Government Warns Against Use Of N-95 Masks ఎన్ 95 వాల్వ్ మాస్కులను ధరించడం హానికరం

Government warns against use of n 95 masks with valves

Coronavirus, N-95 masks, Government, valved respirator masks, Director-General of Health Services (DGHS), States, Health Ministry, Health workers

The Centre has written to all states and union territories warning against the use of N-95 masks with valved respirators by people, saying these do not prevent the virus from spreading out and are 'detrimental' to the measures adopted for its containment.

ఎన్ 95 వాల్వ్ మాస్కులను ధరించడం హానికరం

Posted: 07/21/2020 01:54 PM IST
Government warns against use of n 95 masks with valves

(Image source from: in.reuters.com)

క‌రోనా వైర‌స్ సంక్షోభం నేప‌థ్యంలో జ‌నం అంతా మాస్క్‌లు ధ‌రిస్తున్నారు. అయితే ఎన్‌95 మాస్క్ లు ధ‌రిస్తున్న వారికి కేంద్రం హెచ్చ‌రిక జారీ చేసింది. గాలి పీల్చే వాల్వ్‌ లు ఉన్న ఎన్‌95 మాస్క్‌లు హానిక‌ర‌మ‌ని కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. ఇలాంటి మాస్కులు.. వైర‌స్ వ్యాప్తిని నియంత్రించ‌లేవ‌ని ఆరోగ్య‌శాఖ‌కు చెందిన డైర‌క్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ హెల్త్ స‌ర్వీస్‌స్ పేర్కొన్న‌ది. ఈ మేరకు ఆయన కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రికి ఓ లేఖ రాశారు. దీంతో ఆయన లేఖను పరిగణలోకి తీసుకున్న కేంద్రం ఈ మేరకు అన్ని రాష్ట్ర ప్ర‌భుత్వాల ఆరోగ్యశాఖ కార్య‌ద‌ర్శుల‌కు, కేంద్రపాలిత ప్రాంతాలకు, వైద్య విద్యా సంస్థ‌ల‌కు.. కేంద్ర ఆరోగ్య‌శాఖ ఓ స‌ర్య్యూల‌ర్ జారీ చేసింది.

దేశ‌వ్యాప్తంగా త‌ప్పుడు ప‌ద్ధ‌తిలో ఎన్‌95 మాస్క్ ల‌ను ధ‌రిస్తున్న‌ట్లు ఆరోగ్య శాఖ ఆరోపించింది. హెల్త్ వ‌ర్క‌ర్లు కాకుండా ఇత‌ర ప్ర‌జ‌లు గాలి పీల్చే వాల్వ్ ఉన్న ఎన్‌95 మాస్కులు వాడుతున్న‌ట్లు తెలియ‌జేసింది. అయితే సాధార‌ణ ప్ర‌జ‌లు ఇంట్లో త‌యారు చేసిన ముఖం మాస్కుల‌ను మాత్ర‌మే వాడాల‌ని డీజీహెచ్ఎస్ త‌న ఆదేశాల్లో స్ప‌ష్టం చేసింది. డీజీహెచ్ఎస్ అధిప‌తి రాజివ్ గార్గ్ ఈ నేప‌థ్యంలో రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు లేఖ రాశారు. అయితే మాస్క్ రంగుతో వైరస్ నియంత్రణకు ఎటువంటి సంబంధం లేద‌ని ఆరోగ్య‌శాఖ చెప్పింది. కానీ ప్ర‌తి రోజు సాధార‌ణ మాస్కుల‌ను 5 నిమిషాల పాటు వేడి నీటిలో ఉతకాల‌ని సూచించింది. ఉతికేట‌ప్పుడు ఉప్పు వేస్తే మంచిద‌ని పేర్కొన్న‌ది.

‘‘వాల్వ్ కలిగిన ఎన్ 95 ముసుగులు (మాస్కు) వాడడం సురక్షితం కాదని మీ దృష్టికి తీసుకువస్తున్నాను.. వాల్వ్ వున్న మాస్కుల వాడకం హానికరమని.. ఇది కరోనా వైరస్ వ్యాప్తిని నివారించడానికి తీసుకున్న చర్యలకు భంగం కలిగిస్తోంది. దీంతో కరోనావైరస్ నుంచి రక్షణ పోందే వాల్వ్ రహిత మాస్కులను ప్రజలు వినియోగించేలా చర్యలు తీసుకోవాలి. ఇంట్లో తయారు చేసిన కాటన్ మాస్కులే మరింత సురక్షితమని, వీటినే ప్రజలందరూ వాడేలా చూడాలని కోరుతున్నారు. ఈ విషయాన్ని సంబంధిత అధికారులందరికీ సూచించాల్సిందిగా కోరుతున్నాను’’ అని ఆయన కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శికి రాసిన లేఖలో పేర్కోన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles