A.P. govt. issues guidelines for use of high-end drugs కరోనా రోగులకు తీవ్రతను బట్టి మందులు..

Ap government releases new set of guidelines for the treatment of coronavirus

COVID-19, Coronavirus medicine, guidelines issued, high-end drugs, YSR Aarogyasri Health Care Trust, additional payment, utilisation evidence, Remidisivir, Meropenem, Tocilizumab, Vijayawada, Andhra Pradesh

The State government issued a G.O. allowing the YSR Aarogyasri Health Care Trust to pay additional amounts over and above the per-day packages for certain high-end drugs used in the treatment of COVID-19 patients, depending on the severity of the infection.

కరోనా రోగులకు తీవ్రతను బట్టి మందులు.. ప్రభుత్వ మార్గదర్శకాలు

Posted: 07/21/2020 06:04 PM IST
Ap government releases new set of guidelines for the treatment of coronavirus

ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉద్దృతి రోజు రోజుకి పెరగుతొంది. మహమ్మారి కరాళ నృత్యం చేస్తుండటంతో రాష్ట్ర ప్రజలు అందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. కరోనా కేసులు పెరగడంతో పాటు మరణాలు కూడా అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటుంది. కరోనా కట్టడికి సమర్ధంగా చర్యలు అమలు చేస్తున్నా రోజూ వేల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్న తరుణంలో భయాందోళనకు గురువుతున్న రాష్ట్ర ప్రజల్లకు పలు సూచనలు ఇస్తూనే.. ఇటు వైద్యులకు కూడా పలు సూచనలు జారీ చేస్తోంది. ఇక కరోనా రోగులకు సంబంధించి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఔషధాల వాడకంపై మార్గ దర్శకాలు విడుదల చేసింది.

కరోనా తీవ్రత ఆధారంగా ఏ మందులు వాడాలి అనే దాని మీద పలు సూచనలు కూడా చేసింది. ఏవి పడితే అవి వినియోగించకుండా కొన్ని మార్గదర్శకాలను రోగుల సౌలబ్యం కోసం విడుదల చేసింది. సైటోకైన్‌ స్టార్మ్‌ సిండ్రోం ఉన్న దశలో తోసిలిజుమాంబ్‌ ఇంజక్షన్‌ వాడమని రోగులకు సూచించింది. ఒకవేళ కరోనా తీవ్రత తక్కువగా ఉంది అనుకుంటే ఫావిపిరావిర్‌ మాత్రలు ఇవ్వమని స్పష్టం చేసింది. కరోనా తీవ్రత క్రమంగా పెరగడం, ప్రాణాల మీదకు వచ్చే అవకాశం ఉంటే మాత్రం రెమిడెసివిర్‌ ఇవ్వాలని తన ఆదేశాల్లో పేర్కొంది. సెప్సిస్‌ లేదా సెప్టిక్‌ షాక్‌ వంటి పరిస్థితిలో రోగులు ఉంటే వారి కి మెరొపెనం ఇంజక్షన్‌ను ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక ప్రభుత్వం సూచించిన ధరలనే వసూలు చేయాలి గాని ఎక్కువ వసూలు చేస్తే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles