TTD stoped issuing Tokens for darshan తిరుమలపై కరోనా కలకలం.. శ్రీవారి టోకన్ల జారీ నిలిపివేత

Ttd stoped issuing tokens for lord venkateshwara darshan

Srinivasa Murthy Deekshitulu, TTD former chief priest, Coronavirus in Tirumala, Ramana Deekshitulu, Ramana Deekshitulu on corona, Ramana Deekshitulu on TTD officials, Coronavirus on seven hills Shrine, Coronavirus to TTD priests, coronavirus to TTD Employees, coronavirus TTD staff, TTD meet amid coronavirus, TTD priests, TTD staff, TTD Employees, coronavirus, covid-19, lockdown, chittor collector, Bharat Gupta, Tirumala, Turupati, Andhra pradesh

After former chief priest of Lord Venkateshwara temple on Tirumala Ramana Deekshitulu who had made critics on TTD. Now TTD board had taken his comments into consideration and stoped the Time Slot Tokens for devottes

తిరుమలపై కరోనా కలకలం.. శ్రీవారి టోకన్ల జారీ నిలిపివేత

Posted: 07/21/2020 12:44 PM IST
Ttd stoped issuing tokens for lord venkateshwara darshan

దేశంలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతుంది. అక్కడి, ఇక్కడ అన్న తేడా లేకుండా ఎక్కడబడితే అక్కడకు చోచ్చుకెళ్తోంది. కరోనా రోగి శ్రీవారి దర్శనం చేసుకోవడంతో తిరుమల కోండపై ఆఘమేఘాల మీద శానిటైజ్ చేసిన అధికారులు శ్రీవారి దర్శనాన్ని కూడా నిలిపివేశారు. దేశంలో లాక్ డౌన్ విధింపుతో సుమారు 80 రోజుల పాటు భక్తుల తాకిడి లేకుండా వెలవెలబోయిన కలియుగ వైకుంఠంలో అన్ లాక్ 1.0 మార్గదర్శకాలతో ప్రత్యక్ష దైవం శ్రీవారి దర్శనానికి ద్వారాలు తెరుచుకున్నాయి. ఈ తరుణంలో పవిత్ర కోండపై కరోనా కలకలం రేగింది. కలియుగ దైవం తిరుమల శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు శ్రీనివాసమూర్తి దీక్షితులు కరోనా కారణంగా కన్నుమూయడం కలకలం రేపింది.

ఇప్పటికే తిరుమల అర్చక సిబ్బందిలోని 18 మందికి కరోనా వ్యాపించిందని, వారంతా ఐసోలేషన్ లో వున్నారన్న విషయం తెలిసిందే. ఇక పెద్ద జీయ్యంగార్ స్వామి కూడా కరోనా ప్రభావానికి గురికావడంతో ఆయనను తిరుమల అధికారులు శ్రీ వెంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆప్ మెడికల్ సైన్సెస్ (స్విమ్స్)లోని శ్రీ పద్మావతి అసుపత్రిలో చేర్పించారు. ఆయన పరిస్థితి నిలకడగానే వుండటంతో టీటీడీ అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు, ఆయనను నిత్యం వైద్యాధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఇక టీటీడీ నిత్య కైంకర్యాల పర్యవేక్షకులుగా వున్నా మరో అర్చకుడి పరిస్థితి కూడా విషమంగా వుందని సమాచారం, ఆయనను చెన్నైలోని అపోలో అసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు.

దీంతో రంగంలోకి దిగిన ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు టీటీడీ బోర్డుపై తన అసంతృప్తిని వెళ్లగక్కిన విషయం కూడా తెలిసిందే.  అధికారులు ఇప్పటికైనా భక్తుల దర్శనాలను నిలిపివేయాలని నేరుగా సోషల్ మీడియాలో టీటీడీ బోర్డుపై విమర్శలు సందించారు. తిరుమల దర్శనాలను నిలిపివేయాలని తాను కోరినా అందుకు టీటీడీ బోర్డు అడ్డుపడుతోందని వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలను తొలుత విభేధించిన చైర్మన్ సుబ్బారెడ్డి, తరువాత సవరించుకున్నారు. పరిస్థితిని సమీక్షించి బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇక తాజాగా భక్తులకు జారీ చేసే సర్వ దర్శన టైమ్ స్లాట్ టోకన్లను నిలిపివేస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు.  

ఏకాంతంగా అమ్మవారి వరలక్ష్మీ వత్రం

 

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఈనెల 31న వరలక్ష్మీ వ్రతం ఏకాంతంగా నిర్వహిస్తున్నట్లు టీటీడీ జేఈవో పి.బసంత్ కుమార్‌ తెలిపారు. భక్తుల కోరిక మేరకు ఆన్ లైన్‌ ద్వారా ఇంటి నుంచే వ్రతంలో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి ఏడాది పవిత్రమైన శ్రావణ మాసంలో నిర్వహించే వరలక్ష్మీ వ్రతాన్ని 31న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వర్చువల్‌ చేయాలని టీటీడీ నిర్ణయించిందని వివరించారు.  దేశ, విదేశాలల్లోని భక్తులు అమ్మవారి ఆలయంలో నిర్వహించే ఈ వ్రతాన్ని తమ తమ నివాస ప్రాంతాల నుంచి ఎస్పీబీసీ ప్రత్యేక్ష ప్రసారం ద్వారా వీక్షించి పాల్గొనే అవకాశం టీటీడీ కల్పిస్తుందని వెల్లడించారు. వరలక్ష్మీవ్రతం టికెట్లు ఈ నెల 22 సాయంత్రం 5 గంటల నుంచి 30వ తేదీ వరకు టీటీడీ వెబ్ సైట్‌ ద్వారా పొందవచ్చని సూచించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles