BJP MP CM Ramesh Tests Positive హోం ఐసోలేషన్ లో ఎంపీ సీఎం రమేష్

Bjp rajya sabha mp cm ramesh tests positive for covid 19

coronavirus, covid-19, BJP MP CM Ramesh Tests Positive, CM Ramesh Home isolation, CM Ramesh, CM Ramesh corona positive, BJP Rajya Sabha MP, Andhra Pradesh MP, COVID-19, Coronavirus, Andrha pradesh

BJP MP Tests Positive | BJP leader from Andhra Pradesh and Rajya Sabha MP CM Ramesh tests positive for Covid-19 and goes into self-isolation on doctors' advice.

బీజేపి రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్ కు కరోనా పాజిటివ్

Posted: 08/07/2020 01:46 PM IST
Bjp rajya sabha mp cm ramesh tests positive for covid 19

(Image source from: english.tupaki.com)

ప్రపంచవ్యాప్తంగా సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరిపై తన ప్రభావాన్ని చూపుతున్న కరోనా మహమ్మారి ఇటు మన తెలుగు రాష్ట్రాల్లోనూ తన వ్యాప్తిని అంతకంతకూ విస్తరింపజేసుకుంటోంది. ఇదివరకుఅధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు పలువురు కరోనా మహమ్మారి బారిన పడ్డారు. ఇక వారిలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన మాజీ మంత్రి మాణిక్యాల రావు, తెలంగాణకు చెందిన భద్రాద్రి కొత్తగూడెం ఎమ్మెల్యే సున్నం రాజయ్యలు ఇప్పటికే అసువులు బాసారు. ఇక ఇప్పటికే పలు రాజకీయ పార్టీలకు చెందిన ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకగణం కూడా కరోనాబారిన పడ్డారు. వారిలో పలువురు మృతి చెందిన విషయం కూడా తెలిసిందే.

కాగా తాజాగా ఈ జాబితాలో బీజేపి రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ కూడా చేరారు. టీడీపీ పార్టీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన ఆయన ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో టీడీపీ నుంచి బీజేపిలోకి  చేరిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆయన తాజాగా కరోనా బారిన పడ్డారు. సీఎం రమేశ్ కు కరోనా పాజిటివ్ గా వైద్యులు నిర్ధారించారు. గత కొన్ని రోజులుగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న క్రమంలో అనుమానంతో కరోనా పరీక్షలు చేయించుకోగా, ఆయనకు కోవిడ్ పాజిటివ్ గా నిర్థారణ అయ్యిందని వైద్యులు తెలిపారని ఆయన తన సామాజిక మాద్యమం ట్విట్టర్లో తెలిపారు.

ఈ మేరకు ఇవాళ ఉదయం ఆయన తాజాగా చేసిన ట్వీట్ లో ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే తాను ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్నానని.. వైద్యుల సూచనల మేరకు గృహంలో స్వియ నిర్భంధంలో (హోం ఐసోలేషన్) వుంటున్నానని అన్నారు. కరోనా సోకినా తనకు ఎలాంటి లక్షణాలు లేవని, ఏ అనారోగ్య సమస్యలు కూడా  లేవని, తాను అరోగ్యంగా వున్నానని తెలిపారు. అయితే కరోనా నుంచి బయటపడేందుకు డాక్టర్ల సూచనలను తప్పక పాటిస్తున్నానని ఆయన పేర్కోన్నారు, తనకు కరోనా పాజిటివ్‌‌‌‌‌గా నిర్ధారణ అయినట్లు స్వయంగా ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ప్రకటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles