూణంగా వుండేట్లు వ్యక్తం చేసే ప్రముఖులపై బెదిరింపులకు తెగబడుతున్న ఘటనలు ఉత్పన్నం అవుతున్నాయి. ముఖం బాగోలేక అద్దం పగలగొట్టినట్టు.. వారు చేసే పనులను ఎత్తిచూపి ప్రశ్నించినా, విమర్శించినా, తద్ వ్యతిరేకంగా అభిప్రాయాలను వ్యక్తం చేసినా బెదిరింపు ఫోన్ కాల్స్ చేస్తున్నారు.

తాజాగా మాజీ ఎమ్మెల్సీ, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్‌ కె.నాగేశ్వర్ కూడా ఇలాంటి పరిణామాలను ఎదురుకోవాల్సి వచ్చింది. గత నెల ఆఖరులో ఆయనకు బెదిరింపు కాల్స్‌ వచ్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెల (జూలై) 25న సాయంత్రం గుర్తుతెలియని అగంతకుల నుంచి నాగేశ్వర్‌కు వరుసగా ఫోన్స్‌ వచ్చాయి. ఇంటర్నెట్‌ వాయిస్‌ బేస్డ్‌ కాల్‌ చేసి తనను అసభ్యపదజాలంతో దూషించడంతో పాటు ఆయనను హతమారుస్తామని కూడా బెదిరించినట్లు సమాచారం. తొలుత సాయంత్రం ఆరున్నర గంటలకు ఆగంతకుల నుంచి నాగేశ్వర్ కు తొలి ఫోన్ వచ్చింది. తరువాత అదే రోజు రాత్రి తొమ్మిదిన్నర నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు అనేక పర్యాయలు ఆయనకు ఫోన్లు వచ్చాయి.

అయితే వాటిని ఆయన తేలిగ్గా తీసుకున్నారు. మరుసటి రోజు మరోసారి ఆయనకు ఫోన్ చేసిన ఆగంతకుడు నేరుగా నాగేశ్వర్ ఇంటికి వచ్చి తనపై దాడి చేస్తానని బెదిరింపు కాల్ చేయడంతో ఆయన పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు ఆయన గత నెల 25నే హాక్‌ ఐ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కె. నాగేశ్వర్‌ మాట్లాడుతూ ‘‘గత 25న నన్ను చంపుతానని అగంతకుడు ఫోన్‌ చేశాడు. సామాజిక మాధ్యమాల్లో ఇష్టారీతిన మాట్లాడుతున్నానని దూషించాడు. ఈ విషయాన్ని డీజీపీ, సీపీ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశా. కానీ వారు అందుబాటులోకి రాలేదు. 12 రోజులైనా ఫిర్యాదు విషయంలో ఎలాంటి పురోగతి లేదు. నాకే ఇలాంటి పరిస్థితి ఉంటే.. సామాన్యుల ఫిర్యాదుల సంగతేంటి? ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదు. రెట్టించిన ఉత్సాహంతో ప్రజా సమస్యలపై గళం వినిపిస్తా’’అని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles