No more lockdowns in India, only Unlocking: PM Modi దేశంలో లాక్ డౌన్ విధింపుపై ప్రధాని మోదీ క్లారిటీ.!

Pm modi finally clarifies on lockdown rumours asks cms to get ready unlock

coronavirus, covid-19, union government, state government, Lockdown, Unlock 1.0, Unlock 2.0, PM Modi, Narendra Modi, CM KCR, Telangana, national politics

Prime Minister Narendra Modi made it clear that the era of lockdowns has come to an end and it was time for unlocking India. He was reponding to a request made by Chief Minister K Chandrashekhar Rao to clarify on the issue amidst speculations of reimposing lockdown in the country.

దేశంలో లాక్ డౌన్ విధింపుపై ప్రధాని మోదీ క్లారిటీ.!

Posted: 06/17/2020 09:39 PM IST
Pm modi finally clarifies on lockdown rumours asks cms to get ready unlock

కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్రం విధించిన లాక్ డౌన్ ఆంక్షల నుంచి తొలిసారిగా దేశంలోని జనజీవనం ప్రారంభమైంది. ఈ క్రమంలో దేశంలోని పలు రాష్ట్రాలలో కరోనా మహమ్మారి కదం తోక్కుతోంది. దీంతో కరోనా కేసులు అధికంగా వెలుగుచూస్తున్న ప్రాంతాల్లో కేంద్రప్రభుత్వం, సహా రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ దిశగా యోచిస్తున్నాయన్న వార్తలు వెలుగుచూశాయి. ఇందుకు తమిళనాడు ప్రభుత్వం చెన్నై సహ నాలుగు జిల్లాల్లో ఈ నెల 19 నుంచి 30 వరకు లాక్ డౌన్ విధించడం కూడా ఈ వార్తలను బలపర్చింది. అయితే ఈ విషయంలో గత వారం రోజులుగా అనేక ఊహాగానాలు సోషల్ మీడియా వేదకగా సాగుతున్నాయి. దీంతో లాక్ డౌనా.? లేక అన్ లాకా.? అన్న అంశంలో ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చారు దేశ ప్రధని నరేంద్రమోదీ.

దేశంలో మరోమారు లాక్ డౌన్ వుండదని క్లారిటీఇచ్చారు. అంతేకాదు ప్రస్తుతం దేశంలో అన్ లాక్ 1.0 కొనసాగుతున్న క్రమంలో అన్ లాక్ 2.0ను ఎలా అమలు చేయాలా.? అన్న అంశంపై మాత్రమే సీఎంలతో వీడియో కాన్పరెన్స్ నిర్వహించామని అన్నారు. సీఎం కేసీఆర్ లాక్ డౌన్ అంశాన్ని ప్రస్తావించి స్పష్టత కోరిన తరుణంలో ఇక దేశంలో లాక్ డౌన్ దశ ముగిసిందని.. అన్ లాక్ దశ ప్రారంభమైందని అన్నారు. దీంతో అన్ లాక్ 2.0పైనే దృష్టిసారించారని ప్రధానమంత్రి సీఎంలకు క్లారిటీ ఇచ్చారు. లాక్ డౌన్ సమయంలో ప్రజలు క్రమశిక్షణతో వ్యవహరించిన కారణంగా కరోనా వ్యాప్తిని అధికసంఖ్యలో సోకకుండా అడ్డుకోవడంలో విజయం సాధించామని అన్నారు. అదే సమయంలో కరోనా సోకిన రోగులను వివక్షతో చూడవద్దని ప్రధాని సూచించారు.

రాష్ట్రాలు కరోనా టెస్టుల సంఖ్యను మరింత పెంచాలని, వైద్య సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య పెరుగుతుందని అన్నారు. దేశంలో కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య కూడా పెంచాలని.. దీంతో బాధితులను ఐసోలేషన్ కు తరలించిన వైద్యం అందించగలమని అన్నారు.  ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సుమారు 900 కరోనా పరీక్ష కేంద్రాలు ఉన్నాయని.. లక్షల సంఖ్యలో కరోనా ప్రత్యేక పడకలతో కూడిన అసుపత్రులు కూడా సిద్దంగా వున్నాయన్నారు. ఇక ఆక్సిజన్‌ సదుపాయంతో వేల సంఖ్యలో క్వారంటైన్‌, ఐసోలేషన్‌ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయని ప్రధాని తెలిపారు. 

‘కరోనాపై పోరాటంలో మన సహచరులను వివక్షకు గురికాకుండా చూడాల్సిన బాధ్యత కూడా మనపై వుందన్నారు. వైరస్ తమకు సోకుతుందన్న భయంతో బాధితులను సామాజికంగా దూరంగా పెట్టరాదని అన్నారు. ఇది భావోద్వేగంతో కూడిన అంశమని ప్రధాని అన్నారు. దేశంలో ప్రస్తుతం కరోనా నుంచి కోలుకునే వారి సంఖ్య వేగంగా పెరుగుతుందని ప్రసుత్తం ఇది రమారమి 53శాతంగా ఉందని అన్నారు.అయితే వైద్యులు, కేంద్ర ఆరోగ్యశాఖ సూచించినట్లుగా ప్రజలు మాస్కులు ధరించి.. బౌతిక దూరం పాటిస్తే కరోనాను దేశం నుంచి పారద్రోలడం కష్టమేమి కాదన్నారు. అయితే కరోనా వ్యాప్తి నియంత్రణ సూచనలు ఉల్లంఘించడంతో రోజు వేలాది మంది దీని బారిన పడుతున్నారని ఆయన అవేదన వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : coronavirus  covid-19  union government  state government  Lockdown  

Other Articles