Man held for duping 200 as plasma donor కరోనాతో గేమ్స్: ప్లాస్మా దానం పేరుతో 200 మందికి టోకరా..

Man who duped 200 as plasma donor arrested in hyderabad

reddy sandeep, corona positive, corona plasma, plasme donation, covid postive, Hyderabad, transport charges, Task Force police, Sandeep Reddy, Plasma, COVID-19 patients, blood plasma, coronavirus in telangana, coronavirus news, coronavirus spread, coronavirus scare, coronavirus outbreak, Rajam, Srikakulam, Hyderabad police, Telangana, Crime

A 25-year-old man from AP was arrested for cheating over 200 people, including many from Hyderabad, by promising to donate his plasma and collecting money from them towards transport charges. Task Force police said Sandeep Reddy posed as a plasma donor and duped several people by collecting amounts ranging from Rs 300 to Rs 5,000.

కరోనాతో గేమ్స్: ప్లాస్మా దానం పేరుతో 200 మందికి టోకరా..

Posted: 07/21/2020 03:20 PM IST
Man who duped 200 as plasma donor arrested in hyderabad

ప్రపంచవ్యాప్తంగా కరాళ నృత్యం చేస్తున్న కరోనా మహమ్మారి పేరు చెబితేనే అటు ప్రభుత్వాలు.. ఇటు సాధారణ ప్రజల వరకూ అందరూ వణికిపోతుంటే.. ఈ మాయగాడు మాత్రం దానితో కూడా సిల్లి గేమ్స్ అడేసి.. సోమ్ము చేసుకున్నాడు. పాపం పండిన తరువాత ఎంతటివారైనా అరదండాలు తప్పవన్న విషయం పోలీసుల అదుపులో వెళ్లగానే బోధపడింది. ఇంతకీ ఈ ఘనుడు ఆడిన సిల్లీ గేమ్స్ ఏంటో తెలుసా.? కరోనా మహమ్మారి సోకి రెండవ, మూడవ దశలో వున్న రోగులకు తన ఫ్లాస్మాను దానంగా ఇస్తానని రోగుల బంధువులను నమ్మించి వారి నుంచి దారి ఖర్చులంటూ, కరోనా జయించేందుకు అత్యవసరమైన మూలికలంటూ మోసాలకు తెరలేపాడు.

నేను కరోనాను జయించాను.. ప్లాస్మా దానానికి సిద్ధం అంటూ ఏకంగా 200 మంది మోసగించిన కేటుగాడిని ఎట్టకేలకు హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వివరా్లలోకి వెళ్తే  శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం పోనూగూటివలసకు చెందిన రెడ్డి సందీప్‌(25) నాలుగేళ్ల క్రితం డిగ్రీ పూర్తి చేశాడు. ఉద్యోగం కోసం అన్వేషణ సాగించాడు. ఉద్యోగాలు లభించినా జీతం పెద్దగా లేదు. జీతం పెద్దగా వున్న ఉద్యోగాలకు అతని అనుభవం సరిపోదు. దీంతో ఉద్యోగం లభించక.. చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో కన్నాలు వేయడమే ప్రవృత్తిగా మార్చుకున్నాడు. విశాఖపట్నంలోని టూ టౌన్ పోలిస్ స్టేషన్ తో పాటు, ద్వారకా పోలిస్ స్టేషన్ల పరిధిలో దొంగతనాలకు పాల్పడి పోలీసులకు చిక్కాడు.

కొద్ది నెలల పాటు జైలులో శిక్షను అనుభవించి సందీప్.. బయటికు వచ్చేసరికే కరోనా విజృంభిస్తోంది. పట్టభద్రుడు కావడంతో తన తెలివిని అక్రమంగానే వినియోగించుకున్నాడు. అంతే కరోనా మహమ్మారి బారిన పడిన వారు దానిని జయించిన వారి ప్లాస్మా సాయంతో కొలుకుంటారన్న వార్తను తెలుసుకున్నాడు. తన మెదడుకు పదను పెట్టి.. ప్లాస్మాకు ఏర్పడిన భారీ డిమాండ్‌ ను తాను సొమ్ము చేసుకోవాలని భావించాడు. అనుకున్నదే తడవుగా సోషల్ మీడియా ద్వారా నుంచి ప్లాస్మా అవసరమైన రోగుల వివరాలు.. వారి ఫోన్‌ నంబర్లను సేకరించాడు. కరోనా సోకడంతో అసలే తీవ్ర దిగ్భ్రాంతికి గురైన ఆ కుటుంబానికి కాల్‌ చేసి వారిలో లేని ఆశలు రేపి.. మోసం చేయడమే పనిగా పెట్టుకున్నాడు.

అదెలా అంటే తాను కరోనా పాజిటివ్ ను జయించానని, తన ప్లాస్మా దానానికి సిద్ధమని నమ్మబలికేవాడు. అయితే తాను ప్రస్తుతం దూరంగా వున్నానని, ఆసుపత్రికి చేరుకునేందుకు ప్రత్యేకంగా కారులో రావాల్సి వుంటుంది కాబట్టి తన రవాణా ఖర్చులు మీరే భరించాలంటూ కోరేవాడు. అవతలివైపు నుంచి ఆన్‌లైన్‌ ద్వారా డబ్బులు వేయించుకుని తీరా ముఖం చాటేసేవాడు. ఇదే తరహాలో కొవిడ్‌-19 నియంత్రణ ఔషధాల పేరిట కూడా మోసాలకు పాల్పడ్డాడు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు తూర్పు మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఈ మోసగాడి జాడను కనిపెట్టి నగరంలో అదుపులోకి తీసుకున్నారు. ఇతనిపై బంజారాహిల్స్‌, రాంగోపాల్‌పేట్‌, సీసీఎస్‌, పంజాగుట్టలో ఇప్పటికే ఈ తరహా కేసులు నమోదైనట్లు గుర్తించారు. అనంతరం పంజాగుట్ట పోలీసులకు అప్పగించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles