Rapid recovery with aviptadil in Covid-19 patients వెంటిలేటర్ పై ఉన్నా.. ఆశలు చిగురింపజేస్తున్న 'ఆర్‌ఎల్‌ఎఫ్‌-100'

Rlf 100 shown to deliver rapid recovery in covid 19 patients

COVID-19, Coronavirus, RLF-100, fda, covid-19-related, SHK, aviptadil, neurorx, ventilators, Houston Methodist Hospital, America, US

The companies said that rapid recovery was seen in patients on ventilators and extracorporeal membrane oxygenation (ECMO) and having severe medical comorbidities following three days of treatment with RLF-100 at various clinical sites. RLF-100 is being developed as the first therapeutic for Covid-19 for preventing replication of the SARS-CoV-2 virus in human lung cells and monocytes, as reported by independent researchers.

వెంటిలేటర్ పై ఉన్నా.. ఆశలు చిగురింపజేస్తున్న ‘ఆర్‌ఎల్‌ఎఫ్‌-100’

Posted: 08/07/2020 05:36 PM IST
Rlf 100 shown to deliver rapid recovery in covid 19 patients

(Image source from: health.economictimes.indiatimes.com)

ప్రపంచవ్యాప్తంగా సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరిపై తన ప్రభావాన్ని చూపుతున్న కరోనా మహమ్మారి లక్షలాది మందిని కబళించింది. కాగా, తాజాగా శృంగార ఔషదం మాత్రం కరోనా ప్రభావం తీవ్రంగా వున్న రోగుల్లోనూ ఆశలు రేకెత్తిస్తోంది. మరోవిధంగా చెప్పాలంటే వెంటిలేటర్ సాయంతో శ్వాస తీసుకుంటున్న రోగుల్లోనూ ఉపశమనం కల్పిస్తోంది. ఇంతకీ ఈ శృంగార ఔషదం ఏమిటంటారా.?అంగస్తంభన సమస్యల నివారణ కోసం ఉపయోగించే ఆర్ఎల్‌ఎఫ్-100 (అవిప్టడిల్) ఔషధమే ఇది.  కరోనా మహమ్మారి తీవ్ర ప్రభావం చూపినా.. దానికి ఆర్ఎల్ఎఫ-100 విరుగుడుగా పనిచేస్తోందని తాజాగా జరిపిన పరిశోధనల్లో వెల్లడైంది.

దీనిని సాధారణంగా ముక్కు ద్వారా పీల్చడం ద్వారం అంగస్తంభన సమస్యలు పరిష్కారమవుతాయి. ఈ ఔషదాన్ని తీవ్ర అనారోగ్యంతో ఉన్న కరోనా బాధితులకు బహుళ క్లినికల్ సైట్లలో అత్యవసరంగా ఉపయోగించడం కోసం ఎఫ్‌డీఏ చేత ఆమోదించబడింది. చికిత్సలో వాడిన తర్వాత వెంటిలేటర్లపై ఉన్న కరోనా బాధితులు వేగంగా కోలుకున్నట్లు హ్యూస్టన్ మెథడిస్ట్ హాస్పిటల్ నివేదించింది. ఈ మందు పేటెంట్‌ హక్కులు కలిగి ఉన్న స్విట్జర్లాండ్‌ కంపెనీ రిలీఫ్‌ థెరపాటిక్స్‌, ఇజ్రాయెలీ-అమెరికన్‌ సంస్థ న్యూరోఆర్‌ఎక్స్‌తో కలిసి సెప్టెంబర్ 1 నుంచి ప్రయోగాలను నిర్వహించనున్నారు. ఈ ఔషధాన్ని ఉపయోగించి కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు జూన్ నెలలో అనుమతులు లభించాయి.

అమెరికాలోని హ్యూస్టన్‌ మెథడిస్ట్‌ ఆస్పత్రి వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. 54 ఏళ్ల వ్యక్తికి ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్స విఫలం కావడంతో ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతున్న సమయంలో అతనికి కరోనా సోకింది. ఈ క్రమంలో తీవ్ర శ్వాసకోశ సమస్య తలెత్తడంతో అతనికి ఆర్ఎల్‌ఎఫ్-100 ఔషదాన్ని ఇచ్చారు. అతడి ఆరోగ్యం నాలుగు రోజుల వ్యవధిలోనే మెరుగుపడి వెంటిలేటర్‌పై నుంచి జనరల్‌ వార్డుకు మారారు. మరో 15 మంది కూడా ఇదే విధంగా త్వరగా కోలుకున్నారు. దీంతో మరి కొందరిపై ప్రయోగాలు చేయాలని వైద్యులు నిర్ణయం తీసుకున్నారు. ప్రయోగ ఫలితాలు మరింత సానుకూలంగా వస్తే కరోనా నుంచి వేగంగా కోలుకునే అవకాశం ఉంది. కాగా.. ఆర్‌ఎల్‌ఎఫ్‌-100 ఔషదం వాడటం వల్ల మోనోసైట్స్‌లో తెల్లరక్తకణాల సంఖ్య వృద్ధి చెందకుండా నిరోధిస్తోందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : COVID-19  Coronavirus  RLF-100  fda  covid-19-related  SHK  aviptadil  neurorx  ventilators  Houston Methodist Hospital  America  US  

Other Articles